Shani Shingnapur Temple Hisotyr in Telugu | Maharashtra

శని శింగణాపూర్ :
శని సింగనాపూర్ ఇక్కడ శని దేవుణ్ణి పూజించటం జరుగుతుంది. ఆశ్చర్యమేమిటి అంటే ఈ గ్రామంలో ఏ ఒక్క ఇంటికీ తలుపులుండవు. దేవాలయాలు సైతం దర్వాజాలు లేకుండా దర్శనమిస్తాయి. అంతేకాదు ఋణాలు ఇచ్చే బ్యాంకులు కూడా తలుపులు లేకుండా నిర్మించడం జరిగింది. 

మహారాష్ట్రలోని, శని శింగనాపూర్ లో ఉన్న ఈ ఆలయం శని దేవుని ఇంకొక ముఖ్య పుణ్యక్షేత్రం. శింగనాపూర్ షిరిడి, ఔరంగాబాద్ మధ్యలో నెలకొని ఉంది. ఇక్కడి దైవము "స్వయంభు" అనగా భూమి నుండి స్వయంగా ఉద్భవించిన నల్లని, గంభీరమైన రాతి విగ్రహం. కచ్చితంగా ఏ కాలానికి చెందినదో ఎవరికీ తెలియనప్పటికీ, స్థానిక పల్లెటూరికి చెందిన గొర్రెల కాపురుల ప్రకారం స్వయంభు శనీశ్వరుడు అనాదిగా ఇక్కడ కొలువైయున్నాడు. కనీసం కలియుగం ప్రారంభం నుండి దీని ఉనికి ఉన్నట్టుగా నమ్ముతారు.

శిరిడీకి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఈ శని శింగనాపూర్ ను చూడకుండా తిరిగిరారు. ఇది ఒక సంప్రదాయంగా వస్తోంది. శిరిడీ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో శని శింగనాపూర్ ఉంది. శిరిడీ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు నిత్యం ఇక్కడికి వెలుతుంటాయి. ప్రైవేటు ట్యాక్సీలు కూడా అందుబాటు ధరల్లో దొరుకుతాయి. అహ్మద్ నగర్ నుంచి 70 కిలోమీటర్లు, రాహూరు నుంచి 24 కిలోమీటర్ల దూరంలో శని శింగనాపూర్ ఉంటుంది.

వాయు మార్గం:
శింగనాపూర్ కు దగ్గరగా అంటే ఔరంగాబాద్. ఈ రెండునగరాలమధ్య దూరం 90 కిలోమీటర్లు. ఇక నాసిక్ ఎయిర్ పోర్ట్ శింగనాపూర్ కు 144 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల నుంచి శనిశింగనాపూర్ కు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఇందు కోసం ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు అందుబాటులో ఉంటాయి. అయితే చాలా వరకూ ప్రైవేటు ట్యాక్సీల ద్వారా వెలుతారు.

రైలు మార్గం : శింగనాపూర్ కు దగ్గరగా ఉన్న రైల్వేస్టేషన్ రాహురీ. వీటి మధ్య దూరం 32 కిలోమీటర్లు. అహ్మద్ నగర్ (35 కిలోమీటర్లు), శ్రీరాంపుర (54 కిలోమీటర్లు), శిరిడీ రైల్వేస్టేషన్ 75 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఆయా రైల్వే స్టేషన్ల నుంచి శింగనాపూర్ కు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవడానికి సదుపాయాలు బాగున్నాయి. ముఖ్యంగా అందుబాటు ధరల్లోనే ప్రైవేటు ట్యాక్సీలు మనకు దొరుకుతాయి. వీకెండ్ కా కూడా ఈ ప్రాంతానికి వెళ్లి రావచ్చు.

shani dev story in telugu pdf, shani dev story in telugu pdf free download, shani shingnapur temple timings, shani shingnapur temple rules, shani story in telugu pdf, shani dev katha in telugu, trimbakeshwar temple history in telugu, shani shingnapur history in kannada

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS