Sri Kalkaji Temple | Delhi

శ్రీ కల్కాజీ ఆలయం , ఢిల్లీ :

ఈ ఆలయం పురాతన ఆలయం. ఈ దేవాలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ దుర్గా దేవి, కాళిగా కూడా పూజిస్తారు. ఎంతో మంది రాజులు ఈ ఆలయని ధ్వంసం చేసిన తిరిగి  ఈ ఆలయాన్ని మరాఠాలు తరువాత పునర్నిర్మించారు. ఈ ఆలయం ఢిల్లీ కల్కాజి అనే ప్రాంతంలో కలదు.

ఆలయ చరిత్ర : 

పూర్వం రక్తాబీజా అనే రాక్షసుడు దేవతలను ఓడించి సమస్త లోకాలకి అధిపతి కావాలి అని దేవతలను ముప్పు తిప్పలు పెట్టేవాడు. దేవతలు గురువు అయిన బ్రహ్మ దేవతల దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకోగా అందుకు తాను ఈ రాక్షసులని ఓడించలేని ఆ రాక్షసుడు విపరీతమైన శక్తి కలిగి ఉన్నాడు అని చెప్పి ఇప్పుడు కేవలం జగ జననీ అయినా శ్రీ పార్వతి దేవి యే ఆ రాక్షసుని సంహరించగలదీ అని చెపి వారికి మార్గం చూపిస్తాడు. వారు అమ్మవారికి మొర పెట్టుకోగా పార్వతి నోటి నుండి కౌష్కి దేవి సృష్టించినది. రాక్షసులపై దాడి చేయగా భూమిపై పడటంతో వేలాది మంది రాక్షసులు తిరిగి ప్రాణం పోసుకున్నారు,  కౌష్కి దేవి యొక్క కనుబొమ్మల నుండి మా కాళి దేవి వచ్చింది, ఆ తరువాత వధించిన రాక్షసుల రక్తాన్ని కింద పడకుండా ఆమె త్రాగింది, శత్రువులపై పూర్తి విజయాన్ని సాధించింది. కాళి దేవి అప్పుడు ఆమె నివాసం ఇక్కడ స్థిరపడింది, మరియు ఆమె ఈ ప్రదేశానికి ప్రధాన దేవతగా ఆరాధించబడింది.


శరదృతువులలో తొమ్మిది రోజుల పాటు  నవరాత్రి ఉత్సవం పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. తరువాత కాలంలో ఈ ఆలయం 1764లో పునః నిర్మించబడింది, పాండవులు మరియు కౌరవులు ఇక్కడ పూజలు చేశారు అని అక్కడి శాసనాల ద్వారా గమనించవచ్చు. తరువాత 19 వ శతాబ్దం మధ్యలో, అక్బర్ చక్రవర్తి కోశాధికారి రాజా కదర్నాథ్ ఆలయంలో కొన్ని మార్పులు చేశారు. 20 వ శతాబ్దం ప్రారంభంలో, ప్రస్తుత నిర్మాణం భక్తుల సహకారంతో పాల రాతితో నిర్మించబడింది.


ఆలయ దర్శన సమాయం :

ఉదయం      : 6.00 - 11.30
సాయంత్రం  : 5.30 - 8.30

వసతి వివరాలు : 

ఈ ఆలయానికి దగ్గరలోనే ప్రైవేట్ హోటల్ లు కలవు.

ఆలయానికి చేరుకునే విధానం :

రోడ్డు మార్గం :

కల్కాజి బస్ స్టాండ్ నుంచి నడిచి చేరుకొని అక్కడి నుంచి నడిచి వెళ్ళి ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

రైలు మార్గం :

ఈ ఆలయానికి దగ్గరలోనే కల్కాజి అనే మెట్రో స్టేషన్ కలదు. అక్కడి నుంచి ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

విమాన మార్గం :

ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కార్ లేదా ప్రైవేట్ వాహనాలలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

ఆలయ చిరునామా :

శ్రీ కల్కాజీ ఆలయం
మా ఆనందమాయే మార్గ్ ,
ఒఖలా ఫేజ్ -3 ,
కల్కాజి రోడ్డు ,
ఢిల్లీ.
పిన్ కోడ్ : 110019

Key Words : Sri Kalkaji Temple , Famous Temples In Delhi , Lord Durga , Hindu Temples Guide

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS