Bhagavad Gita 16th Chapter 13-24 Slokas and Meaning in Telugu | భగవద్గీత 16వ అధ్యాయం 13-24 శ్లోకాల భావాలు

శ్రీమద్ భగవద్ గీత షోడశోఽధ్యాయః
అథ షోడశోఽధ్యాయః |

ఇదమద్య మయా లబ్ధమిమం ప్రాప్స్యే మనోరథమ్ |
ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్ ‖ 13 ‖

అసౌ మయా హతః శత్రుర్హనిష్యే చాపరానపి |
ఈశ్వరోఽహమహం భోగీ సిద్ధోఽహం బలవాన్సుఖీ ‖ 14 ‖
ఆఢ్యోఽభిజనవానస్మి కోఽన్యోస్తి సదృశో మయా |
యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞానవిమోహితాః ‖ 15 ‖
అనేకచిత్తవిభ్రాంతా మోహజాలసమావృతాః |
ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేఽశుచౌ ‖ 16 ‖
భావం : "ఈ వేళ నాకిది లభించింది. ఇక ఈ కోరిక నెరవేరుతుంది. నాకింత ఆస్తి వున్నది. మరింత సంపాదించబోతున్నాము. ఈ శత్రువును చంపేశాను. మిగిలిన శత్రువులను కూడా సంహరిస్తాను. నేను ప్రభువును, సుఖభోగిని, తలపెట్టిన  పనిని సాధించే సమర్ధుణ్ణి, బలవంతుణ్ణి, సుఖవంతుణ్ణి, నేను డబ్బున్న వాణ్ణి, ఉన్నత వంశంలో ఉద్భవించాను. నాకు సాటి అయినా వాడేవాడు లేడు. నేను యజ్ఞాలు చేస్తాను. దానాలిస్తాను. ఆనందం అనుభవిస్తాను" - అని వాళ్ల అజ్ఞానంలో అనేక విధాలా కలవరిస్తాను. మోహవశూలైన ఆ అసుర స్వభావం కలిగిన వాళ్లు నిరంతరం కామభోగలలోనే చిక్కుకొని చివరకు ఘోర నరకపాలవుతారు. 
     

ఆత్మసంభావితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః |
యజంతే నామయజ్ఞైస్తే దంభేనావిధిపూర్వకమ్ ‖ 17 ‖
భావం : తమను తామే పొగుడుకుంటూ, వినయవిధేయతలు లేకుండా ధనమధ గర్వంతో వాళ్లు శాస్త్ర విరుద్ధంగా పేరుకు మాత్రం యజ్ఞాలు చేస్తారు. 

అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః |
మామాత్మపరదేహేషు ప్రద్విషంతోఽభ్యసూయకాః ‖ 18 ‖
భావం : అహంకారం, బలం, గర్వం, కామం, క్రోధం, వీటిని ఆశ్రయించిన ఆసుయపరులైన వీళ్ళు తమ శరీరంలోనూ, ఇతర శరీరాలలోనూ ఉంటున్న నన్నే ద్వేషిస్తారు. 

తానహం ద్విషతః క్రూరాన్సంసారేషు నరాధమాన్ |
క్షిపామ్యజస్రమశుభానాసురీష్వేవ యోనిషు ‖ 19 ‖
భావం : ద్వేష పూరితులు, పాపచరితులు, క్రూరస్వభావులు అయినా అలాంటి మనవాధములను మళ్లీ మళ్లీ సంసారంలో పడవేస్తుంటాను. 


ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని |
మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిమ్ ‖ 20 ‖
భావం : కౌంతేయా! అసుర జన్మపొందే అలాంటి మూర్ఖులు ఏ జన్మలోనూ నన్ను చెరలేకపోవడమే కాకుండా అంతకంత అధోగతి పాలవుతారు.  

త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః |
కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్ ‖ 21 ‖
భావం : కామం, క్రోధం, లోభం- ఈ నరక ద్వారాలు మూడు ఆత్మ వినాశనాన్నికి కారణాలు. అందువల్ల ఈ మూడింటిని విడిచిపెట్టాలి. 

ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః |
ఆచరత్యాత్మనః శ్రేయస్తతో యాతి పరాం గతిమ్ ‖ 22 ‖
భావం : కౌంతేయా! ఈ మూడు దుర్గుణాలను విసర్జించినవాడు తనకు తాను మేలు చేసుకొని పరమపదం పొందుతాడు. 

యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః |
న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్ ‖ 23 ‖
భావం : శాస్త్రవిధులను విడిచిపెట్టి తన ఇష్టానుసారం ప్రవర్తించే వాడు తత్వజ్ఞానం కాని, సుఖం కాని, మోక్షం కాని పొందుతాడు. 

తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ |
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి ‖ 24 ‖
భావం : అందువల్ల చేయదగ్గదేదో, చేయకూడనిదిదేదో నిర్ణయించుకోవడంలో నీకు శాస్త్రమే ప్రమాణం. శాస్త్ర విధానాలను తెలుసుకొని తదనుగుణంగా ఈ లోకంలో నీవు కర్మలు చేయాలి. 

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
దైవాసురసంపద్విభాగయోగో నామ షోడశోఽధ్యాయః ‖ 16 ‖


16వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
Bhagavad Gita Slokas with Audios in English Click Here 

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 16th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS