ద్వారకా తిరుమల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము. ఇది విజయవాడ నగరానికి 98 కి.మీ. దూరంలోను, రాజమండ్రి నగరానికి 75 కి.మీ. దూరంలోను ఉన్నది. ద్వారకా తిరుమల క్షేత్రం భారతదేశంలో అత్యంత ప్రాచీన క్షేత్రముగా చెప్పబడుతుంది. ఈ క్షేత్రంలో శేషాద్రి కొండ మీద కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. స్వయంభూవుగా ప్రత్యెక్షమైన వెంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారకా అనే ముని పేరు మీద ఈ ప్రదేశమునకు ద్వారకా తిరుమల అన్న పేరు వచ్చింది.
ఒకే విమాన శిఖరము క్రింద రెండు విగ్రహములు ఉండటము ఇక్కడి విశేషము. ఒక విగ్రహము సంపూర్ణమైనది. రెండవది స్వామియొక్క పై భాగము మాత్రమే కనుపించు అర్ధ విగ్రహము. ద్వారకా తిరుమలకి చిన్న తిరుపతి అన్న మారు పేరు వ్యవహారంలో వుంది. ద్వారకుడు అనే బ్రాహ్మణుడు జీవితాంతం తిరుపతి వెళ్లి ప్రతిఏటా వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేవాడు.
ద్వారకా తిరుమలకు చేరుకోవడం ఎలాగంటే...? విజయవాడ-రాజమండ్రి మార్గంలో ఏలూరుకు 41 కి.మీ., భీమడోలుకు 17 కి.మీ., తాడేపల్లి గూడెంకు 47 కి.మీ. దూరంలో ఉంది. ఏలూరు, తాడేపల్లి గూడెంలలో ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఆగుతాయి. భీమడోలులో పాసెంజర్ రైళ్ళు ఆగుతాయి. ఈ పట్టణాలనుండి, మరియు చుట్టుప్రక్కల ఇతర పట్టణాలనుండి ప్రతిరోజూ ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులను నడుపుతోంది
ఆలయ దర్శన సమయాలు : 6 am - 1 pm and 3 pm - 9 pm.
మావుళ్ళమ్మవారి ఆలయం:
గోదావరి నదికి పశ్చిమ తీరంలో “పశ్చిమ గోదావరి జిల్లా” ఉంది. జిల్లాలోని ఏలూరు పిదప అతి పెద్ద పట్టణం ” భీమవరం “. ఈ ప్రాంతమును తూర్పు చాళుక్య వంశానికి చెందిన భీమ చాళుక్యడు పాలించాడు. భీమ చాళుక్యడు పేరు మీద పట్టణానికి భీమవరం అనే పేరు వచ్చింది. ఇతడు క్రీ.శ. 890-918 సంవత్సరాల మధ్య శ్రీ సోమేశ్వర దేవాలయం నిర్మించాడు. భీమవరం పట్టణంలో గునుపూడి ఒక ప్రాంతము. ఇచ్చట శ్రీ సోమేశ్వర దేవాలయం ను దర్శించగలం. ఇది పంచారామాల లో ఒకటిగా ప్రతీతి. గునుపూడి శ్రీ సోమేశ్వర దేవాలయంకి పశ్చిమ దిశగా సుమారు ఒక కీ.మీ దూరన శ్రీ మావుళ్ళమ్మ గుడి ఉంది. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు భీమవరం గ్రామ దేవత. భీమవరం నగర నడిబొడ్డున కొలువు తీరిన శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం యొక్క సంవత్సర ఆదాయం సుమారు రెండు కోట్ల రూపాయలు పైగా ఉంటుంది అని చెప్పుచుంటారు. దేవస్థానం వారు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుతారు. ప్రతి నిత్యం భక్తులుకు అన్నదానం జరుపుతారు.
శ్రీ మావుళ్ళమ్మ గుడి కి సుమారు 700 మీటర్లు దూరం లో RTC Bus Stand, సుమారు
1 కీ.మీ దూరం లో భీమవరం టౌన్ రైల్వే స్టేషన్, మరో దిశ వైపు సుమారు 1.5 కీ.మీ దూరం లో భీమవరం జంక్షన్ అను రైల్వే స్టేషన్ ఉంటాయి.
రాజమండ్రి – విజయవాడ మెయిన్ రైలు మార్గములో నిడదవోలు జంక్షన్ అను రైల్వే స్టేషన్ ఉంది. నిడదవోలు నుంచి నర్సాపురం కు గల బ్రాంచి రైలు మార్గములో “భీమవరం జంక్షన్” అను రైల్వే స్టేషన్ వస్తుంది. భీమవరం జంక్షన్ కు కొంత ముందుగా భీమవరం రైల్వే క్యాబిన్ (నిడదవోలు వైపు) ఉంటుంది. భీమవరం రైల్వే క్యాబిన్ నుంచి భీమవరం టౌన్ మీదగా గుడివాడ రైల్వే జంక్షన్ కు మరో బ్రాంచి రైలు మార్గము కూడ ఉంటుంది.
నిడదవోలు – నర్సాపురం బ్రాంచి రైలు మార్గము మరియు నిడదవోలు – గుడివాడ బ్రాంచి రైలు మార్గములు భీమవరం రైల్వే క్యాబిన్ నుంచి విడిపోతాయి.
పశ్చిమ గోదావరి జిల్లా లోని అన్ని ముఖ్య ప్రాంతములు నుంచి భీమవరం కు బస్సులు ఉంటాయి. తూర్పు గోదావరి జిల్లా లోని రాజమండ్రి నుంచి కూడ ఎక్కువ బస్సులు కలవు. రాష్ట్రం లోని అన్ని ముఖ్య ప్రాంతములు నుంచి భీమవరం కు బస్సులు దొరుకుతాయి. భీమవరంలో మంచి వసతులున్నాయి.
ఆలయ దర్శన సమయాలు : 5:00 AM to 12:00 PM and 1:00 PM to 9:00 PM
పాలకొల్లు క్షీర లింగేశ్వర స్వామి:
ఆంధ్రప్రదేశ్‌లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో పాలకొల్లు ఒకటి. శ్రీరాముడు సీతమ్మ వార్ల స్వహస్తాలతో ప్రతిష్ఠితమైన ప్రసిద్ధ క్షీరారామలింగేశ్వరస్వామి దేవాలయం ఇక్కడే ఉంది. ఇక్కడి మందిరాన్ని చాళుక్యుల కాలంలో, 10 - 11 శతాబ్దులలో, నిర్మించారు. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది. దీనికి కొద్ది దూరంలో ఒక చెరువు ఉన్నది గోపుర నిర్మాణసమయంలో ఒక్కొక్క అంతస్తు నిర్మితమైన తరువాత దాని చుట్టూ మట్టినిపోస్తూ దానిపై రాకపోకలతో రెండవ అంతస్తు నిర్మాణం చేసేవారట ఆవిధంగా మట్టి తీయగా ఏర్పడినదే. ఈ చెరువు (ప్రస్తుతం దీనిని రామగుండం అని పిలుస్తున్నారు). ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తయిన,, చోళ రాజుల శిల్పకళా రీతులను అద్భుతంగా చూపే గోపురాలలో ఇది ఒకటి.
పంచారామ క్షేత్రాలలో ఒకటైన క్షీరారామం పార్వతీ సమేతుడై 'శ్రీ రామలింగేశ్వరుడు' వెలసిన పరమ పావనమైన పుణ్య క్షేత్రం. ఇక్కడి శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుచే శివలింగం ప్రతిష్ఠించబడిన ఈ పుణ్య క్షేత్రానికి విష్ణుమూర్తే క్షేత్రపాలకుడు. ఆదిశంకరాచార్యులవారు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీ చక్రం ప్రతిష్ఠించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ క్షేత్రాన్ని క్షీరపురి పాలకొలను, ఉపమన్యుపురం, అనే పేర్లతో కూడా పిలుస్తూ వుంటారు. శివలింగం పైభాగం మొనదేలి ఉండటం వలన ఇక్కడి స్వామివారిని 'కొప్పు రామలింగేశ్వరుడు' అని కూడా పిలుస్తారు.
ప్రయాణ వసతులు:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ వారు పంచారామాలను బస్సులో ఒక్కరోజులో దర్శించే యాత్రా సౌకర్యాన్ని కలిగిస్తున్నారు. సుమారు 700 కి.మీ. సాగే ఈ యాత్ర ప్రతిరోజు రాత్రి 8.00 గంటలకు మొదలై మళ్ళీ మరునాడు రాత్రి 8.00 గంటలకు ముగుస్తుంది. ప్రస్తుతం ఈ యాత్ర టిక్కెట్టు 350 రూపాయలు.
ఆలయ దర్శన సమయాలు : 5:30am to 11:30am and 4:00pm to 8:30pm.
గురవాయిగూడెం - మద్ది వీరాంజనేయ స్వామి:
హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. కలియుగంలో మద్యుడనే మహర్షి రూపంలో పుట్టిన మధ్వాసురుడు హనుమంతుడి కోసం తపస్సు చేశాడు. ఒకరోజు పక్కన ఉన్న కాల్వలో స్నానం చేసి వస్తూ దారిలో సొమ్మసిల్లి పడిపోతే ఓ వానరం అతడిని లేపి సేవలు చేసి, తినడానికి మామిడి పండు ఇచ్చింది. అప్పటి నుంచి రోజూ ఆ వానరం వచ్చి సపర్యలు చేయడం, పండు ఇవ్వడంతో నీ రుణం ఎలా తీర్చుకోవాలి.... నీవు ఎవరో నాకు తెలియదు, నాపై ఎందుకింత ప్రేమని మద్యుడు అడిగాడు.
దీంతో వానర రూపంలో ఉన్న ఆంజనేయుడు ఆయనకు ధర్శనం ఇచ్చాడు. దీనికి పులకించిన మద్యుడు స్వామీ నిన్ను ఒకే ఒక్కటి కోరతాను... దీన్ని నెరవేరుస్తావా అని అడిగితే ఆంజనేయుడు కోరుమన్నాడు. మద్యుడు స్వామీ నిన్ను విడిచి ఉండలేను, నీతోనే ఉండేలా వరం ప్రసాదించమని కోరాడు. దీనికి సరేనన్న హనుమంతుడు నీవు మద్ది చెట్టుగా అవతరిస్తే దీని కింద నేను శిలారూపంలో వెలుస్తానని అన్నాడు. అలా వెలసిన దేవాలయమే మద్ది ఆంజనేయస్వామి ఆలయం. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరుకి సమీపాన ఉంది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఈ ఆలయంలోని ఆంజనేయుడు ఓ చేతిలో పండు, మరో చేతిలో గదతో స్వయంభువుగా వెలిశాడు.
ఆలయ దర్శన సమయాలు : 5:00 am to 1:00 pm and 3:00 pm to 9:00 pm.
కొవ్వూరు గోష్పాద క్షేత్రం:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి రెండు జిల్లాలలో మాత్రమే ప్రవహిస్తోంది. అవే తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా. గోదావరికి ఒక ఒడ్డున పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరయితే మరో ఒడ్డున తూర్పు గోదావరి జిల్లాలోని ప్రధాన పట్టణం, ప్రస్తుతం రాజమండ్రిగా పిలువబడే రాజమహేంద్రవరం. వీటిలో పశ్చిమ గోదావరి జిల్లా గురించి ముందు చెప్పుకుందాము.గోష్పాద క్షేత్రం, కొవ్వూరు పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి ఒడ్డున ప్రధాన పట్టణం కొవ్వూరు. పూర్వం దీనిని గోష్పాదం, గోవూరు అనేవారు. గౌతమ మహర్షి ఇక్కడ తపస్సు చేసుకుంటూ, అనేక గోవులను పోషిస్తూ వుండేవాడు. . ఆయన గోవుల పాద ముద్రలు ఆ ప్రదేశమంతా వుండేవిట. గోవుల పాద ముద్రలు వున్న ప్రదేశంగనుక గోష్పాదం అయింది. గోవులన్నీ ఇక్కడ వుండేవిగనుక గోవూరు. అదే కాలక్రమేణా కోవూరు, కొవ్వూరు అయింది.
కొవ్వూరులో గోష్పాద క్షేత్రం చెప్పుకోదగిన గొప్ప ఆధ్మాత్మిక కేంద్రం. ఇక్కడ గోదావరీ తీరాన శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత సుందరేశ్వరస్వామి, గౌతమ మహర్షి ప్రతిష్టించిన శ్రీ వరద గోపాల స్వామి వగైరా ఆలయాలున్నాయి.ఇక్కడ గోదావరి వశిష్ట, గౌతమి అని రెండు పాయలుగా చీలి, తిరిగి వాటినుంచి ఐదు పాయలుగా చీలుతుంది. ఈ పాయలు సప్త గోదావరిగా ప్రసిధ్ధి. ఈ సప్త గోదావరులను సప్త ఋషులు ప్రజల మేలుకోరి తమవెంట అనేక జన ప్రదేశాలద్వారా తీసుకెళ్ళి ఏడు చోట్ల సముద్రాలలో కలిపారంటారు. అప్పటి సప్త ఋషుల పేర్ల మీద ఈ పాయలకు కాశ్యపి (తుల్యభాగ), అత్రి, వశిష్ట, కౌశికి, జమదగ్ని, గౌతమి అనే పేర్లు వచ్చాయి. ఇవి కోరంగి, అంతర్వేది, భైరవపాలెం, యానాం వగైరా ప్రదేశాలలో సాగర సంగమం చేస్తాయి.
పెనుగొండ కన్యకా పరమేశ్వరి ఆలయం:
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవికి పలు ఆలయాలున్నాయి. వీటిలో ప్రసిద్ధి చెందిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ అనే పట్టణంలో ఉంది. ఈ ఆలయంలో ఏడు అంతస్తులతో ఉన్న గాలి గోపురం వివిధ వర్ణాలతో,చక్కటి శిల్ప కళతో అలరారుతూ ఉంటుంది. ఇది వైశ్యులకు పవిత్ర క్షేత్రం. పెనుగొండ క్షేత్రాన్ని వైశ్యుల కాశీ గా భావిస్తారు. దేవతల లోకకళ్యాణం కోసం అవతారాలు ఎత్తుతుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా భక్తులను అనుగ్రహించడం కోసం అమ్మవారు అనేక రూపాల్లో అవతరిస్తుదని చెబుతుంటారు. అలాంటి వాటిలో 'శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి' రూపానికి ఎంతో విశిష్టత వుంది.
ఈశ్వరుడికి కుడివైపున వాసవి దేవి కొలువైంది. ఒకచేత చిఉలుక, మరొక చేత వీణ, మరో రెండు చేతులలో తామరపువ్వు పాశము వున్నాయి. ఎంతో అందంగా అలంకరించిన ఆభరణాలతో వాసవి కోటి సూర్య ప్రకాశంతో జ్వలిస్తోంది.
ఆలయ దర్శన సమయాలు : 06-00 AM to 12-00 PM - 03-30 PM to 08-00 PM
రోడ్ లేదా రైల్ నెట్‌వర్క్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా పెనుగోండ చేరుకోవచ్చు. విజయవాడ విమానాశ్రయం పెనుగోండ నుండి 130 కి.మీ. తదేపల్లిగుడెం స్టేషన్ నుండి 35 కి.మీ / నిదాదవోల్ స్టేషన్ నుండి 30 కి.మీ / పాలకొల్లు స్టేషన్ నుండి 15 కి.మీ.
హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, వైజాగ్, రాజమండ్రి, నిదాదవోలే నుండి నర్సాపూర్‌కు వెళ్లే బస్సులు రహదారి ద్వారా బాగా చేరుకోవచ్చు.