Sri Adi Shankaracharya Swamy | Kaladi | Kerala


శ్రీ  ఆది శంకరాచార్య స్వామి , కాలడి , కేరళ  : 

ఆ కైలాస శంభుదేవుడు అయినా పరమేశ్వరుడే ఈ కాలడి ప్రాంతంలో జన్మించారు. సదా శివుడే ఆది శంకరుల రూపంలో భూలోకంలో జన్మించారు. కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రహ్మణా దంపతులైన ఆర్యమాంబ , శివ గురువులకి కేరళ రాష్ట్రంలో పూర్ణనది ఒడ్డున ఉన్న కాలడి ప్రాంతంలో శ్రీ శంకరులు జన్మించారు. కాలడి ప్రాంతం ఇప్పటికీ త్రీచూర్ కి కొద్ది మైళ్ళ దూరంలోనే ఉన్నది.  ఆర్యమాంబ , శివ గురువులు త్రీచూర్ లోని వృషాచాల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్ధించి ఆయన అనుగ్రహంతో ఈ ఆది శంకరాచార్య స్వామిని పుత్రుడిగా పొందారు. శ్రీ శంకరులు వైశాక శుద్ద పంచమి తిధి నాడు శివుని జన్మనక్షత్రమైన ఆరుధ్ర సూర్యుడు , శని , గురుడు ,కుజుడు  ఉచ్చస్థితిలో ఉండగా జన్మించారు. క్రీ. శ 788-820 మధ్య  అనగా కేవలం 32 సం|| జీవించి ఉన్నారు.


బాల్యం :

శంకరుల చిన్న తనంలోనే తండ్రిగారు శివైక్యం చెందారు.  ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి శాస్త్రోక్తంగా ఉపనయం జరిపించినది. శంకరులు ఏకసంధాగ్రహి . బాల్యంలోనే వేదవిద్యలు , సంస్కృతం అభ్యసించారు. బాల బ్రహ్మ చారిగా ఉండగా శంకరులు ఒక రోజు బిక్షాటన చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా భిక్ష వేసేందుకు ఏమి లేక తన ఉపవసాన్ని విరమించడం కోసం అని ఉంచుకున్న "ఉసిరి" కాయను దానంగా వేసింది. దానికి చలించిన శంకరులు ఆశువుగా "కనకధార స్త్రోత్రం" తో లక్ష్మీ దేవిని ప్రార్ధించారు. కనకధార స్త్రోత్రంతో పులకించిన "లక్ష్మీదేవి" బంగారు ఉసిరికాయలు వర్షింపజేసింది. ఇప్పటికీ ఈ ఇంటికి కేరళ రాష్ట్రంలో దర్శించవచ్చు. కింద ఫోటోలో ఆ ఇల్లు కలదు.


ఒక రోజు శంకరుల తల్లి గారు పూర్ణ నది నుంచి నీళ్ళు తీసుకొని వస్తుండగా స్పృహ తప్పి పడిపోతుంది. అప్పడు శంకరులు పూర్ణ నదిని ప్రార్ధించి నదిని తమ ఇంటి వద్దకే తెప్పించారు.

సన్యాస స్వీకరం : 

సన్యాసం తీసుకునే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కొరారు. శంకరులు సన్యాసం తీసుకుంటే తాను ఒంటరినౌతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పూర్ణనదిలో స్నానం చేస్తుండగా ఒక ముసలి పట్టుకుంటుంది. సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని , ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటాను అని తల్లిని కొరినారు. దానికి ఆమె అంగీకరించినది. దీనిని ఆతురసన్యాసం అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపించడంతో ఆశ్చర్యంగా ఆ ముసలి శంకరులని వదిలేస్తుంది.



గోవింద భాగవత్పాదుల దర్శనం : 

తల్లి అంగీకారం తీసుకొని శంకరులు కాలడి విడిచి గురువుల కొరకు అన్వేషణ ప్రారంభిస్తారు. నర్మదా నది చేరుకోగానే అక్కడ నది ఒడ్డున గోడపాదుల శిష్యులైన గోవింద భాగవత్పాదులు ఉంటే గుహ దర్శనం లభిస్తుంది. వ్యాసమహర్షి కుమారుడైన శుకుని శిష్యులు గౌడపాదులు. ఆయనను చూడగానే శంకరులు నడిచివచ్చిన అలసట అంతా ఒక్కసారిగా తిరిపోయింది. వారికి నమస్కారం అని స్తోత్రం చేయగా గోవింద భాగవత్పాదులు "ఎవరు నీవు ?" అనే ప్రశ్న వేశారు.

అందుకు శంకరులు నేను నింగిని కాదు, భూమిని కాదు, నీటిని కాదు , అగ్నిని కదూ , గాలిని కాదు, ఎటువంటి గుణాలులేని వాడిని ఇంద్రియాలు కానీ వేరే చిత్తంగాని లేని వాడిని. నేను శివుడనూ. విభజన లేని జ్ఞానసారాన్ని అని చెప్పగా గోవింద భాగవత్పాదులు మెచ్చుకొన్ని తమ శిష్యరికం ఇచ్చారు. ఆ గురువు వద్దనే విధ్యాలు నేర్చుకున్నారు.


మనీషా పంచకం : 

ఒకరోజు మధ్యాహ్నికం తీర్చుకోవడానికి గంగానది వైపు వెల్లుతుండగా మార్గ మధ్యలో నాలుగు శునకాలతో ఒక చండాలుడు అడ్డుపడినాడు. అప్పడు శంకరులు , ఆయన శిష్యులు అడ్డు తప్పుకోమనగా ఆ చండాలుడు ఈ విధంగా అడిగినాడు.

సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం చండాలుడిలోనైనా , బ్రహ్మణుడిలోనైనా ఒకే విధంగా పని చేస్తుంది. మీరు అడ్డు తప్పుకోమంటున్నది కనిపిస్తున్న ఈ శరీరాన్న లేక లోపాలనున్న ఆత్మ నా ? ఆ విధంగా అయితే అది ద్వంద్వంఅవుతుంది. కానీ అద్వైతం కాదు.  ఈ మాటలు విన్న వెంటనే అంతరార్ధం గ్రహించి వచ్చినది సాక్షాత్తు పరమేశ్వరుడే నాలుగు వేదాలతో కదిలి వచ్చాడు అని గ్రహించి మహాదేవునికి మనీషా పంచకం అనే ఐదు వందల శ్లోకాలతో స్తోత్రం చేశాడు.


శంకరాచార్యుల శిష్యులు : 

శంకరులకి అనేకు శిష్యులుగా ఉన్నారు. ఆయన ప్రజ్ఞ పాఠవాలకి కొందరు , చర్చల ద్వారా ఓడింపబడిన వారు కొందరు ఇలా అనేకులు ఆయన శిష్యులుగా ఉండేవారు. వారిలో అతి ముఖ్యమైనవారు కొందరు ఉన్నారు.  వారిలో కొందరి గురించి ఈ క్రింద వివరింపబడినది.

పద్మపాదాచార్యులు :

శంకరులు కాశీ ప్రయాణంలో ఒక బ్రహ్మచారి ఆయన వద్దకు వచ్చి నేను బ్రహ్మణుడను. నా పేరు సదానందుడు. నాది చోళదేశం మహాత్ములను దర్శించి జ్ఞానాన్ని పొందాలి అని వచ్చాను . మీ వద్ద శిష్యునిగా ఉందా వరమిమ్మని ప్రార్ధించాడు. అలా అత్యంత ఆత్మీయునిగా మారాడు. సదానందుడు శంకరులకి సన్నితంగా ఉండడం వల్ల తోటి శిష్యులకి అసూయగా ఉండేది. ధ్యానం లో ఈ విషయాన్ని శంకరులు తెలుసుకొని వారికి ఆ అసూయ తొలగించాలని అనుకుంటారు.

 ఒకరోజు గంగానది ఆవల ఉన్న సదానందుడిని పిలిచారు. వెంటనే సదానందుడు నది మీద అడుగు వేసుకుంటూ ఈవలకి వచ్చాడు. నది మీద సదానందుడు అడుగు వేసిన చోటల్లా మునిగిపోకుండా పద్మాలు వచ్చాయి. అది చూసిన తోటి శిష్యులు సదానందుడి పై అసూయ పడినందుకు సిగ్గుపడ్డారు. అప్పటి నుంచి సదానందుడు "పద్మపాదుడు" అయ్యాడు.


మండన మిశ్రునితో తర్క గోష్టి :

మహిష్మతిలో మండన మిశ్రుని ఇంటికి వెళ్ళిన సమయానికి మండన మిశ్రుడు తన తపోశక్తి వ్యాసభగవానూడిని , జైమిని మహామునిని ఆహ్వానించి వారికీ అర్ఘ్యపాధ్యాలు ఇస్తున్నాడు. శంకరులు ఇంటికి రావడంతో గమనించి తన ఇంటిలో సన్యాసులకి ప్రవేశం లేదని , అందువలన స్వాగతం పలకనని చెప్పాడు. అయితే మహర్షిలు ఆదేశంతో శంకరులను ఆహ్వానించాడు. తరువాత రోజు చర్చ జరపాలని నిర్ణయించుకున్నారు. న్యాయ నిర్ణేతలుగా వ్యాసుడు , జైమిని లను ఉండమని అభ్యర్ది అడుగగా మండన మిశ్రుని భార్య అయినా ''ఉభయ భారతి'' సాక్షాత్తు సరస్వతి రూపమమని , ఆమెనే న్యాయ నిర్ణేతగా ఉంచి చర్చ జరపమని చెప్పారు.


ఉభయ భారతి మధ్యవర్తిగా ఉండడానికి అంగీకరించి వాళ్ళ ఇద్దరి మెడలో రెండు పూల మాలను ఉంచి వాదన సమయంలో ఎవరి మెడలో పూలమాల వాడిపోతే వాళ్ళు ఒడినట్టుగా భావించాలి అని చేపింది. వాదన ప్రారంభమైన కొద్ది సేపటికే మండన మిశ్రుని మెడలోని మాల సగం వాడిపోతుంది. అప్పడు ఉభయ భారతి నేను మండన మిశ్రుని భార్యని కనుక భర్త సగ భాగం భార్య కావున తనని కూడా వాదనలో ఒడిస్తేనే అప్పడు శంకరుకులు విజయం సాధించిన్నట్టు అని చెపుతుంది. ఉభయ భారతి వేసిన కొన్ని ప్రశ్నలకు కొంత సమయం కావాలి అని అడిగి పక్ష కాలంలో తిరిగి వచ్చి ఆమెని కూడా వాదనలో ఒడిస్తాడు. అప్పడు ఆ దంపతులు ఇద్దరు శంకరాచార్య స్వామి వారికి శిష్యులుగా మరి సురేశ్వరాచార్యునిగా ప్రసిద్దుడు అవుతాడు.

శంకరులు సాధించిన ప్రధాన విజయాలు :

* ఉపనిషత్తులకు , భగవత్ గీత , బ్రహ్మ సూత్రాలకు , విష్ణు సహస్రనామాలకు భాష్యాలు రచించారు. తరువాత శంకరుల అనుసరించిన వారికి , శంకరులతో విభేదించిన వారికి కూడా ఇవి మౌలికవ్యాఖ్య గ్రంధాలుగా ఉపయుక్తమైనవి.
* శృంగేరీ , పూరీ , ద్వారకా, జ్యోతిర్మఠం , అనే నాలుగు మఠాలను స్థాపించారు. అవి శంకరుల సిద్ధాంతానికి , హిందూ ధర్మానికి నాలుగు దిక్కుల దీప స్తంభాలుగా పని చేస్తున్నాయి.
* బౌద్ధ మతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునఃరుద్దరించడం, అయితే ఈ ప్రక్రియ భౌతికంగా ఏ విధమైన బలప్రయోగం లేదు. దేశ దేశాల పండితులతో వాదనలు సాగించి వారిని ఓడించి శంకరులు తన సిద్దాంతాన్ని వారిచే మెప్పించాడు.
* గణేశ పంచరత్న స్తోత్రం , భజ గోవిందం , లక్ష్మీ నృసింహ కారావలంబ స్తోత్రం , కనకధార స్తోత్రం ,శివానంద లహరి , సౌందర్యలహరి వంటి అనేక గ్రంధాలు రచించారు. ఇందులో శివానంద లహరి , సౌందర్య లహరి గ్రంధాలు శ్రీశైలంలోని ఒక లోయ వద్ద రచించారు.


ఆ సమయంలో ఒక బోయవాడు స్వామి మీ తల కావాలి అని ఆడగడంతో సరే నాని శిష్యులను పాతాళగంగ వద్దకు పంపి ఇస్తాను అని అంటాడు. ఆ బోయవాడు స్వామి శిరస్సు కొరకు కత్తి పైకి ఎత్తగానే గురువులకి ప్రమాదం ఉన్నదనిపద్మపాదచార్యులు తలచి వెంటనే శ్రీ లక్ష్మీ నృసింహ స్వామిని  ప్రార్ధించగా ఒక సింహం వచ్చి ఆ బోయవాడిని సంహరిస్తుంది. కంచి కామకోటి పీఠధిపతి ఐనా శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి 68వ పీఠధిపతిఇక్కడే ఉండిపోతాను అని అన్నారు. అంతటి గొప్ప ప్రదేశం ఈ ప్రాంతం. ఇప్పటికీ ఈ ప్రాంతంలో పాలాధారా, పంచాధారా అనే ప్రాంతంలో పక్కనే శ్రీ శంకరచార్య స్వామి వారి ఆలయం కలదు. ఇప్పటికీ అందరూ దర్శించకోవచ్చు.


సర్వజ్ఞ పీఠ అధిరోహణ :   

శంకరులు కాశ్మీర ప్రాంతంలో శ్రీ శారదా పీఠన్ని సందర్శించారు. ఇది ఇప్పుడు పాక్ స్తాన్ఆధీన ప్రాంతంలో కలదు. ఆ పీఠనికి నాలుగు దిక్కుల ద్వారాలలో నలుగురు ఉద్దండ పండితులు ఉన్నారు. కానీ దక్షిణా ద్వారం అంతవరకు తెరవబడలేదు. అనగా దక్షిణా దేశం నుంచి గొప్ప పండితులేవరు రాలేదు. శంకరులు దక్షిణా ద్వారాన్ని తెరిపించి అక్కడి సర్వజ్ఞ పీఠన్ని అధిరోహించారు. తన జీవిత చివరి దశలో శంకరులు కేధర్ నాథ్ , బద్రీనాథ్ క్షేత్రాలని దర్శించి దేహ విముక్తుడు అయ్యారు.

ఆలయ దర్శన సమయం :

ఉదయం      : 5:00 – 12:00
సాయంత్రం : 4:30 – 8:00

వసతి వివరాలు  :

ఆలయం నుంచి  2 కి.మీ దూరంలో ప్రైవేట్ హోటల్ లు కలవు.

ఆలయానికి చేరుకునే విధానం :

రోడ్డు మార్గం :

మొదట కేరళ చేరుకొని అక్కడి నుంచి హరిపాద్ బస్ స్టేషన్ నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది.

రైలు మార్గం :

ఈ ఆలయానికి దగ్గరలోనే  అంగమల్లి (AFK)(10) కి. మీ దూరంలో, అలువ(AWY)20కి. మీ దూరంలోనే ఈ ఆలయం ఉన్నది.

విమానా మార్గం :

నేడ్ఉమబస్సేరి కొచ్చిన్ విమానాశ్రయం 35 కిలోమీటర్లు దూరంలో ఉన్నది. అక్కడి నుంచి  కార్ లేదా బస్ లో ఈ ఆలయానికి చేరుకోవాలి.

ఆలయ చిరునామా  :

శ్రీ ఆది శంకరాచార్య జన్మభూమి ఆశ్రమం
కాలడి ,
శృంగేరి, 
కాలడి ,
పిన్ కోడ్ : 683574
కేరళ.
Phone : 0484 246 2350

Keywords : Sri Adi Shankaracharya Swamy, Kaladi , Kerala, Shankaracharya math kalady, Sringeri,  Famous Temples In Kerala , Hindu Temples Guide 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS