Lotus Temple | Bahapur | Delhi


లోటస్ ఆలయం, బహాపూర్,  న్యూ ఢిల్లీ : 

ఇది ఒక విచిత్రమైన ఆలయం. సాధారణ ఆలయ నిర్మాణం వలే ఈ ఆలయ నిర్మాణం ఉండదు. ఈ దేవాలయం బహాపూర్ అనే గ్రామంలో న్యూ ఢిల్లీలో కలదు.  ఈ కట్టడానికి ప్రేరణ "పద్మము". 27 పాల రాయితో  పద్మ రేకులుగా నిర్మించారు. ఈ ఆలయంనికి లోటస్ టెంపుల్ గా పిలుస్తారు. ఢిల్లీ వెళ్ళినప్పుడు చూడవలసిన ప్రదేశాలలో ఈ ఆలయం ఒకటి. ఇది శిల్ప కళా వైభవం చాటే విధంగా నిర్మించారు.  ఆరేళ్లపాటు కొనసాగి 1986లో పూర్తయింది.

ఆలయ చరిత్ర :

పెద్ద కలువ పువ్వులా కనిపించే ఈ ఆలయం ఎత్తు 131 అడుగులు ! దాదాపు పన్నెండు అంతస్తుల భవనమంత ఎత్తు ఉంటుంది.  ఏటా 40 లక్షల మంది పైగా దర్శిస్తారు. ఈ ఆలయ నిర్మాణం కలువ పువ్వు వలె ఉంటుంది. ఈ విధంగా నిర్మాణం జరగడం వల్ల ఈ ఆలయానికి లెక్కకు మించిన అవార్డులు వచ్చాయి. "బహాయీ" శిల్ప కళ ప్రకారం అబ్దుల్ బహా అనే అతను "భాయీ" మత వ్యస్థాపకుడు "బహాఉల్లా" కి కొడుకుబహాఉల్లా ప్రకారం ఒక ప్రార్ధనా స్థలం తొమ్మిది వ్రుత్తాకార భుజాలతో,విగ్రహాలు,చిత్ర పటాలు ప్రదర్శన కి ఉంచకుండా,ఎటువంటి హోమ,అగ్ని కుండం లేకుండా ఉండాలి. మిగతా అన్ని "బహాయీ" గుడుల వలే ఢిల్లీ "లోటస్ టెంపుల్" కూడా ఈ ప్రకారమే నిర్మించబడింది. ప్రతి 3 రేకులని కలుపుతూ కట్టడం వల్ల 9 వృత్తాకార భుజాల వలె కనిపిస్తుంది. అందుకే ఈ కట్టడాని 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి.


మొత్తం 27 రేకులతో కూడిన కలువ పువ్వు వలె ఆకారంలో కట్టబడినది.  మధ్య నీటిలో తేలియాడుతున్నట్టు ఎంతో అందంగా మనస్సు కి ఆహ్లాదాన్ని కలిగించే విధంగా కనిపిస్తుంది. మొత్తం 26 ఎకరాల స్థలంలో ఉన్నది.  తొమ్మిది ద్వారాలతో కనిపించే ఈ ఆలయం లోపల 2500 మంది కూర్చోగలిగినంత విశాలమైన ధ్యానమందిరం ఉంటుంది. దీన్ని నిర్మించిన ఇరానీ శిల్పకారుడు ఫరీబోజ్‌ సహ్‌బా. ఆలయం బయట ఉద్యాన వనాలు కూడా గమనించవచ్చు. 2011 సం || ఈ ఆలయం గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించినది.


దర్శన సమయం :

ప్రతి రోజు ఉదయం  : 9.00 -5.30 
ప్రతి సోమవారం సెలవు.

వసతి వివరాలు :

ఈ లోటస్ టెంపుల్ కి దగ్గర లోనే ప్రైవేట్ హోటల్ కు కూడా కలవు.

ఆలయానికి చేరుకునే విధానం :

రోడ్డు మార్గం :

ఢిల్లీ లోని ప్రధాన బస్ స్టేషన్ నుంచి ఈ టెంపుల్ కి చేరుకోవచ్చు.

రైలు మార్గం :

ఈ ఆలయానికి  దగ్గరలోనే కల్కాజి అనే మెట్రో స్టేషన్ కలదు. అక్కడి నుంచి ప్రైవేట్ వాహనాలలో చేరుకోవచ్చు.

విమాన మార్గం :

ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి కార్ లేదా ప్రైవేట్ వాహనాలలో చేరుకోవచ్చు.

ఆలయ చిరునామా :

లోటస్ ఆలయం ,
బహపూర్ రోడ్డు ,
శంబు బయల్ బాఘ్ ,
కల్కాజి ,
న్యూ ఢిల్లీ
పిన్ కోడ్- 110019

Key Words : Lotus Temple , Famous Temples In Delhi , Address, Bahapur Temple Timings, Hindi Temples Guide 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS