Antarvedi Temple Live Updates | అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో లోకకల్యాణార్థం




21/3/2020 : 
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ నివారణార్థం ,లోకకల్యాణార్థం, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక హోమాన్ని అర్చకులు నిర్వహించారు.
ఈ యాగం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు సుఖశాంతి, ఆరోగ్యం కలుగుతుందని పండితులు అంటున్నారు.


నరసింహ స్వామి వారి దర్శనాన్ని నిలిపివేసారు.. స్వామివారికి పూజలు మాత్రం యధాతథంగా అంతరంగికంగా జరుగుతున్నాయి.
20/3/2020 :
సందడి లేని నరసింహుని సన్నిధానం.

✓చరిత్రలో తొలిసారి అంతర్వేది నరసింహుని దర్శనం నిలిపివేత

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి పై కరోనా ప్రభావం పడింది. దీంతో అంతర్వేది ఆలయంలో భక్తులకు దర్శనాన్ని నిలిపేయాలని నిర్ణయించారు. గ్రహణం వేళల్లో మినహా అంతర్వేది ఆలయాన్ని మూసివేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
కానీ కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా అంతర్వేది ఆలయంలో దర్శనం మూసివేయాలని అధికారులు నిర్ణయించారు.

నరసింహ స్వామి వారి దర్శనాన్ని నిలిపివేస్తున్నామని.. స్వామివారికి పూజలు మాత్రం అంతరంగికంగా యధాతథంగా కొనసాగుతాయని ఆలయ ఏసీ స్పష్టం చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఆలయం మూసివేయడం లేదని, భక్తుల ప్రవేశాన్ని మాత్రమే తాత్కాలికంగా నిలిపివేశామని ఆయన స్పష్టం చేశారు.

భక్తులు సహకరించాలని కోరారు.

Antarvedi temple live updates , antarvedi temple information. antarvedi temple details

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS