అలంపూర్_నవ_బ్రహ్మ_దేవాలయాలు:
పేరులో బ్రహ్మ ఉన్నా అవి శివాలయాలు. మొత్తం తొమ్మది ఒకే చోట కొలువై ఉన్నాయి. అంతేనా ఆ తొమ్మది దేవాలయాలు కూడా ఒక శక్తిపీఠం ఉన్న చోటున ఉన్నాయి. అందుకే వాటిని సందర్శిస్తే మొత్తం కష్టాలన్నీ తొలిగిపోతాయని చెబుతారు. దీంతో శివుడికి అత్యంత ఇష్టమైన ఈ కార్తీక మాసంలో ఈ దేవాలయాలను సందర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆ తొమ్మది దేవాలయాలు ఏవి, ఎక్కడ ఉన్నాయి తదితర వివరాలన్నీ మీ కోసం...
నవబ్రహ్మ ఆలయాలు ఆలంపూర్ వద్ద ఉన్నాయి. ఇక్కడ తొమ్మది ఆలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలు శివుడికి అంకితం చేయబడ్డాయి. ఈ దేవాలయాలను బాదామి 7 వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు. ఈ దేవాలయ నిర్మాణాన్ని పరిశీలిస్తే భారతీయ వాస్తుశైలి ఎంత గొప్పదో ఇట్టే తెలుస్తుంది.
తుంగభద్ర నది యొక్క ఎడమ ఒడ్డున నవాబ్రహ్మ దేవాలయాలు ఒక ప్రాంగణంలో ఉన్నాయి. ఈ తొమ్మది దేవాలయాల పేర్లు వరుసగా
బాలా_బ్రహ్మ
స్వర్గ_బ్రహ్మ,
పద్మ_బ్రహ్మ,
గరుడ_బ్రహ్మ,
కుమార_బ్రహ్మ,
తారక_బ్రహ్మ,
అర్క_బ్రహ్మ,
వీర_బ్రహ్మ &
విశ్వ_బ్రహ్మ.
ఈ ఆలంపూర్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్‌లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఆలంపూర్ ఉంది. ఈ ఆలంపూర్ చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన ప్రదేశం. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంటుంది. తుంగభద్ర, కృష్ణా నదులు ఈ ఆలంపూర్ వద్ద కలుస్తాయి.
ఆలంపూర్‌లోని నవబ్రహ్మ ఆలయాల్లోకెల్లా బాల బ్రహ్మ దేవాలయం ముఖ్యమైనది. ఇక్కడ ఇప్పటికీ పూజాదికార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయంలో చిన్న నంది మంటపం, దాని వెనుకాల విశఆలమైన ముఖ మంటపం, అటు పై ప్రవేశ మంటపం, అటు పై అంతరాళ మంటపం, వీటన్నింటినీ కలుపుతూ గర్భగుడి కలదు.
శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి బ్రహ్మ ఇక్కడ తపస్సు చేశాడని నమ్ముతారు.శివుడు బ్రహ్మకు సృష్టి యొక్క అధికారాలను ఇచ్చాడు. అందువల్ల, వీటికి బ్రహ్మ పేరు పెట్టారు.
ఈ ఆలయాలలో మండప, అంతరాల, గర్భగృహం ఉన్నాయి. అదనంగా, కుమార బ్రహ్మ, గరుడ బ్రహ్మ మరియు స్వర్గ బ్రహ్మ దేవాలయాలలో ముఖ మండపం ఉంది.
ఆలంపూర్‌లోని నవబ్రహ్మ ఆలయాల్లోకెల్లా బాల బ్రహ్మ దేవాలయం ముఖ్యమైనది. ఇక్కడ ఇప్పటికీ పూజాదికార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయంలో చిన్న నంది మంటపం, దాని వెనుకాల విశఆలమైన ముఖ మంటపం, అటు పై ప్రవేశ మంటపం, అటు పై అంతరాళ మంటపం, వీటన్నింటినీ కలుపుతూ గర్భగుడి కలదు.
ఈ గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఒక వసారా కూడా ఉంది. ఈ గుడిలో సప్తరుషుల విగ్రహాలను మనం చూడొచ్చు. ఈ దేవాలయంలోని విగ్రహం విగ్రహం వింతగా ఉంటుంది. ఒక లింగం మధ్యలో బిలం ఉంటుంది.
ఈ బిలంలో మరోక శివలింగం ఉంటుంది. ఈ ఆలయంలో ఒక విగ్రహం చూడటానికి వింతగా ఉంటుంది. ఒక నల్లరాతి పై నగ్నంగా రెండు మోకాళ్లను దవడలకు తగులునట్లు కుర్చొన్న ఒక స్త్రీ విగ్రహాన్ని మనం చూడొచ్చు. దీనిని భూదేవి విగ్రహంగా చెబుతారు.
ఈ ఆలంపూర్ ఒక శక్తిపీఠం కూడా. ఇక్కడ సతీదేవి ఊర్థ్వ దవడ పడినట్లు చెబుతారు. ఇక్కడ ఉన్న అమ్మవారిని జోగులాంబగా పిలుస్తారు. ఈ జోగులంబ దేవత కూర్చొని భంగిమలో కనిపిస్తుంది. ఆమెను గురు చండి అని కూడా పిలుస్తారు.
ఇక ఈమె శిరస్సు పై ఒక గబ్బిలం, తేలు, పుర్రె కూడా కలిగి ఉంటుంది. అందువల్లే ఈ అమ్మవారిని పూజిస్తే దుష్టశక్తుల భయం ఉండదని చెబుతారు. అలంపురం సమీపంలో కృష్ణ, తుంగభద్ర నదులు సంగమించడం వల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణకాశీగా అభివర్ణిస్తూ ఉంటారు.
చేరుకోవడం ఎలా ?
ఇది హైదరాబాద్ నుండి ఆలంపూర్ చుట్టూ 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలుకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లే బస్సులన్నీ ఆలంపూర్ మీదుగానే వెళతాయి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి కర్నూలుకు బస్సు సౌకర్యం ఉంది. ఈ ఆలయానికి సమీపంలోని రైల్వేస్టేషన్ కర్నూలు.
Related Books:
alampur nava brahma temple, nava brahma names, jogulamba temple, alampur jogulamba temple timings, alampur navabrahma temples, papanasi temple alampur, virupaksha temple, lad khan temple, sangameshwara temple, alampur, alampur temple information in telugu, nava brahma temple information in telangana.