శ్రీమద్ భగవద్ గీత తృతీయోఽధ్యాయః
అథ తృతీయోఽధ్యాయః |
ఇష్టాన్భోగాన్హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః |
తైర్దత్తానప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః ‖ 12 ‖
యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః |
భుంజతే తే త్వఘం పాపా యే పచంత్యాత్మకారణాత్ ‖ 13 ‖
భావం : యజ్ఞాలు చేసి దేవతలకు అర్పించగా మిగిలిన పదార్ధలు భుజించే సజ్జనులు సర్వపాపాలనుంచి విముక్తు లవుతున్నారు. అలా కాకుండా తమ కోసమే వండుకుంటున్న వాళ్లు పాపమే తింటున్నారు.
అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః |
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ‖ 14 ‖
భావం : అన్నంవల్ల సర్వప్రాణులు వుడుతున్నాయి. వర్షంవల్ల అన్నం లభిస్తున్నది. యజ్ఞం మూలంగా వర్షం కలుగుతున్నది. యజ్ఞం సత్కర్మల వల్ల సంభవిస్తుంది.
కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవమ్ |
తస్మాత్సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్ ‖ 15 ‖
భావం : కర్మ వేదం నుంచి పుట్టింది. పరమాత్మ వల్ల వేదం వెలసింది. అంతటా వ్యాపించిన పరమాత్మ అందువల్లనే యజ్ఞంలో ఎప్పుడూ వుంటాడు.
అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి ‖ 16 ‖
భావం : పార్ధ! ఇలా తిరుగుతున్న జగత్ చక్రాన్ని అనుసరించనివాడు పాపి, ఇంద్రియ లోలుడు, అలాంటివాడి జీవితం వ్యర్ధం.
యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః |
ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే ‖ 17 ‖
భావం : ఆత్మలోనే ఆసక్తి, సంతృప్తి, సంతోషం పొందేవాడికి విద్యుక్తకర్మ లేవీ వుండవు.
నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన |
న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః ‖ 18 ‖
భావం : అలాంటి ఆత్మజ్ఞానికి ఈ లోకంలో కర్మలు చేయడంవల్ల కాని, మానడంవల్ల కాని ప్రయోజనం లేదు. స్వార్ధదృష్టితో సృష్టిలో దేనినీ అతను ఆశ్రయించడు.
తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర |
అసక్తో హ్యాచరన్కర్మ పరమాప్నోతి పూరుషః ‖ 19 ‖
భావం : అందువల్ల నిరంతరం నిష్కామంగా కర్మలు ఆచరించు. అలా ఫలా పేక్ష లేకుండా కర్మలు చేసేవాళ్లకు మోక్షం కలుగుతుంది.
కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః |
లోకసంగ్రహమేవాపి సంపశ్యన్కర్తుమర్హసి ‖ 20 ‖
భావం : జనకుడు మొదలైనవారు నిష్కామకర్మతోనే మోక్షం పొందారు. లోకక్షేమం కోసమైనా నీవు సత్కర్మలు చేయాలి.
యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః |
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ‖ 21 ‖
భావం : ఉత్తముడు చేసిన పనినే ఇతరులు కూడా అనుకరిస్తారు. అతను నెలకొల్పన ప్రమాణాలనే లోకం అనుకరిస్తుంది.
న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన |
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి ‖ 22 ‖
భావం : పార్ధ! ముల్లోకాలలోనూ నేను చేయవలసిన పని ఏమి లేదు. నాకు లేనిదికాని, కావలసిందికాని ఏమి లేకపోయినప్పటికీ లోకవ్యవహారాలు నిత్యమూ నిర్వహిస్తూనే వున్నాను.
3వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Bhagavad Gita Slokas with Audios in English Click Here
bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 3rd chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning
భావం : పార్ధ! ముల్లోకాలలోనూ నేను చేయవలసిన పని ఏమి లేదు. నాకు లేనిదికాని, కావలసిందికాని ఏమి లేకపోయినప్పటికీ లోకవ్యవహారాలు నిత్యమూ నిర్వహిస్తూనే వున్నాను.
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Bhagavad Gita Slokas with Audios in English Click Here