Bhagavad Gita 15th Chapter 1-10 Slokas and Meaning in Telugu |భగవద్గీత 15వ అధ్యాయం 01-10 శ్లోకాల భావాలు


శ్రీమద్ భగవద్ గీత పన్చదశోఽధ్యాయః
అథ పంచదశోఽధ్యాయః |

శ్రీభగవానువాచ |
ఊర్ధ్వమూలమధఃశాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ |
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ‖ 1 ‖



భావం : శ్రీ భగవానుడు : వేదాలు ఆకులుగా, వేళ్ళు పైకి , కొమ్మలు కిందకి ఉండే సంసారమనే అశ్వత్ద వృక్షం(రావి చెట్టు) నాశనం లేనిదని చెబుతారు. అది తెలుసుకున్న వాడే వేదార్ధం ఎరిగిన వాడు.  

అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణప్రవృద్ధా విషయప్రవాలాః|
అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే ‖ 2 ‖
భావం : ఈ సంసారవృక్షం కొమ్మలు గుణాలవల్ల పెంపొందుతూ, విషయ సుఖలే చిగుళ్ళుగా, కిందకి మీదకి విస్తరిస్తాయి. మానవ లోకంలో ధర్మాధర్మ కర్మబంధాల వల్ల దాని వేళ్ళు దట్టంగా కిందకి కూడా వవ్యాపిస్తాయి.   


న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా|
అశ్వత్థమేనం సువిరూఢమూలమసంగశస్త్రేణ దృఢేన ఛిత్త్వా ‖ 3 ‖
తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్గతా న నివర్తంతి భూయః|
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ ‖ 4 ‖
భావం : ఈ సంసార వృక్షం స్వరూపం కాని, ఆది మధ్యంతాలు కాని ఈ లోకంలో ఎవరికి తెలియవు. లోతుగా నాటుకున్న వేళ్ళతో విలసిల్లుతున్న ఈ వృక్షాన్ని వైరాగ్యమనే ఖడ్గంతో ఖండించి వేశాక, పునర్జన్మ లేకుండా చేసే పరమ పదాన్ని వెతకాలి. ఆనాదిగా ఈ సంసార వృక్షం విస్తరించడానికి కారకుడైన అది పురుషుణ్ణి పరమాత్మ శరణు పొందాలి. 

నిర్మానమోహా జితసంగదోషా అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః|
ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైర్గచ్ఛంత్యమూఢాః పదమవ్యయం తత్ ‖ 5 ‖
భావం : అభిమానం, అవివేకం లేకుండా, అనురాగదోషాన్ని జయించి, ఆత్మజ్ఞానతత్పరులై, కొరికలన్నింటిని విడిచిపెట్టి, సుఖదుఃఖాది ద్వంద్వాలకు అతీతులైన జ్ఞానులు శాశ్వతమైన ఆ బ్రహ్మపదాన్ని పొందుతారు.   


న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః |
యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ ‖ 6 ‖
భావం : దాన్ని సూర్యుడు కాని, చంద్రుడు కాని, అగ్ని కాని ప్రకాశింపజేయలేరు. దేనిని పొందితే మళ్ళీ సంసారానికి రానక్కర్లేదో అలాంటి పరమపదం నాది.  

మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః |
మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ‖ 7 ‖
భావం : నాలోని శాశ్వతమైన ఒక అంశమే మానవ లోకంలో జీవాత్మగా పరిణమించి ప్రకృతిలోని జ్ఞానేంద్రియాలను, మనస్సునూ ఆకర్షిస్తుంది.

శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః |
గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధానివాశయాత్ ‖ 8 ‖
భావం : వాయువు పువ్వుల నుంచి వాసనలు తీసుకొపోయేటట్లుగా జీవుడు శరీరాన్ని ధరించేటప్పుడూ, ఇంద్రియాలను, మనస్సునూ వెంటబెట్టుకుపోతాడు. 

శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ |
అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే ‖ 9 ‖
భావం : ఈ జీవుడు చెవి, కన్ను, చర్మం, నాలుక-అనే ఐదు జ్ఞానేంద్రియాలనూ మనస్సునూ ఆశ్రయించి శబ్దాది విషయాలను అనుభవిస్తాడు.   

ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితమ్ |
విమూఢా నానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః ‖ 10 ‖
భావం : మరో శరీరాన్ని పొందుతున్నప్పుడు, శరీరంలో ఉన్నప్పుడు, విషయాలను అనుభవిస్తున్నప్పుడూ, గుణాలతో కుడి ఉన్నప్పుడు కూడా ఈ జీవాత్మను మూఢులు చూడలేరు. జ్ఞానదృష్టి కలిగిన వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. 

15వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
సరళమైన తెలుగు లో భగవద్గీత పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Bhagavad Gita Slokas with Audios in English Click Here 

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 15th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS