ధర్మస్థల:
ధర్మస్థల లేదా ధర్మస్థళ హిందువుల పవిత్రక్షేత్రం. ఈ నగరం కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో బెళ్తంగడి తాలూకాలో నేత్రావతి నదీతీరంలో ఉంది. గ్రామపంచాయితీ మండలంలో ఉన్న ఒకే ఒక పంచాయితీ ధర్మస్థల . ఈ గ్రామంలో ప్రసిద్ధి చెందిన ధర్మస్థల ఆలయం ఉంది. మంజునాథుడు అంటే శ్రీ శివ భగవానుడే ! ఈయనకు గల పేర్లలో ఇది ఒకటి. మంజునాథ, రుద్రుడు, త్రినేత్రుడు, పరమేశ్వరుడు, మహేశ్వరుడు మొదలైన పేర్లు కూడా ఉన్నాయి. ఎలా పిలిచినా, తలచినా కరుణించే దైవం ఆ శివభగవానుడే! ధర్మస్థల దేవాలయం దాని బంగారు లింగానికి ప్రసిద్ధి చెందినది.
తులాభారం :
భక్తులు తమ కోరికలు నెరవేరాక బియ్యం, ఉప్పు, పూలు, బెల్లం, అరటి పండు, నాణేలు మొదలైన వాటితో తులాభారం తూగి స్వామి వారికి మొక్కుబడి చెల్లించుకుంటారు.
ఆలయ సందర్శన వేళలు : ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మరియు సాయంత్రం 6:30 నుండి రాత్రి 8 :30 వరకు దర్శించవచ్చు.
ఎలా చేరుకోవాలి ?
రోడ్డు మార్గం : బెంగళూరు, మంగళూరు, మైసూరు మరియు రాష్ట్రంలోని ప్రధాన నగరాల నుండి ధర్మస్థల కు ప్రభుత్వ/ ప్రవేట్ ఓల్వో, లగ్జరి, డీలక్స్ తదితర బస్సులను నడుస్తుంటాయి.
రైలు మార్గం : మంగళూరు సమీప రైల్వే స్టేషన్. అక్కడి నుండి ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులలో లేదా టాక్సీ లలో దఃమస్థల చేరుకోవచ్చు.
విమాన మార్గం : సమీపాన 75 కి. మీ ల దూరంలో మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. క్యాబ్ లేదా టాక్సీ లలో ధర్మస్థల చేరుకోవచ్చు.
dharmasthala temple history in hindi, dharmasthala temple history in tamil, importance of dharmasthala temple, dharmasthala history in telugu, dharmasthala temple timings, dharmasthala temple photos, dharmasthala address, dharmasthala power