అష్టాదశ శక్తి పీఠాలలో దుష్టులకు భయాన్ని కలిగించే భయంకరమైన రూపాన్ని కలిగిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి శక్తి పీఠం , కర్ణాటక రాష్ట్రం లో మైసూర్ ప్యాలస్ నుంచి 10 కిమీ దూరం లో గల కొండపైన చాముండేశ్వరి అమ్మవారు ఉన్నారు. ముస్లిం రాజులు గడగడా వణికించిన అమ్మవారు , అమ్మవారి దశారా ఉత్సవాల్లో అమ్మవారికి అలకరించే ఆభరణాల వెనుక చరిత్ర ఏమిటో తెలుసా . ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఆశ్చర్యం గాలించే విశేషాలు ఉన్నాయి .
మన చరిత్రలో ఎన్నో వేల దేవాలయాలను ముస్లిం లు కూలగొట్టారని చదువుకున్నాం తెలుసుకుంటున్నాం . మైసూర్ అమ్మవారి ఆలయానికి కూలగొట్టడానికి ఆభరణాలు దొంగిలించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేకపోయారు . మనం ముందుగా చెప్పుకున్నట్టు మైసూర్ ప్యాలస్ కి కేవలం 13 కిమీ దూరం లో మాత్రమే ఈ ఆలయం ఉంది. అమ్మవారి శక్తి గురించి మరియు అమ్మవారి ఉగ్రరూపం గురించి తెల్సుకున్న ఆ నాటి ముస్లిం రాజులు అమ్మవారి ఆలయం దగ్గరకు రావడానికే భయపడేవారు . ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే ముస్లిం చక్రవర్తులే అమ్మవారికి ఆభరణాలను బహుకరించడం . వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా, టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ ఆలీ అమ్మవారికి చాలానే ఆభరణాలు వస్త్రాలు సమర్పించారు . ఆదే సాంప్రదాయాన్ని టిప్పు కూడా కొనసాగించాడు .
శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయో మనం ఇంతకూ ముందు వీడియోస్ లలో చెప్పుకున్నాం కదా . ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రదేశం లో అమ్మవారి జుట్టు పడిన ప్రదేశం గా చెబుతారు . చాముండేశ్వరి అమ్మవారిని పార్వతి అని , దుర్గ అని శక్తి అని అనేక రకాల పేర్లతో పిలుస్తారు . చాముండేశ్వరి అమ్మవారు మైసూర్ పాలకుల కుల దేవత , ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని 12 వ శతాబ్దంలో హోయసల పాలకులు నిర్మించారని భావిస్తున్నారు. ఈ దేవాలయ గోపురాన్ని బహుశా 17 వ శతాబ్దంలో విజయనగర పాలకులు నిర్మించారు. 1659లో 3000 అడుగుల కొండ శిఖరానికి వెయ్యి మెట్లతో మెట్ల మార్గాన్ని ప్రారంభించారు. కొండ మీద 800 వ మెట్ల వద్ద ఒక చిన్న శివాలయం ముందు ఒక పెద్ద నల్లరాతి నంది విగ్రహం ఉంది. ఈ నంది విగ్రహం 15 అడుగుల ఎత్తుతో, 24 అడుగుల పొడవుతో ఉంటుంది . ఈ నంది విగ్రహం మెడ చుట్టూ చాలా అందమైన గంటలు చెక్కబడి ఉన్నాయి.
కొండపైన మహిషాసురిని పెద్ద విగ్రహం కనిపిస్తుంది . మహిషుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి మానవులు, దేవతల చేత మరణం లేకుండా వరం పొందుతాడు. అనంతరం స్వర్గలోకం మీద, భూలోకం మీద దండెత్తి దేవతలందర్నీ తరిమికొడతాడు.
బ్రహ్మ శాపానికి తరుణోపాయంగా దేవతలందరూ వారి శక్తులన్నింటినీ క్రోడించి సుందరమైన నవయవ్వన యువతిని సమస్త శక్తివంతురాలిగా సృష్టిస్తారు. అలాంటి దుర్గాదేవి మహిషున్ని ఎదిరించి తొమ్మిది రోజులు తీవ్రంగా పోరాడుతుంది. పదవ రోజున ఇంతటి బలమైన రాక్షసున్ని వధిస్తుంది. అందువలన దుర్గాదేవిని మహిషాసుర మర్ధిని అని నామాంతరం కలిగింది.
నవరాత్రి ఏడవ రోజున చాముండీ దేవి ఆలయానికి సకల ఆభరణాలను తీసుకురావడం జరుగుతుంది. ఆ రోజు రాత్రి నుండి 12 రోజులు అన్ని ఆభరణాలను దేవికి అలంకరిస్తారు. దసరా పండుగ ముగిసిన కొద్ది రోజులకు ఆభరణాలను మళ్లీ ఖజానాకు తరలిస్తారు. చాముండీ దేవికి ధరింపజేసే ఆభరణాలలో కొన్ని శ్రీకంఠ్‌దత్ నరసింహరాజ ఒడయార్ తన వద్ద ఉంచుకొని, వీటిని దసరా సందర్భంలో దేవస్థానానికి సమర్పిస్తూ రావటం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న 12 ఆభరణాలు, ఒడయార్ వద్ద ఉన్న 34 ఆభరణాలు మేలి బంగారు, వెండి, వజ్రాలు, ముత్యాలు, రత్నాలతో పొదగబడి ఉంటాయ. చామరాజ ముడి, కర్ణపత్రం, డాలు, 3 పతకాలు, ఖాసహారం, పచ్చల పతకం, జడ బిళ్ల, జడ సరాలు వంటివి ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. ఒడయార్ దగ్గర వజ్ర ఖచితమైన త్రిశూలం, పాశుపతాస్త్రం, నాగాస్త్రం, కవచం, ఘంటా హస్త, కవచ కలశం, డమరుకం, ఖడ్గ హస్తం, కోటి హస్తం మొదలైన ఆభరణాలు ఉన్నాయి. 1971-72 ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం ఒడయార్ ప్రభువుల నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకోవటంతో అప్పటి మహారాజు జయచామరాజ్ ఒడయార్ దసరా ఉత్సవాలను నిర్వహించలేదు. సింహాసనంపై పట్టాతో ఉన్న కత్తిని వదిలేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచీ దసరా ఉత్సవాలను ప్రజలే నిర్వహించటానికి కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో రెండు పెట్టెలలో ఉన్న చాముండేశ్వరి ఆభరణాలను ప్రభుత్వానికి ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కానీ ఒక పెట్టెను మాత్రమే ఇవ్వడం జరిగింది. దీంట్లో 12 రకాల ఆభరణాలు ఉన్నాయి. మరొక పెట్టె ఒడయార్ దగ్గర ఉండిపోయింది. తమ దగ్గర ఉన్న ఆభరణాలను ప్రతి సంవత్సరం నవరాత్రులలోని 7వ రోజు ఒడయార్ వంశీకులు చాముండేశ్వరి దేవాలయానికి సమర్పిస్తారు.
ఆ ఆభరణాలను మూల విరాట్ విగ్రహానికి అలంకరించరు. మూల విగ్రహానికి పలు ఆభరణాలైన డాలు, కవచం నిత్యం ఉంటాయి. విశేషమైన ఆభరణాలను మాత్రం ఉత్సవ విగ్రహానికి అలంకరిస్తారు. దీంతో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే భక్తులు చూడటానికి అవకాశం ఉంటుంది.
కుల దేవత చాముండీ దేవి సకల ఆభరణాలను మైసూరు మహారాజులే ఇస్తూ వచ్చారు. ముమ్మడి కృష్ణరాజు ఒడయార్ చాముండీ దేవికి పరమ భక్తులు. కుల దేవత ప్రీత్యర్థం నవరత్నాల పేరుతో తొమ్మిది సార్లు సేవలు చేసేవారు. నక్షత్ర మాలిక అనే విశేషమైన ఆభరణంతో దేవిని అలంకరించేవారు. దేవి ధరించే 27 పతకాల గురించి ఒక శ్లోకం రాశారు. ఆనాటి మహారాజులు దేవికి సమర్పించిన ఆభరణాల ఖరీదు ఎంత అనేది నిర్ధారించడం ఇప్పటికీ సాధ్యం కాలేదు. చాముండీ దేవికి పచ్చల హారాన్ని చేయించారు. ముమ్మడి కృష్ణరాజు ఒడయార్ కాలంలో దీని ఖరీదును తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి. బెంగుళూరులోని ప్రసిద్ధ వజ్ర వ్యాపారి చెప్పిందాన్నిబట్టి - మైసూర్ నగరాన్ని రెండుసార్లు వేలం వేస్తే ఎంత డబ్బు వస్తుందో ఆ మాత్రం డబ్బు కూడా ఈ హారానికి సరిపోదని అభిప్రాయపడ్డారు.
సంవత్సరాని కొక్కసారి సర్వాలంకార భూషితమైన చాముండమ్మను చూడటం అదృష్టంగా భావిస్తారు భక్తులు. తల మీదున్న చామరాజ ముడి (కిరీటం), కంఠాభరణాలతో, కర్ణ పత్రాలతో, 3 పతకాలు, హారం, 28 మణులను పొదిగిన కంఠి, జడ పిన్నులు, జడ బిళ్ల, వజ్ర ఖచితమైన త్రిశూలం, పాశుపతాస్త్రం, నాగాస్త్రం, కవచం, ఘంటా హస్త కవచం, కలశం, డమరుకాస్త్రం, ఖడ్గ హస్తం తదితర ఆభరణాలతో సర్వశోభితంగా చాముండీదేవి అలరారుతుంది.
మైసూరు కర్ణాటక రాష్ట్రంలో ముడొవ అతిపెద్ద నగరం. బెంగళూరు నుంచి 146 కిమీ దూరం లో మైసూరు ఉంది . మైసూరు అనే పదం మహిషూరు అనే పదం నుంచి ఉద్భవించింది. మైసూరు దసరా ఉత్సవాలకు పేరుగాంచింది. ఈ ఉత్సవాలకు యాత్రికులు విశేష సంఖ్యలో హాజరవుతారు. ఈ పేరు నుంచే మైసూరు పెయింటింగ్, మైసూర్ పాక్ అనే మిఠాయి, మైసూరు పట్టు అనే వస్త్రాలు ప్రాచుర్యం పొందాయి.
1947 వరకూ ఈ నగరం ఒడయార్లు పరిపాలిస్తున్న మైసూరు రాజ్యానికి రాజధానిగా ఉండేది. 18 శతాబ్దంలో కొద్దికాలం మాత్రం హైదర్ అలీ, టిప్పు సుల్తాన్లు పరిపాలించారు. ఒడయార్లు సంస్కృతి కళలంటే ప్రాణమిచ్చే వారు. ఈ విధంగా నగరాన్ని సంస్కృతికి నిలువుటద్దంగా తయారు చేశారు. హిందూ పురాణాల ప్రకారం ఒకానొకప్పుడు మహిషూరు అని పిలువబడే ఈ ప్రాంతం మహిషాసురుడు అనే రాక్షసుని పరిపాలనలో ఉండేది. ఈ రాక్షసుణ్ణి దగ్గరే ఉన్న కొండపై కొలువున్న చాముండీ దేవి సంహరించిందని ప్రతీతి. తర్వాత కాలక్రమంలో మహిషూరు, మహిసూరుగా మారి చివరకు మైసూరు అనే స్థిరపడింది
బెంగళూరు నుంచి మైసూర్ చూడ్డానికి కర్ణాటక rtc వారు ప్రత్యేక బస్సు లు నడుపుతున్నారు . ఉదయం 7 గంటలకు బెంగళూరు లో బయలు దేరుతుంది . బెంగళూరు నుంచి శ్రీరంగ పట్నం , మైసూర్ ప్యాలస్ , చాముండేశ్వరి అమ్మవారి ఆలయం , మైసూర్ లో గల బృందావనం చూపించి రాత్రి 11 గంటలకు బెంగళూరు తీస్కుని వస్తారు . మనం ముందుగా ఆన్లైన్ లో బస్సు టికెట్ బుక్ చేసుకోవాలి .
KSRTC bus facilities are available every 20 minutes from Mysuru city bus stand to Sri Chamundeshwari Development Authority.
Darshana and Pooja Timings: 7.30 a.m to 2.00 p.m and 3.30 p.m to 6.00 p.m
Abhisheka Timings : 6 a.m. to 7.30 a.m and 6 p.m to 7.30 p.m | Friday 5 a.m to 6.30 a.m.
Near By Places :
🚍 Mysore Palace (10 km)
🚍 Mysore Zoo 9 KM
🚍 Krishnaraja Sagara 32 KM
🚍 Jaganmohana Palace 12 KM
🚍 Sri Srikanteswaraswamy Tempe, Nanjangud - 34 k.m.
🚍 Sri Nimishamba Temple, Ganjam - 22 k.m.
🚍 Bird Sanctuary - 20 k.m.
🚍 Bandipura National Park - 70 k.m
🚍 Nagarahole Forest - 100 k.m.
🚍 Sri Ranganathaswamy Temple, Srirangapatna - 24 k.m
Temple Accommodation :
20 Room Guest House for devotees - For Details please phone 08212590180
Keywords : Mysore temple information, Shakti peetham, Chamundeswari,