how to reach shirdi sai baba temple by train | షిర్డీ ట్రైన్ లో ఎలా చేరుకోవాలి | Train Routs Shirdi


మనలో చాలా మందికి ట్రైన్ లో షిరిడీ చేరుకోవాలి అని ఉంటుంది. కానీ వారి వారి ప్రాంతాల నుంచి ఏ ట్రైన్ లో వెళ్లలో , ఆ ట్రైన్ ఏ సమయంలో బయలుదేరుతుందో తెలియక తికమకా పడుతూ ఉంటారు. కానీ ఇప్పడు మన హిందూ టెంపుల్స్ గైడ్ అందరికీ ఉపయోగపడే విధంగా వివిధ ప్రాంతాల నుంచి షిరిడీకి ట్రైన్ లో ఏ విధంగా చేరుకోవలో ఆ సమాచారని అందిస్తుంది.

వివిధ ప్రాంతాల నుంచి షిరిడీ  చేరుకోవడానికి ట్రైన్ యొక్క వివరాలు   :


సికింద్రాబాద్ నుంచి 

1.Train no : 17064 (అజంతా  ఎక్స్‌ప్రెస్ ట్రైన్)

ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి ప్రతి రోజు బయలుదేరుతుంది. ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి రోజు సాయంత్రం 6.10 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.40 నిమిషాలకి నాగర్ సోల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి షిరిడీ ఆలయాన్నికి  45 కి. మీ దూరం మాత్రమే కలదు. ప్రైవేట్ వాహనాలలో 100/- ఇచ్చి కూడా చేరుకోవచ్చు.

2.Train no : 17002 (సికింద్రాబాద్ జంక్షన్ - సాయి నగర్ షిరిడీ ట్రైన్)

ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి ప్రతి ఆదివారం మరియు శుక్రవారం బయలుదేరుతుంది. ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 4.50 బయలు దేరి మరుసటి రోజు ఉదయం 9.20 నిమిషాలకి షిరిడీ సాయినగర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి షిరిడీ ఆలయాన్నికి కేవలం 2 కి. మీ దూరం మాత్రమే కలదు. నడిచి చేరుకువచ్చు లేదా ఆటో లో 10/- ఇచ్చి కూడా చేరుకోవచ్చు.

కాజీపేట  నుంచి

1.Train no : 22128 ( ఆనంద్వన్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్)

ఈ ట్రైన్ కాజీపేట నుంచి ప్రతి  మంగళవారం రోజు బయలుదేరుతుంది. ఈ ట్రైన్ కాజీపేట నుంచి  సాయంత్రం 6.25 నిమిషాలకి  బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.40 నిమిషాలకి నాసిక్  రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి షిరిడీ ఆలయాన్నికి  88 కి. మీ దూరంలో కలదు.  అక్కడి నుంచి ప్రభుత్వ మరియు ప్రైవేట్ వాహనాలలో కూడా చేరుకోవచ్చు.

2.Train no : 11084 (తాడోబ వీక్లీఎక్స్‌ప్రెస్ ట్రైన్)

ఈ ట్రైన్ కాజీపేట నుంచి ప్రతి శనివారం  బయలుదేరుతుంది. ఈ ట్రైన్ కాజీపేట నుంచి  సాయంత్రం 5.35 బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 3.40  నిమిషాలకి నాగర్ సోల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి షిరిడీ ఆలయాన్నికి  45 కి. మీ దూరం మాత్రమే కలదు. ప్రైవేట్ వాహనాలలో 100/- ఇచ్చి కూడా చేరుకోవచ్చు.

3.Train no : 22152 ( కాజీపేట - పూణే వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్)

ఈ ట్రైన్ కాజీపేట నుంచి ప్రతి ఆదివారం బయలుదేరుతుంది. ఈ ట్రైన్ కాజీపేట నుంచి మధ్యాహ్నం 1.30 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30 నిమిషాలకి మన్మాడ్  రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి షిరిడీ ఆలయాన్నికి  58 కి. మీ దూరం కలదు.మన్మాడ్  రైల్వే స్టేషన్ నుంచి షిరిడీ సాయినగర్ కి డైరెక్ట్ గా లోకల్ ట్రైన్ లు కలవు. ప్రతి 2 గంటలకి ఒక లోకల్ ట్రైన్ కలదు. లేదా అక్కడి నుంచి ప్రభుత్వ లేదా  ప్రైవేట్ వాహనాలలో కూడా షిరిడీలో రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.

విజయవాడ నుంచి 

1.Train no : 17208 (విజయవాడ జంక్షన్ - సాయి నగర్ షిరిడీ ట్రైన్)

ఈ ట్రైన్ విజయవాడ నుంచి షిరిడీ కి ప్రతి వారంలో ఒక్కటే ట్రైన్ కలదు. ప్రతి మంగళవారం రోజు ఉదయం 10.25 నిమిషాలకి బయలు దేరి మరుసటి రోజు ఉదయం 9.20 నిమిషాలకి  షిరిడీ సాయినగర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి షిరిడీ ఆలయాన్నికి కేవలం 2 కి. మీ దూరం మాత్రమే కలదు. నడిచి చేరుకువచ్చు లేదా ఆటో లో 10/- ఇచ్చి కూడా చేరుకోవచ్చు.

విశాఖపట్నం నుంచి 

2.Train no : 18503 (విశాఖపట్నం - సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్)

ఈ ట్రైన్ విశాఖపట్నం నుంచి షిరిడీ కి ప్రతి వారంలో ఒక్కట్రైన్ మాత్రమే కలదు. ప్రతి గురువారం రోజు ఉదయం 9.00 గంటలకి బయలు దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.15 నిమిషాలకి  షిరిడీ సాయినగర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి షిరిడీ ఆలయాన్నికి కేవలం 2 కి. మీ దూరం మాత్రమే కలదు. నడిచి చేరుకువచ్చు లేదా ఆటో లో 10/- ఇచ్చి కూడా చేరుకోవచ్చు.

కాకినాడ నుంచి 

3.Train no : 17206 (కాకినాడ పోర్ట్ - సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్)

ఈ ట్రైన్ కాకినాడ  నుంచి ప్రతి సోమవారం మరియు బుధవారం మరియు శనివారం బయలు దేరుతుంది. కాకినాడ పోర్ట్ స్టేషన్ నుంచి ఉదయం 6.00 గంటలకి కి బయలు దేరి మరుసటి రోజు ఉదయం 9.20 నిమిషాలకి  షిరిడీ సాయినగర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి షిరిడీ ఆలయాన్నికి కేవలం 2 కి. మీ దూరం మాత్రమే కలదు. నడిచి చేరుకువచ్చు లేదా ఆటో లో 10/- ఇచ్చి కూడా చేరుకోవచ్చు.

తిరుపతి నుంచి 

4.Train no : 17417 (తిరుపతి - సాయినగర్ షిర్డీ వీక్లీ ఎక్స్‌ప్రెస్)

ఈ ట్రైన్ తిరుపతి నుంచి షిరిడీ కి ప్రతి వారంలో ఒక్కట్రైన్ మాత్రమే కలదు. ప్రతి మంగళవారం రోజు ఉదయం 8.30 నిమిషాలకి బయలు దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.15 నిమిషాలకి  షిరిడీ సాయినగర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి షిరిడీ ఆలయాన్నికి కేవలం 2 కి. మీ దూరం మాత్రమే కలదు. నడిచి చేరుకువచ్చు లేదా ఆటో లో 10/- ఇచ్చి కూడా చేరుకోవచ్చు.

చెన్నై నుంచి 

1.Train no : 22601 (MGR చెన్నై సెంట్రల్ - సాయినగర్ షిర్డీ వీక్లీ ఎక్స్‌ప్రెస్) 

ఈ ట్రైన్ చెన్నై  నుంచి ప్రతి  బుధవారం రోజు  బయలుదేరుతుంది. చెన్నై సెంట్రల్ స్టేషన్ నుంచి ఉదయం 10.00 గంటలకి బయలు దేరి మరుసటి రోజు ఉదయం 11.30 నిమిషాలకి  షిరిడీ సాయినగర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి షిరిడీ ఆలయాన్నికి కేవలం 2 కి. మీ దూరం మాత్రమే కలదు. నడిచి చేరుకువచ్చు లేదా ఆటో లో 10/- ఇచ్చి కూడా చేరుకోవచ్చు.

మైసూర్  నుంచి 

1.Train no : 16217 (మైసూర్ జంక్షన్- బెంగళూరు - సాయినగర్ షిర్డీ వీక్లీ ఎక్స్‌ప్రెస్) 

ఈ ట్రైన్ మైసూర్ జంక్షన్  నుంచి ప్రతి  సోమవారం రోజు  బయలుదేరుతుంది. మైసూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 5.30 నిమిషాలకి బయలుదేరి ఉదయం 8.00 గంటలకి బెంగళూరు చేరుకొని అక్కడి నుంచి 8.10 నిమిషాలకి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.30 నిమిషాలకి  షిరిడీ సాయినగర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి షిరిడీ ఆలయాన్నికి కేవలం 2 కి. మీ దూరం మాత్రమే కలదు. నడిచి చేరుకువచ్చు లేదా ఆటో లో 10/- ఇచ్చి కూడా చేరుకోవచ్చు.

KeyWords : Sri Shiridi Sai Baba Temple , Shiridi , Train routes to Shirdi Temples, How to Reach shiridi in Train, Hindu Temples Guide

2 Comments

  1. Kzj nundi Shirdi daggara stations ki trains unnay bro. Spl trains weekly once Nsl Mmr Nk Kpg varaku tickets max available untay. Add this route also

    ReplyDelete
  2. There is one train daily Karnataka to delhi. Via puttaparthi, dharmavaram, Anantapur, gooty, gunthakal, Sholapur. You have to getdown at KOPARGAON station. It is very near to Shirdi.

    ReplyDelete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS