Bhagavad Gita 1st Chapter Lyrics Meaning Audio in Telugu | సరళమైన తెలుగు లో భగవద్గీత 1వ అధ్యాయం

భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవడానికి వీలుగా హైందవి వారి సహకారంతో ఇక్కడ ఆడియో లు కూడా ఇవ్వడం జరిగింది.  గురుశిష్య విధానం లో నేర్చుకోవడానికి వీలుగా ఈ ఆడియో లు ఉంటాయి . హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం , కనకధారా స్తోత్రం నేర్చుకుంటున్న సమయం లో లిరిక్స్ ఇంగ్లీష్ లో కూడా కావాలని చాలామంది కామెంట్ చేసారు అందువలన ఇంగ్లీష్ లో కూడా ఇవ్వడం జరిగింది. భావాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు  ప్రచురించిన భగవద్గీత పుస్తకం నుంచి తీసుకోవడం జరిగింది. మీ సలహాలు , మీ అభిప్రాయాలను కామెంట్ చేస్తే తగిన మార్పులు చేస్తాము . 

భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి


భగవద్గీత మొదటి అధ్యాయం లో మొత్తం 47 శ్లోకాలు ఉన్నాయి . దృతరాష్ట్రుడు సంజయుడితో మావాళ్లు పాండవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం లో ఏమి చేస్తున్నారు అని అడగడం తో ఈ అధ్యాయం ప్రారంభమౌతుంది .

Bhagavad Gita 1 Chapter Learning Audio 1 to 12 Slokas

śrīmad bhagavad gīta prathamoadhyāyaḥ
atha prathamoadhyāyaḥ |
అథ ప్రథమోఽధ్యాయః |

dhṛtarāśhṭra uvācha |
ధృతరాష్ట్ర ఉవాచ |

dharmakśhetre kurukśhetre samavetā yuyutsavaḥ |
māmakāḥ pāṇḍavāśchaiva kimakurvata sañjaya || 1 ||

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ‖ 1 ‖


భావం : సంజయా ! ధర్మానికి నిలయంమైన  కూరుక్షేత్రంలో యుద్ద సన్నద్ధులై నిలచిన నా వాళ్ళు, పాండవులు ఏం చేశారు. 

sañjaya uvācha |
సంజయ ఉవాచ |

dṛśhṭvā tu pāṇḍavānīkaṃ vyūḍhaṃ duryodhanastadā |
āchāryamupasaṅgamya rājā vachanamabravīt || 2 ||

దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా |
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ‖ 2 ‖
భావం : యుద్దానికి సంసిద్దులై పున్న పాండవ సైన్యాలను చూసి,ధుర్యోధనుడు ద్రోణచార్యుల దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు. 

paśyaitāṃ pāṇḍuputrāṇāmāchārya mahatīṃ chamūm |
vyūḍhāṃ drupadaputreṇa tava śiśhyeṇa dhīmatā || 3 ||

పశ్యైతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చమూమ్ |
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ‖ 3 ‖
భావం : ఆచార్య ! మీ శిష్యుడు ధీషుంతుడు అయిన దృష్టద్యుమ్ముడు వ్యూహం పన్నిన మహా సైన్యాన్ని చూడండి.

atra śūrā maheśhvāsā bhīmārjunasamā yudhi |
yuyudhāno virāṭaścha drupadaścha mahārathaḥ || 4 ||

అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి |
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ‖ 4 ‖


dhṛśhṭaketuśchekitānaḥ kāśirājaścha vīryavān |
purujitkuntibhojaścha śaibyaścha narapuṅgavaḥ || 5 ||

ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్ |
పురుజిత్కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ‖ 5 ‖


yudhāmanyuścha vikrānta uttamaujāścha vīryavān |
saubhadro draupadeyāścha sarva eva mahārathāḥ || 6 ||

యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ‖ 6 ‖

భావం : ఈ పాండవుల సైన్యం ధైర్య సాహసవంతులు అస్త్ర విద్యా నిపుణులు, శౌర్యంలో భిమార్జున సమానులు ఉన్నారు. సాత్య విరాటుడు ధ్రుపదుడు, దృష్టకేతుడు, చేకితాసుడు, కాశీ రాజు పురుజిత్తు, శైబుడు, యుధామాన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు కూడా ఉన్నారు, వీళ్ళంతా మహారధులే. 

asmākaṃ tu viśiśhṭā ye tānnibodha dvijottama |
nāyakā mama sainyasya saṃGYārthaṃ tānbravīmi te || 7 ||

అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ |
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్బ్రవీమి తే ‖ 7 ‖


భావం : బ్రహ్మణోత్తమ ! ఇక మన సైన్యంలో వున్న నాయకులూ, సుప్రసిద్దులూ,అయిన వాళ్ల గురించి కూడా చెబుతాను. 

bhavānbhīśhmaścha karṇaścha kṛpaścha samitiñjayaḥ |
aśvatthāmā vikarṇaścha saumadattistathaiva cha || 8 ||

భవాన్భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః |
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ ‖ 8 ‖

anye cha bahavaḥ śūrā madarthe tyaktajīvitāḥ |
nānāśastrapraharaṇāḥ sarve yuddhaviśāradāḥ || 9 ||

అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః |
నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ‖ 9 ‖


భావం : మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామా, వికర్ణుడు, సౌమధత్తి ఉన్నారు. ఇంకా ఎంతో మంది శురాగ్రేసరులు, యుద్దావిశారదులు, నా కోసం జీవితాల మీద ఆశా వదిలి సిద్ధంగా ఉన్నారు.   

aparyāptaṃ tadasmākaṃ balaṃ bhīśhmābhirakśhitam |
paryāptaṃ tvidameteśhāṃ balaṃ bhīmābhirakśhitam || 10 ||

అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ |
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్ ‖ 10 ‖


భావం : భీష్ముడు రక్షిస్తున్న మన సైన్యం అపరిమితం, భీముడి రక్షణలో వున్న పాండవ సైన్యం పరిమితం. 

ayaneśhu cha sarveśhu yathābhāgamavasthitāḥ |
bhīśhmamevābhirakśhantu bhavantaḥ sarva eva hi || 11 ||

అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః |
భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి ‖ 11 ‖

భావం : అందువల్ల మీరంతా యుద్ద రంగంలో మీ మీ స్థానంలు వదిలిపెట్టకుండా ఉండి భీష్ముడిని కాపాడాలి. 

tasya sañjanayanharśhaṃ kuruvṛddhaḥ pitāmahaḥ |
siṃhanādaṃ vinadyochchaiḥ śaṅkhaṃ dadhmau pratāpavān || 12 ||

తస్య సంజనయన్హర్షం కురువృద్ధః పితామహః |
సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ‖ 12 ‖


భావం : అలా అంటున్న దుర్యోధనుడికి సంతోషం కలిగిస్తూ కురువృద్ధుడైన  భీష్ముడు సింహనాదం చేసి శంఖం పూరించాడు. 
Bhagavad Gita 1st Chapter Learning Audio 13 to 24 Slokas: 


tataḥ śaṅkhāścha bheryaścha paṇavānakagomukhāḥ |
sahasaivābhyahanyanta sa śabdastumuloabhavat || 13 ||

తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః |
సహసైవాభ్యహన్యంత స శబ్దస్తుములోఽభవత్ ‖ 13 ‖

భావం : వెంటనే కౌరవవీరుల ధక్కమృదంగ గోముఖాది ధ్వనులతో ధిక్కులన్ని పిక్కటిల్లాయి.


tataḥ śvetairhayairyukte mahati syandane sthitau |
mādhavaḥ pāṇḍavaśchaiva divyau śaṅkhau pradaghmatuḥ || 14 ||

తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ |
మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదఘ్మతుః ‖ 14 ‖


భావం : అప్పడు తెల్లగుర్రాలు కట్టిన మహారధం మీద కూర్చున్న కృష్ణార్జునులు కూడా తమ దివ్య శంఖాలు పూరించారు. 

pāñchajanyaṃ hṛśhīkeśo devadattaṃ dhanañjayaḥ |
pauṇḍraṃ dadhmau mahāśaṅkhaṃ bhīmakarmā vṛkodaraḥ || 15 ||

పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః |
పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ‖ 15 ‖

anantavijayaṃ rājā kuntīputro yudhiśhṭhiraḥ |
nakulaḥ sahadevaścha sughośhamaṇipuśhpakau || 16 ||

అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః |
నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ‖ 16 ‖

kāśyaścha parameśhvāsaḥ śikhaṇḍī cha mahārathaḥ |
dhṛśhṭadyumno virāṭaścha sātyakiśchāparājitaḥ || 17 ||

కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః |
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ‖ 17 ‖

drupado draupadeyāścha sarvaśaḥ pṛthivīpate |
saubhadraścha mahābāhuḥ śaṅkhāndadhmuḥ pṛthakpṛthak || 18 ||

ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే |
సౌభద్రశ్చ మహాబాహుః శంఖాందధ్ముః పృథక్పృథక్ ‖ 18 ‖


భావం : శ్రీకృష్ణుడు పాంచజన్యంతో, అర్జునుడు దేవదత్తం, భీముడు పౌడ్రకం ఊదారు. ధర్మరాజు అనంత విజయం నకుల సహదేవులు, సుఘోష మణిపుష్పకాలు పురించారు. కాశీరాజు శిఖండి దృష్టద్యుమ్ముడు, విరాటుడు, సాత్యకి , ద్రుపదుడు, ఉప పాండవులు, అభిమన్యుడు, తమ తమ శంఖాలు అని వైపులా ఊదారు.

sa ghośho dhārtarāśhṭrāṇāṃ hṛdayāni vyadārayat |
nabhaścha pṛthivīṃ chaiva tumulo vyanunādayan || 19 ||

స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ |
నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ ‖ 19 ‖

భావం : ఆ శంఖ ద్వనులు భూమి ఆకాశాలను దద్ధరిల్లజేస్తూ, కౌరవ వీరుల హృదయాలను బద్ధలు చేశాయి. 


atha vyavasthitāndṛśhṭvā dhārtarāśhṭrānkapidhvajaḥ |
pravṛtte śastrasampāte dhanurudyamya pāṇḍavaḥ || 20 ||

అథ వ్యవస్థితాందృష్ట్వా ధార్తరాష్ట్రాన్కపిధ్వజః |
ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః ‖ 20 ‖

hṛśhīkeśaṃ tadā vākyamidamāha mahīpate|
senayorubhayormadhye rathaṃ sthāpaya meachyuta || 21 ||

హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే|
సేనయెరూభయోర్మధ్యే రథం స్థాపయ మేఽచ్యుత! || 21 ||

arjuna uvācha |
అర్జున ఉవాచ |

భావం : కురురాజా ! అప్పుడు అర్జునుడు యుద్దసన్నద్ధూలైన దుర్యోధనాదులను చూసి, గాండీవం ఎత్తినట్టి శ్రీ కృష్ణుడితో "అచ్యుతా రెండు సేనల మధ్య నా రధాన్ని నిలబెట్టు" అన్నాడు. 

yāvadetānnirīkśheahaṃ yoddhukāmānavasthitān |
kairmayā saha yoddhavyamasminraṇasamudyame || 22 ||

యావదేతాన్నిరీక్షేఽహం యోద్ధుకామానవస్థితాన్ |
కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్రణసముద్యమే ‖ 22 ‖

yotsyamānānavekśheahaṃ ya eteatra samāgatāḥ |
dhārtarāśhṭrasya durbuddheryuddhe priyachikīrśhavaḥ || 23 ||

యోత్స్యమానానవేక్షేఽహం య ఏతేఽత్ర సమాగతాః |
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః ‖ 23 ‖


భావం : "కృష్ణా! శత్రు వీరులను చూడనీ, దుష్టుడైన దుర్యోధనుడికి సాయం చేయడానికి సమర రంగానికి వచ్చిన వాళ్ళందరిని చూడాలనుకుంటున్నాను" అన్నాడు అర్జునాడు.   
sañjaya uvācha |
సంజయ ఉవాచ |

evamukto hṛśhīkeśo guḍākeśena bhārata |
senayorubhayormadhye sthāpayitvā rathottamam || 24 ||

ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత |
సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ ‖ 24 ‖
Bhagavad Gita 1st Chapter Learning Audio 25 to 36 Slokas: 

bhīśhmadroṇapramukhataḥ sarveśhāṃ cha mahīkśhitām |
uvācha pārtha paśyaitānsamavetānkurūniti || 25 ||

భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ |
ఉవాచ పార్థ పశ్యైతాన్సమవేతాన్కురూనితి ‖ 25 ‖

భావం : సంజాయుడు-ధృతరాష్ట్ర ! అర్జునుడి మాటలు ఆలకించిన శ్రీకృష్ణుడు రెండు సేనల మధ్య భీష్మద్రోణుల ఎదురుగా రధం ఆపి, అక్కడకి చేరిన కౌరవ బలాన్ని అవలోకించమన్నాడు.

tatrāpaśyatsthitānpārthaḥ pitRRīnatha pitāmahān |
āchāryānmātulānbhrātRRīnputrānpautrānsakhīṃstathā || 26 ||

తత్రాపశ్యత్స్థితాన్పార్థః పితౄనథ పితామహాన్ |
ఆచార్యాన్మాతులాన్భ్రాతౄన్పుత్రాన్పౌత్రాన్సఖీంస్తథా ‖ 26 ‖

śvaśurānsuhṛdaśchaiva senayorubhayorapi |
tānsamīkśhya sa kaunteyaḥ sarvānbandhūnavasthitān || 27 ||

శ్వశురాన్సుహృదశ్చైవ సేనయోరుభయోరపి |
తాన్సమీక్ష్య స కౌంతేయః సర్వాన్బంధూనవస్థితాన్ ‖ 27 ‖

భావం : అప్పుడు అర్జునుడు ఉభయ సేనలలోను యుద్దానికి సిద్ధంగా ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, బంధువులందరిని చూశాడు. చూసి మిక్కిలి దయగలిగి దుఖిఃస్తు విశేషకృపతరంగుడూ, విషాదవశుడు అయి ఇలా అన్నాడు.  


kṛpayā parayāviśhṭo viśhīdannidamabravīt|

కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్|

arjuna uvācha |

అర్జున ఉవాచ |

dṛśhṭvemaṃ svajanaṃ kṛśhṇa yuyutsuṃ samupasthitam ‖ 28 ‖

దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ ‖ 28 ‖

sīdanti mama gātrāṇi mukhaṃ cha pariśuśhyati |
vepathuścha śarīre me romaharśhaścha jāyate ‖ 29 ‖

సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి |
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే ‖ 29 ‖

gāṇḍīvaṃ sraṃsate hastāttvakchaiva paridahyate |
na cha śaknomyavasthātuṃ bhramatīva cha me manaḥ ‖ 30 ‖

గాండీవం స్రంసతే హస్తాత్త్వక్చైవ పరిదహ్యతే |
న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః ‖ 30 ‖

భావం : కృష్ణా ! యుద్దసక్తులై ఎదురుగా ఉన్న చూట్టాలను చూడగానే నా హావభావాలు తడబడ్తున్నాయి. నోరు ఎండిపోతున్నది. శరీరమంతా గగుర్పాటు కంపిస్తుంది. గాండీవనం చేతిలోనుంచి జరిపోతున్నది. దేహం మండుతున్నది. నిలబడడానికి కూడా శక్తి లేదు. నా మనస్సు తల్లాడిల్లుతున్నది.   

nimittāni cha paśyāmi viparītāni keśava |
na cha śreyoanupaśyāmi hatvā svajanamāhave || 31 ||

నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ |
న చ శ్రేయోఽనుపశ్యామి హత్వా స్వజనమాహవే ‖ 31 ‖

భావం : కేశవా ! దుశ్శకునాలు కాన వస్తున్నాయి. యుద్దంలో బంధువులను చంపడం వల్ల కలిగే మేలు గోచరించడం లేదు. 
 

na kāṅkśhe vijayaṃ kṛśhṇa na cha rājyaṃ sukhāni cha |
kiṃ no rājyena govinda kiṃ bhogairjīvitena vā || 32 ||

న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ |
కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ‖ 32 ‖

భావం : కృష్ణా ! యుద్ద విజయం మీద, రాజ్యసుఖలామీద నాకు ఆసక్తి లేదు రాజ్య భోగలతో కుడిన జీవిత ప్రయోజనం ఏమి లేదు.  


yeśhāmarthe kāṅkśhitaṃ no rājyaṃ bhogāḥ sukhāni cha |
ta imeavasthitā yuddhe prāṇāṃstyaktvā dhanāni cha || 33 ||

యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ |
త ఇమేఽవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ‖ 33 || 

āchāryāḥ pitaraḥ putrāstathaiva cha pitāmahāḥ |
mātulāḥ śvaśurāḥ pautrāḥ śyālāḥ sambandhinastathā || 34 ||

ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః |
మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా ‖ 34 ‖

భావం : ఎవరి కోసం రాజ్యం, భోగం, సుఖం కోరుతున్నామో వాళ్ళంతా గురువులు, తండ్రులు, కుమారులు, తాతలు, మేనమామలు, మామలు, మనుములు, బావ, మరుదులు, ఇతర బంధువులు-ధనప్రాణాల మీద ఆశ వదిలి ఈ రణ రంగంలోనే వున్నారు.  


etānna hantumichChāmi ghnatoapi madhusūdana |
api trailokyarājyasya hetoḥ kiṃ nu mahīkṛte || 35 ||

ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోఽపి మధుసూదన |
అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే ‖ 35 ‖

భావం : మధుసూదనా ! వాళ్ళు నన్ను చంపితే చంపని, ముల్లోకాలని ఏలే అవకాశం కలిగిన నేను మాత్రం వాళ్ళను వధించదలచుకోలేదు. అలాంటప్పుడు ఈ రాజ్యం కోసం వాళ్ళని చంపుతానా?


nihatya dhārtarāśhṭrānnaḥ kā prītiḥ syājjanārdana |
pāpamevāśrayedasmānhatvaitānātatāyinaḥ || 36 ||

నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన |
పాపమేవాశ్రయేదస్మాన్హత్వైతానాతతాయినః ‖ 36 ‖

భావం : దుర్యోధనాదులను సంహరించి మనం పొందే సంతోషమేమిటి ? జనార్ధన! ఈ పాపాత్ములను చంపితే మనకూ పాపమే.  


Bhagavad Gita 1st Chapter Learning Audio 37 to 47 Slokas: 

tasmānnārhā vayaṃ hantuṃ dhārtarāśhṭrānsvabāndhavān |
svajanaṃ hi kathaṃ hatvā sukhinaḥ syāma mādhava || 37 ||

తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్స్వబాంధవాన్ |
స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ ‖ 37 ‖

భావం : బంధువులైన దుర్యోధనాదులను చంపడం వల్ల మనకు మంచిది కాదు. మాధవా !స్వజనాన్ని వధించి ఎలా సుఖపడగలం ? 

yadyapyete na paśyanti lobhopahatachetasaḥ |
kulakśhayakṛtaṃ dośhaṃ mitradrohe cha pātakam || 38 ||

యద్యప్యేతే న పశ్యంతి లోభోపహతచేతసః |
కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ ‖ 38 ‖

భావం : రాజ్యకాంక్ష పరులైన కౌరవుల వంశనాశనం, మిత్రద్రోహం వల్ల కలిగే పాతకాన్ని గ్రహించలేక పోతున్నారు.  

kathaṃ na GYeyamasmābhiḥ pāpādasmānnivartitum |
kulakśhayakṛtaṃ dośhaṃ prapaśyadbhirjanārdana || 39 ||

కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్ |
కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన ‖ 39 ‖

భావం : జనార్ధన! వంశ క్షయంవల్ల వచ్చే దోషాన్ని బాగా తెలిసిన మనం ఆ పాపం నుంచి ఎందుకు తప్పించుకోకూడదు? 


kulakśhaye praṇaśyanti kuladharmāḥ sanātanāḥ |
dharme naśhṭe kulaṃ kṛtsnamadharmoabhibhavatyuta || 40 ||

కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః |
ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మోఽభిభవత్యుత ‖ 40 ‖

భావం : వంశనాశనంతో ప్రాచీన కుల ధర్మాలు నశిస్తాయి. వంశమంతట అధర్మం అమలుకుంటుంది.  


adharmābhibhavātkṛśhṇa praduśhyanti kulastriyaḥ |
strīśhu duśhṭāsu vārśhṇeya jāyate varṇasaṅkaraḥ || 41 ||

అధర్మాభిభవాత్కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః |
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః ‖ 41 ‖

భావం : కృష్ణా ! అధర్మం ప్రబలితే కులస్త్రీలు చెడిపోతారు. దానితో జాతి సంకరం జరుగుతుంది. 
 

saṅkaro narakāyaiva kulaghnānāṃ kulasya cha |
patanti pitaro hyeśhāṃ luptapiṇḍodakakriyāḥ || 42 ||

సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ |
పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః ‖ 42 ‖

భావం : వర్ణసంకరంవల్ల, కులానికి కులనాశకులకు కలిగేది నరకమే. వారి పితృ దేవతలు పిండోదక లేక అధోగతి పాలవుతారు.


dośhairetaiḥ kulaghnānāṃ varṇasaṅkarakārakaiḥ |
utsādyante jātidharmāḥ kuladharmāścha śāśvatāḥ || 43 ||

దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః |
ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ‖ 43 ‖

భావం : కులాన్ని నాశనం చేసే వాళ్ల మూలంగా కలిగే వర్ణ సాంకర్యం కారణంగా శాశ్వతలైన జాతి ధర్మాలు, కుల ధర్మాలు అడుగంటి పోతాయి. 


utsannakuladharmāṇāṃ manuśhyāṇāṃ janārdana |
narakeaniyataṃ vāso bhavatītyanuśuśruma || 44 ||

ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన |
నరకేఽనియతం వాసో భవతీత్యనుశుశ్రుమ ‖ 44 ‖

భావం : జనార్ధన ! కుల ధర్మాలు నశించిన కుటుంబాల వారు శాశ్వత నరకవాసులావుతారని వింటున్నాము. 


aho bata mahatpāpaṃ kartuṃ vyavasitā vayam |
yadrājyasukhalobhena hantuṃ svajanamudyatāḥ || 45 ||

అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ |
యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః ‖ 45 ‖

భావం : ఎంత ఆశ్చర్యం! రాజ్య లోభంతో బంధువులను చంపడానికి పూనుకొని ఘోర పాపాలు చేయడానికి సిద్దపడ్డాము కదా ! 


yadi māmapratīkāramaśastraṃ śastrapāṇayaḥ |
dhārtarāśhṭrā raṇe hanyustanme kśhemataraṃ bhavet || 46 ||

యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః |
ధార్తరాష్ట్రా రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్ ‖ 46 ‖

భావం : ఆయుధాలు ధరించిన ధార్త రాష్ట్రులు అస్త్రశస్త్రాలు విసర్జించిన నన్ను యుద్దంలో సంహరిస్తే అది నాకు మరింత మంచిదే కదా.


sañjaya uvācha |
సంజయ ఉవాచ |

evamuktvārjunaḥ saṅkhye rathopastha upāviśat |
visṛjya saśaraṃ chāpaṃ śokasaṃvignamānasaḥ || 47 ||

ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ |
విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః ‖ 47 ‖

భావం : సంజయుడు ! అర్జునుడు అలా చెప్పి దుఃఖాక్రాంతుడై విల్లమ్ములు విడిచి పెట్టి రణరంగంలో రధం మీద చతికిలబడ్డాడు.


oṃ tatsaditi śrīmadbhagavadgītāsūpaniśhatsu brahmavidyāyāṃ yogaśāstre śrīkṛśhṇārjunasaṃvāde


ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

arjunaviśhādayogo nāma prathamoadhyāyaḥ ||1 ||
అర్జునవిషాదయోగో నామ ప్రథమోఽధ్యాయః ‖1 ‖

1వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
సరళమైన తెలుగు లో భగవద్గీత పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Bhagavad Gita Slokas with Audios in English Click Here 

bhagavad gita meaning, bhagavad gita lyrics, bhagavad gita learning audios, bhagavad gita haindavi, bhagavad gita pdf books, bhagavad gita sloakas with meaning, bhagavad gita telugu, bhagavad gita 1st chapter, bhagavad gita easy learning way, hindu temples guide bhagavad gita,

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS