Bhagavad Gita 11th Chapter 1-11 Slokas and Meaning in Telugu | భగవద్గీత 11వ అధ్యాయం

శ్రీమద్ భగవద్ గీత ఏకాదశోఽధ్యాయః
అథ ఏకాదశోఽధ్యాయః |
అర్జున ఉవాచ |

మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్ |
యత్త్వయోక్తం వచస్తేన మోహోఽయం విగతో మమ ‖ 1 ‖


భావం : అర్జునుడు : నా మీద దయ తలచి అతి రహస్యమూ, ఆత్మజ్ఞాన సంబంధమూ అయిన విషయాన్ని ఉపదేశించావు. దానితో నా అజ్ఞాన మంతా అంతరించింది.

భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా |
త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయమ్ ‖ 2 ‖
భావం : కృష్ణా! సమస్త భూతాల చావుపుట్టుకల గురించి అఖండమైన ని మహత్యం గురించి నీ నుంచి వివరంగా విన్నాను.

ఏవమేతద్యథాత్థ త్వమాత్మానం పరమేశ్వర |
ద్రష్టుమిచ్ఛామి తే రూపమైశ్వరం పురుషోత్తమ ‖ 3 ‖
భావం : పరమేశ్వర! నిన్ను గురించి నీవు చెప్పినదంతా నిజమే. పురుషోత్తమ! ఈశ్వర సంబంధమైన నీ విశ్వరూపాన్ని సందర్శించాలని నా అభిలాష.

మన్యసే యది తచ్ఛక్యం మయా ద్రష్టుమితి ప్రభో |
యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్ ‖ 4 ‖
భావం : ప్రభో! యోగీశ్వరా! నీ విశ్వరూపాన్ని సందర్శించడం నాకు సాధ్యమని నీవు భావిస్తే నిత్యమైన నీ స్వరూపం నాకు చూపించు.
శ్రీభగవానువాచ |

పశ్య మే పార్థ రూపాణి శతశోఽథ సహస్రశః |
నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ ‖ 5 ‖
భావం : శ్రీ భగవానుడు : పార్ధా! అనేక రంగులతో, అనేక ఆకారాలతో అనేక విధాలుగా వందలకొద్ది, వేల కొద్ది వున్న నా దివ్యరూపాలను చూడు.  


పశ్యాదిత్యాన్వసూన్రుద్రానశ్వినౌ మరుతస్తథా |
బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత ‖ 6 ‖
భావం : అర్జునా! ఆదిత్యులను, వస్తువులను, రుద్రులను, అశ్విని దేవతలను మారుత్తులను చూడు. అలాగే ఇది వరకు ఎప్పుడుకానివినీ  ఎరుగని వింతలను వీక్షించు.

ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరమ్ |
మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్ద్రష్టుమిచ్ఛసి ‖ 7 ‖
భావం : అర్జునా! నా శరీరంలో ఒకే భాగంలో వున్న చరాచారాత్మకమైన సకల ప్రపంచాన్ని సందర్శించు. నీవింకా చూడదలచినదంతా ఈ దేహంలోనే అవలోకించు.

న తు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా |
దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్ ‖ 8 ‖
భావం : నీ కళ్ళతో నీవు నన్ను చూడలేవు. నీకు దివ్యదృష్టినిస్తున్నాను. దానితో నా విశ్వరూపం చూడు. 

సంజయ ఉవాచ |

ఏవముక్త్వా తతో రాజన్మహాయోగేశ్వరో హరిః |
దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరమ్ ‖ 9 ‖
భావం : సంజయుడు : దృతరాష్ట్ర  మహారాజా! మహాయోగీశ్వరుడైన శ్రీ కృష్ణ భగవానుడు అలా చెప్పి అర్జునుడికి శ్రేష్టమైన తన విశ్వరూపం చూపించాడు. 


అనేకవక్త్రనయనమనేకాద్భుతదర్శనమ్ |
అనేకదివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్ ‖ 10 ‖
దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనమ్ |
సర్వాశ్చర్యమయం దేవమనంతం విశ్వతోముఖమ్ ‖ 11 ‖
భావం : ఆరూపం అనేక ముఖాలతో, నేత్రాలతో,అద్భుతలతో,దివ్యభరణాలతో, ఎక్కు పెట్టిన పెక్కు దివ్యాయుధాలతో, దివ్యపుష్పవస్త్రంతో, దివ్యగంధాలతో మహాశ్చర్యకరం, దేదీప్యమానంతో అనంతం, విశ్వముఖమూ అయి విరాజిల్లుతున్నది.

11వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
సరళమైన తెలుగు లో భగవద్గీత పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Bhagavad Gita Slokas with Audios in English Click Here 

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 11th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS