Sri Nagaraja Swamy Temple | Mannarasala | Kerala


శ్రీ నాగరాజ ఆలయం , మన్నరసాల , కేరళ :

కేరళలోని ప్రాచీన దేవాలయాలలో ఈ ఆలయం ఒకటి. మన దేశంలో పాములని కూడా నాగదేవతగా భావించి గుడి కడతాము. అటువంటి కోవకు చెందినదే ఈ ఆలయం. ఈ దేవాలయం మన్నారసల అనే గ్రామం లో , కేరళ రాష్ట్రంలో ఉన్నది. చాలా మంది సంతానం కొరకు నాగపూజ చేస్తారు.  సాధారణంగా నాగదేవత ఆలయం అనగానే పాలతో అభిషేకాలు , పుట్టల వద్ద కోడి గుడ్లు సమార్పిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ఈ విధమైన ఆచారం లేదు. కేవలం ఈ ఒక్క ఆలయంలో మాత్రం ఉప్పును తీసుకు వెళ్ళి సమర్పిస్తారు.

ఆలయ చరిత్ర :

మన్నారసాల అనే చిన్న కుగ్రామం లో నాగరాజుగా పూజలు అందుకుంటున్నారు ఈ స్వామి. ఈ ఆలయంలో దాదాపుగా 30,000(ముపై వేలు) నాగ ప్రతిమలు ఉన్నాయి. సంతానలేమితో బాధపడే మహిళలు ఎక్కువగా ఈ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. సంతానం లేని వారికి ప్రత్యేక తైలం ఇస్తారు. ఒక నాగప్రతిమ ఇస్తారు. ప్రత్యేక తైలం ఇచ్చినవారికి  బిడ్డలు పుట్టిన తర్వాత ఇక్కడికి వచ్చి మొక్కు చెల్లించుకొంటూ ఉంటారు.


ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజైన వాసుదేవ, శ్రీదేవి దంపతులకు వివాహమై ఎన్ని రోజులైనా సంతానం కలుగలేదు. దీంతో వారు వారు చాలా బాధ పడుతూ ఉంటారు. ఒక రోజు రాజు అడవికి వెటకి వెళ్లగా  ఒకసారి మంటల్లో చిక్కుకున్న పాములు కనిపిస్తాయి. వెంటనే రాజు వాటిని కాపాడుతాడు. అప్పటికే గాయాలపాలైన పాములకు తేనే, నూనె, శ్రీగంథం తదితర పదార్థాలతో తయారైన మందులను పూసి అవి త్వరగా కోలుకొనేలా చేస్తారు. ఈ విషయం అంతా తన భార్య కి చెపుతాడు రాజు.   దంపతులు ఇద్దరు చూడగా అవి పుట్టలో ఉంటాయి. అటు పై భక్తితో వాటికి పూజలు చేస్తారు. దంపతుల భక్తికి మెచ్చిన ఆ నాగులకు రాజైన నాగరాజు ప్రత్యక్షమవుతాడు.


మీకు పిల్లలు లేని కారణం చేత నేనే మీకు పుత్రుడిగా జన్మిస్తాన అని వరం ఇస్తాడు. కానీ తాను కొని సం || తరువాత నాగుపాము రూపం ధరించి మన్నారసాల వద్ద శాశ్వతంగా ఉండిపోతానని చెబుతారు. అంతేకాకుండా తన దేవాలయానానికి వచ్చే భక్తుల కోర్కెలను తప్పక తీరుస్తానని అందుకు అనుగుణంగా కొన్ని పదార్థాలు తనకు నైవేద్యంగా సమర్పించాలని చెబుతాడు. కానీ అన్నీ నాగదేవత అలయాలో వలె కూడా ఈ ఆలయంలో నైవేద్యం ఉండదు.  ఈ దేవాలయంలో అరోగ్యం కోసం ఉప్పు, మరియు సంతాన భాగ్యం కోసం మిరియాలు , విద్య కోసంకంచుతో తయారు చేసిన పాత్ర  , అయుష్యు కోసం చివరిగా చీర  మరియు నెయ్యి అందజేస్తారు.


మారియొక్క కథ కూడా ప్రాచుర్యంలో కలదు. 

ఈ దేవాలయం ఇక్కడ ఉండటం వెనుక పరుశురాముడికి సంబంధం ఉంది అని శాస్రాల నిర్వచనం. పూర్వం పరుశురాముడు సముద్రం నుంచి పైకి తేలిన తరువాత ప్రాంతంలో భూ భారాన్ని మోస్తున్న నాగరాజుకు పూజలు చేయడానికి సరైన స్థలం కోసం పరుశురాముడు వెదుకుతూ ఉంటాడు. చివరికి మన్నారసాల అనే ప్రాంతం సరైనదిగా తోస్తుంది. దీంతో పరుశురాముడు ఈ ప్రాంతానికి చేరుకొని ఈ నాగరాజ దేవాలయం , సర్పయాక్షి, నాగయాక్షి, నాగచాముండి, తదితర దేవతల శిలా విగ్రహాలు దేవాలయాన్ని నిర్మిస్తాడు. స్వయంగా తానే నైవేద్యం సమార్పిస్తాడు.


ఆలయ దర్శన సమయం :

ఉదయం      : 5:00 – 12:00
సాయంత్రం : 5:30 – 7:30

వసతి వివరాలు  :

ఆలయం నుంచి  12 కి.మీ దూరంలో ప్రైవేట్ హోటల్ లు కలవు.

ఆలయానికి చేరుకునే విధానం :

రోడ్డు మార్గం :

మొదట కేరళ చేరుకొని అక్కడి నుంచి హరిపాద్ బస్ స్టేషన్ నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది.

రైలు మార్గం :

ఈ ఆలయానికి దగ్గరలోనే  హరిపాద్ అనే రైల్వేస్టేషన్ ఉన్నది. ఈ రైల్వే స్టేషన్ నుంచి కేవలం 5 కి. మీ దూరంలోనే ఈ ఆలయం ఉన్నది.

విమానా మార్గం :

కొచ్చిన్ విమానాశ్రయం 115 కిలోమీటర్లు దూరంలోను ,  తిరువనంతపురం విమానశ్రయం 125 కిలోమీటర్లు దూరంలో ఉన్నది. అక్కడి నుంచి  కార్ లేదా బస్ లో ఈ ఆలయానికి చేరుకోవాలి.

ఆలయ చిరునామా  :

శ్రీ నాగరాజ ఆలయం
మన్నరసాల
అలప్పీ జిల్లా
హరిపాద్
పిన్ కోడ్ : 690514
కేరళ.

Keywords : Sri Nagaraja Swamy Temple , Mannarasala , Alleppey, Famous Temples In Kerala , Hindu Temples Guide 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS