Murudeshwara And Pancha Kshetras Temples History | Karnataka

మురుడేశ్వర్ :
మురుడేశ్వర కర్ణాటక రాష్ట్రం లోని ఉత్తర కన్నడ జిల్లా లోని భట్కల్ తాలుకా లోని ఒక పట్టణం. భత్కల్ నుంచి మురుడేశ్వర 50 కిలోమీటర్ల దూరం. ఈ పట్టణం శివుని పుణ్యక్షేత్రం. ఈ పట్టణం అరేబియా సముద్రం ఒడ్డున ఉంది. ఈ పట్టణంలో ప్రపంచంలోనే అతి పొడవైన శివుని విగ్రహం ఉంది.ఈ పట్టణంలో ఉన్న శివాలయంలో ఉన్న ప్రధాన దైవం శివుడు మురుడేశ్వరుడుగా అర్చింపబడుతున్నాడు.

మురుడేశ్వర పట్టణ ఇతిహాసం త్రేతాయుగం వరకు ఉంది. రావణాసురుడు, శివుని గురించి అకుంఠిత తపస్సు చేసి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తెస్తాడు. కాని శివుడిచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం భూమిమీద ఆలింగం ఎక్కడ పెడితే అక్కడ స్థాపితం అయి, అక్కడ నుండి తిరిగి ఎత్త శక్యం కాదని శివుడు చెబుతాడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి దేవతలు విష్ణువును వేడుకొనగా విష్ణువు తనమాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు. అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయిందని భావించి సంధ్యవార్చుకోవడానికి సంసిద్ధుడు అవుతాడు.

ఈ విషయం తెలుపుకొన్న నారదుడు వినాయకుని వద్దకు వెళ్ళి రావణాసురుడి వద్ద నుండి ఆత్మలింగం తీసుకొని భూమి మీద పెట్టాలని చెబుతాడు.అప్పుడు వినాయకుడు నారదుడు కోరినట్లు రావణాసురుడు సంధ్యవార్చుకొనే సమయానికి బ్రాహ్మణ వేషం లో వెడతాడు. ఆ బ్రాహ్మణ బాలకుడిని చూసిన వెంటనే రావణాసురుడు తాను సంధ్యవార్చుకొనవలసిన కారణమున ఆ బాలకుడిని లింగాన్ని పట్టుకొనవలసిందిగా కోరుతాడు. అప్పుడు వినాయకుడు లింగం చాలా బరువు ఉంటే తాను ఎక్కువ సేపు మోయలేనని, మోయలేకపోయే సమయం వచ్చినప్పుడు మూడు సార్లు పిలుస్తానని రావణాసురుడు రాకపోతే ఆలింగాన్ని భూమి పైన పెడతానని చెబుతాడు.

రావణాసురుడు అందుకు అంగీకరించగా, వినాయకుడు లింగాన్ని తన చేతులలోకి తీసుకొంటాడు.రావణాసురుడు సంధ్యవార్చుకోవడానికి వెళ్ళగానే గణపతి లింగాన్ని మోయలేక పోతున్నట్లు మూడు సార్లు పిలుస్తాడు. సంధ్య మధ్యలో ఉండడంతో రావణాసురుడు అక్కడకు వచ్చేటప్పటికే వినాయకుడు లింగాన్ని భూమి మీద నిలుపుతాడు. రావణాసురుడు వచ్చి లింగాన్ని భూమి మీద నిలిపినందుకు గణపటి నెత్తిమీద మొట్టుతాడు, గణపటి నెత్తికి గుంట పడుతుంది.వినాయకుడు భూమి మీద నిలిపిన స్థలం గోకర్ణ, మురుడేశ్వర లింగం పడిన భాగాలలో ఒక ప్రదేశం.

విష్ణువు తన మాయని తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్ళి కనిపిస్తాడు.ఈ విషయాన్ని గ్రహించి రావణుడు ఎంతో కోపోద్రిక్తుడై ఆత్మలింగాన్ని తన చేతులతో పెకలించ ప్రయత్నం చేస్తాడు. ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరివేస్తే గోకర్ణకు 23 కి.మి. దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడుతుంది. లింగం పై నున్న మూత తొలగించి విసిరి వేస్తే అది గోకర్ణకు 27 కి.మి దూరంలో ఉన్న గుణేశ్వరలో పడుతుంది. లింగం పైనున్న వస్త్రాన్ని విసిరివేస్తే అది కందుక పర్వతం పై నున్న మృదేశ్వరలో పడుతుంది. ఆపేరు కాలక్రమంలో మురుడేశ్వరగా మారింది. ఈ ఐదు క్షేత్రాలన్నీ కర్ణాటక రాష్ట్రంలో 'పంచక్షేత్రాలు' గా ప్రసిద్ధి చెందాయి.

గోకర్ణ:
గోకర్ణ రావణాసురుడు ఆత్మలింగాన్ని నిలిపిన స్ధలం గోకర్ణ. ఇదే మహాబలేశ్వర దేవాలయం గా ప్రసిద్ధి చెందినది. ఇందులోనే పవిత్ర ఆత్మలింగం గర్భగుడిలో కొలువై ఉంటుంది. సమీపంలో ఉన్న అరేబియా సముద్రంలో స్నానం చేసి భక్తులు దేవాలయాన్ని దర్శిస్తారు.

సజ్జేశ్వర :
ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరేస్తే అది గోకర్ణకు 35-40 KM దూరంలో ఉన్న సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడుతుంది. గోకర్ణ నుండి ఇక్కడికి గంటలో చేరుకోవచ్చు.

గుణేశ్వర :
లింగం పై నున్న మూత తొలగించి విసిరేస్తే అది గోకర్ణకు 40-50 KM ల దూరంలో ఉన్న గుణేశ్వర లో పడుతుంది. గోకర్ణ - గోవా జాతీయ రహదారి గుండా వెళితే గుడికి చేరుకోవచ్చు.

దారేశ్వర :
లింగం పైనున్న దారం తొలగించి విసిరేస్తే అది గోకర్ణకు దక్షిణం వైపు ఉన్న దారేశ్వర లో పడుతుంది. గోకర్ణ నుండి దారేశ్వర 27 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

కందూక :
పర్వతం లింగం పైనున్న వస్త్రం విసిరేస్తే అది కందూక (బంతి) పర్వతం పై నున్న మృదేశ్వర లో పడుతుంది. అదే కాలక్రమంగా మురుడేశ్వర గా మారింది. మురుడ అంటే కన్నడంలో వస్త్రం అని అర్థం. గోకర్ణ నుండి ఈ పట్టణం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

సందర్శించు సమయం : 3 AM నుండి 1 PM మరియు తిరిగి 3 PM నుండి 8 PM వరకు.

రోడ్డు సౌకర్యం:
హొన్నావర్-భట్కల్ మధ్య నున్న జాతీయ రహదారి-17 మీద మురుదేశ్వర అని ఒక తోరణం స్వాగతం పలుకుతుంది. తోరణం నుండి ఒక కి.మీ. దూరం తూర్పు వైపు వెడితే మురుదేశ్వర పట్టణం వస్తుంది. బెంగళూరు నుండి జాతీయ రహదారి-206 ద్వారా హొన్నావర్ చేరుకొని అక్కడ నుండి జాతీయ రహదారి -17 తీసుకొంటే మురుదేశ్వర వస్తుంది.బెంగళూరు నుండి 455 కి.మీ. దూరంలో మురుదెశ్వర వస్తుంది.మంగళూరు నుండి 180 కి.మీ. దూరంలో ఉంది.

రైలు సౌకర్యం:
మురుడేశ్వర రైలు స్టేషను కొంకణ్ రైల్వే లైను మీద ఉంది. ఈ రైలు స్టేషనులో ముఖ్యంగా ప్యాసింజర్ బండ్లు మాత్రమే ఆగుతాయి. మంగళూరు నుండి మార్మగోవా వరకు నడిచే ప్యాసింజర్ రైలు ఇక్కడ నిలుస్తుంది. బెంగళూరు నుండి మురుదేశ్వరకు సరాసరి రైలు సౌకర్యం లేదు. భట్కల్ వరకు రైలు మీద వచ్చి అక్కడ నుండి కొంకణ్ రైల్వే లైను మీద మురుదేశ్వర చేరుకోవచ్చు.

విమాన సౌకర్యం:
మురుడేశ్వరకి దగ్గర లోని విమానాశ్రయం మంగళూరు 165 కి.మీ. దూరంలో ఉంది. హుబ్లీ, పనాజీ విమానాశ్రయాలు దగ్గరలో ఉన్న వేరే విమానాశ్రయాలు.

gokarna temple history in telugu, murudeshwar temple history in hindi, how to visit murudeshwar temple, murudeshwar temple address, murudeshwar temple quotes, murudeshwar temple built in which year, udupi temple history in telugu, mahashivratri in murudeshwar, murudeswar temple history telugu.

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS