Ellora Caves | temples, Ellora, India, Maharashtra

ఎల్లోరా గుహలు :
కనులు తిప్పుకోనీయని అందాలు అజంతా సొంతం. అజంతా, ఎల్లోరా గుహలు భారతీయ శిల్పకళలకు తార్కాణం. హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన శిల్పకళారీతులు ఒకే చోట కనువిందు చేస్తాయి. 

ఎల్లోరా గుహలు మహారాష్ట్రలో ఔరంగాబాద్కు 30 కి.మీ. దూరములో ఉంది. మాన్యుమెంటల్ గుహలకు ప్రసిద్ధి చెందిన ఎల్లోరా ప్రపంచ వారసత్వ సంపద. ఎల్లోరా భారతీయ రాతి శిల్పకళను ప్రతిబింబిస్తుంది. చరణధారీ కొండల నుండి తవ్వబడిన ఈ గుహలు హిందూ, బౌద్ద, జైన దేవాలయాలు , సన్యాసాశ్రమాలు. 5వ శతాబ్దము నుండి 10వ శతాబ్దము మధ్యలో నిర్మించబడ్డవి. మొదటి 12 గుహలు బౌద్ధమతానికి చెందినవి. వీటి నిర్మాణం కాలం క్రీ.పూ 600 నుంచి 800 మధ్య ఉంటుంది. 13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలూ, పౌరాణిక కథలను తెలుపుతాయి. వీటి నిర్మాణ కాలం క్రీ.పూ 600 నుంచి 900 మధ్యలో ఉంటుంది. 30 నుండి 34 గుహల వరకూ జైన మతానికి సంబంధించినవి. వీటి నిర్మాణం క్రీ.పూ 800-1000. ఈ గుహలన్నీ పక్క పక్కన ఉండి ఆ కాలపు పరమత సహానాన్ని చాటి చెబుతున్నాయి. ఈ గుహల విస్తీర్ణం సుమారు 2 కి.మీ. ఈ మొత్తం గుహల నిర్మాణానికి 500 సంవత్సరాలు పట్టింది. ఇవి యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడ్డాయి.

ఎల్లోరా గుహలు
ఎల్లోరా గుహలను రాష్ట్రకూటులు, చాళుక్యుల కాలంలో చెక్కారట. ఔరంగాబాద్‌కు వాయవ్యంగా 61 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కొండలను తొలిచి ఇంత చక్కటి అందాలను మన కోసమే తీర్చిదిద్దారా అని అనిపిస్తాయి. వీటి నిర్మాణంలో ఒక విశిష్టత ఉంది. మొదట పై అంతస్తు, అందులోని శిల్పాలను చెక్కి ఆ తరువాత కింది అంతస్తు, అక్కడి శిల్పాలు చెక్కారట. ఇక్కడ మొత్తం 34 గుహలుంటాయి.

సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఈ గుహల అందాలు దృష్టిని మరల్చనీయవు. మొదట బౌద్ధులకు సంబంధించిన 12 గుహలు ఉంటాయి. వీటిని 5-8 శతాబ్దాల మధ్య కాలంలో చెక్కారు. 6-9 శతాబ్ద కాలంలో చెక్కినవి హిందువుల గుహలు. అవి మొత్తం 17 గుహలు. చివర్లో జైనుల గుహలుంటాయి. ఇవి 8-10 శతాబ్దాల మధ్య కాలంలో చెక్కినవి. వీటిని హెరిటేజ్‌ సైట్లుగా కూడా గుర్తించింది. అయితే వీటిలో కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి.

ఎలా వెళ్ళాలి
రైలు ద్వారా ఔరంగా బాద్ కు చేరుకుని, అక్కడి నుండి బస్సులో కానీ, కార్లు, జీపులలో కాని ఎల్లోరా గుహలకు చేరుకోవచ్చు.

elephanta caves history in telugu, ajanta guhalu wikipedia in telugu, ellora silpalu, ajantha chitralu 8th class, ajantha chitralu lesson in telugu, ajanta caves - wikipedia, ellora guhalu, ajantha silpalu, ellora caves history in telugu, 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS