Famous Temples List In Rajanna Sircilla District | Telangana State

రాజన్నసిరిసిల్ల  జిల్లాలోని ప్రముఖ దేవాలయాల జాబితా :

ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా నూతనంగా ఏర్పడిన జిల్లా. ఇంతకు ముందు కరీంనగర్  అనే జిల్లాలో కలిసి ఉండేది. కానీ ఇప్పుడు నూతనంగా ఏర్పడినది.

1. శ్రీ రాజరాజేశ్వరి ఆలయం , వేములవాడ :

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. చాళుక్య కావారి కాలం నాటి ఆలయం. శివ స్వామి రాజయ్య గా ఈ ఆలయంలో పూజలు అందుకుంటున్నారు. కరీంనగర్ నుంచి 35 కి. మీ దూరంలో కలదు. దేశ నలుమూలల నుంచి ఈ ఆలయాన్నికి భక్తులు వస్తారు. శివరాత్రి మరియు దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

ఆలయ దర్శించే సమయం : 4.30AM TO 12.00PM - 3.00PM TO 9.00PM.

2. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం , కొండగట్టు :

ఈ ఆలయం కూడా చాలా పురాతన ఆలయం. ఏ ఆలయంలో ఒక కొండ పై కలదు. ఈ ఆలయానికి 160 సం || చరిత్ర కలదు. ఆంజనేయ స్వామి భక్తులు 40 రోజుల పాటు దీక్షలు నిర్వహించి ఈ అలయాన్నికి దర్శనికి వస్తారు. అలా చేయడం వల్ల తాము కోరిన కోరికలు నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం.  హనుమాన్ జయంతి , శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. నూతన వాహన పూజ కార్యక్రమాలు కూడా భారీగా నిర్వహిస్తారు.

ఆలయ దర్శించే సమయం : 5.00AM TO 12.00PM - 3.30PM TO 8.30PM.

3. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం , ధర్మపురి :

ఈ అలయాన్నికి ధర్మరామ , ధర్మాపురం , ధర్మవూరు అనే పేర్లు ఉన్నాయి. గోదావరి నది ఒడ్డున ఈ ఆలయం కలదు. ఈ ఆలయం 15 వ శతాబ్దం కి చెందినది. జగిత్యాల నుంచి 45 కి. మీ దూరంలో ఈ ఆలయం కలదు. వైకుంటా ఏకాదశి ఉత్సవాలు నిర్వహిస్తారు.

ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 2.00PM - 3.00PM TO 8.00PM.

4. పంచముఖ లింగ ఆలయం , రైకల్ :

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం 1 వ శతాబ్దానికి చెందినది. ఈ ఆలయం రైకల్ అనే గ్రామంలో కలదు. జగిత్యాల నుంచి 25 కి. మీ దూరంలో ఈ ఆలయం కలదు. శివరాత్రి ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహిస్తారు.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.

5. శ్రీ శివాలయం , కోటి లింగాల పల్లి :

ఈ ఆలయం వెలుగత్తురు అనే కరీంనగర్ లో కలదు. ఈ ఆలయంలో కోటి లింగాల ప్రతిష్ట జరిగినది. చుట్టూ ఎటు చూసిన మొత్తం లింగ మూర్తులతో స్వామి దర్శించుకోవచ్చు. శాత వాహన కాలం నాటి ప్రజలకి ఈ ప్రాంతం వర్తక వ్యాపారం చేసేవారు. శివరాత్రి ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహిస్తారు.

ఆలయ దర్శించే సమయం : 6.30AM TO 12.30PM - 3.30PM TO 7.00PM.

6. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం , మంధనీ :

మొదట ఈ ప్రాంతంలో శ్రీ వరాదరాజ స్వామి ఆలయం ఉండేది. ఈ స్వామి శ్రీ వైష్ణవులు జరిపే పూజలు అందుకుంటున్నారు. దసరా రోజు సాయంకాలం స్వామి వారిని అశ్వ వాహనం పై ఊరేరిగింపు చేస్తారు.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.

7. శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయం , కాళేశ్వరం :

ఈ ఆలయం మహాదేవపురం నుంచి 16 కి. మీ దూరంలో కలదు. మరియు మంధనీ గ్రామానికి 35 కి.మీ దూరంలో కలదూ. 1976-82 మధ్య ఈ ఆలయాన్ని పునః నిర్మించారు. ఈ ఆలయంలో సోమ ,శని ఆదివారాలలో రద్దీ అధికంగా ఉంటుంది.

ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 1.00PM - 4.00PM TO 8.00PM.

8. శ్రీ వీరభద్ర ఆలయం , కొత్తకొండ :

చుట్టూ కొండల మధ్య ఈ ఆలయం చాలా రమణీయంగా ఉంటుంది. ముల్కా నూర్ గ్రామం నుంచి 8 కి. మీ దూరంలో కలదు. కాకతీయుల కాలం నాటి ఆలయం. ప్రతి సం || జనవరి నెలలో 3 రోజుల పాటు స్వామివారికి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.


రాజన్న సిరిసిల్ల  జిల్లాలోని కొత్తగా చేర్చిన ఆలయాల వివరాల కొరకు ఇక్కడ చేయండి. 

Telangana Temples District Wise



KeyWords : Rajanna Sircilla Famous Temples List, Rajanna Sircilla District Surrounding Temples, Telangana Famous Temples List, Hindu Temples Guide

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS