Guruvayur Temple History | Kerala, Timings, Poojas Detasil

గురువాయూర్ :
గురువాయూరు (Guruvayoor) కేరళలోని పవిత్రమైన విష్ణుక్షేత్రం. ఇది త్రిసూర్ జిల్లాలోని పట్టణం, పురపలకసంఘం. దక్షిణ ద్వారకగా పిలవబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు 'గురువాయూరప్పన్' అనే పేరుతో కొలవబడుతున్నాడు. నాలుగు చేతులలో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలయాలను ధరించి.. తులసి మాలలతో, ముగ్ధ మనోహర రూపంతో అలరించే బాలగోపాలుడి ఆలయం "గురువాయూర్". కేరళలోని త్రిసూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయంలోని స్వామిని కన్నన్, ఉన్నికృష్ణన్ (బాలకృష్ణుడు), ఉనికన్నన్, గురువాయురప్పన్ అనే పేర్లతో కొలుస్తుంటారుశ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠకు ముఖ్య కారకులు గురు - వాయువులు కాబట్టి ఈ ఊరిని 'గురువాయూరు' (గురువు+వాయువు+ఊరు) గా నిర్ణయించారు.

గురువాయూర్ ఎలా చేరుకోవాలి ??

విమాన మార్గం:
కొచ్చిన్ లో కల నెడుంబస్సెరీ అంతర్జాతీయ విమానాశ్రయం గురువాయూర్ కు 87 కి.మీ.ల దూరం లో ఉన్న సమీప విమానాశ్రయం. కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ పవిత్ర పట్టణానికి సుమారు 100 కి.మీ.ల దూరంలో ఉన్న మరొక ఏర్‌పోర్ట్. టాక్సీలు, బస్ లు విమానాశ్రయం నుండి గురువాయూర్ కు తేలికా లభ్యమవుతాయి.

రైలు మార్గం:
గురువాయూర్ లో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడి నుండి ఇరుగు పొరుగు పట్టణాలకు, నగరాలకు రైళ్ళు వెళుతుంటాయి. సమీప రైలు జంక్షన్ త్రిస్సూర్. ఇది 27 కి.మీ.ల దూరం. ఇక్కడి నుండి దేశంలోని ప్రధాన నగరాలకు రైళ్ళు కలవు.

రోడ్డు మార్గం:
గురువాయూర్ పట్టణానికి కేరళలోని అన్ని ప్రదేశాల నుండి ప్రభుత్వ బస్ లు కలవు. ఇండియాలోని ఇతర నగరాల నుండి అంటే కొచ్చిన్, కాలికట్, పాల్ఘాట్, త్రివేండ్రం, చెన్నై, బెంగుళూర్, కోయంబత్తూర్, సేలం ల నుండి నేరు బస్ లు కూడా ఉన్నాయి.

ఆలయ దర్శించే సమయం : 3.00AM TO 12.30PM - 4.30PM TO 9.15PM.

guruvayoor temple timings, guruvayur temple dress code, guruvayurappan original picture, guruvayur temple darshan online booking, guruvayur temple address, guruvayoor temple vazhipadu online booking, guruvayur temple darshan waiting time, guruvayur temple entry, guruvayoor temple history telugu.

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS