Pallikondeswara Temple History Telugu | Timings, Pooja , Surutapalli

శ్రీ పల్లి కొండేశ్వర ఆలయం
చిత్తూరు జిల్లాలో సురుటపల్లి (సురుటుపల్లి అని కూడా పేర్కొంటారు) గ్రామంలో ఈ ఆలయం వెలిసింది. ఇక్కడ పూజలు అందుకొంటున్న శివుడు పార్వతి తొడపై తల పెట్టి విశ్రమించాడు.  అయితే ఈశ్వరుడు పడుకొని ఉన్న ఆలయం ఒక్కటే ఒక్కటి ఉంది. అది ఆంధ్రప్రదేశ్ లో ఉండటం మన అదృష్టం. పురాణ గాథలను పరిశీలిస్తే ఇలా ఎందుకు జరిగిందో అవగతమవుతుంది. పల్లి కొండేశ్వరస్వామి క్షేత్రం తిరుపతికి 73 కి.మీ ల దూరంలో చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం సురటు పల్లి గ్రామంలో తిరుపతి,చెన్నై రహదారిని ఆనుకుని వుంది.

ఈ ఆలయంలో 14 అడుగుల పొడవున మానుష్య రూపంలో వున్న శివుడు తన దేవేరి పార్వతీదేవి ఒడిలో పవళించి సేదతీరుతున్నట్లుగా దర్శనమిస్తారు. శివుడు శయన మూర్తిగా పార్వతీదేవి సర్వమంగళా దేవిగా ఈ క్షేత్రంలో మాత్రమే దర్శనమిస్తారు. చుట్టూ బ్రహ్మ, విష్ణువు, సూర్యచంద్రాదులు, నారదతుంబురుదాదులు, ఇంద్రుడు, కుబేరుడు, మార్కండేయుడు, అగస్త్యుడు, కులస్త్యుడు, వాల్మీకి, విశ్వామిత్రాదులు మహర్షులు, గణపతివల్లి, దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి, గాంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష సిద్ధసాధువులు, పల్లి కొండేశ్వరుని సన్నిధిలో కొలువుతీరి వుండగా స్వామి సేద తీరే దృశ్యం అద్భుతం. దేవదానవులు అమృతం కోరి క్షీరసాగర మథనం చేసినప్పుడు పాల సముద్రం నుంచి భయంకర కాలకూట విషం వెలుగొందుతుంది.

లోక కళ్యాణార్థం శివుడు ఆ విషాన్ని స్వీకరిస్తాడు. విషం గర్భంలోకి వెళ్ళకుండా పార్వతీదేవి తన పతి గొంతును నొక్కి పడుతుంది. దీనితో గొంతు భాగం నీలి రంగులోకి మారి శివుడు నీలకంఠుడు అవుతాడు. విషప్రభావానికి లోనైన శివుడు భరించలేని తాపంతో పార్వతీదేవి ఒడిలో సేదతీరుతాడు.

అలా సేదతీరిన క్షేత్రమే పల్లి కొండేశ్వర క్షేత్రమని భక్తుల విశ్వాసం. శివుడు 64 రూపాలలో ఒక్కటైన దక్షిణామూర్తి వృషభ వాహనంపై వామ భాగంలో గౌరీసమేతుడై దాంపత్య దక్షిణామూర్తిగా దర్శన భాగ్యం కలిగిస్తున్నారు.

లింగరూపం 
మాములుగా ఏ శైవ క్షేత్రానికి వెళ్ళినా మహాశివుడు లింగరూపంలోనే దర్శనమిస్తూ ఉంటాడు. చాలా అరుదైన క్షేత్రాల్లో మాత్రమే స్వామి విగ్రహ రూపంలో కనిపిస్తాడు. అటువంటి సదా శివుడు, శ్రీ మహావిష్ణువు మాదిరిగా శయన భంగిమలో కనిపించే క్షేత్రం ఒకటి ఉన్నది. అదే సురటు పల్లి. రాముడు ప్రతిష్టించిన లింగం కావటంతో రామలింగేశ్వరునిగా ప్రసిద్ధిచెందింది. సమస్త భూమండలంలో ఏకైక క్షేత్రంగా చిత్తూరు జిల్లా నాగలా పురం మండమలో విలసిల్లుతుంది. ఈ క్షేత్రానికి ఈ పేరు రావడం వెనుక ఓ ఆసక్తికరమైన కథనం ఉన్నది.

పూర్వం అమృతం కోసం దేవదానవులు క్షీర సాగర మధనం చేసినప్పుడు హాలాహలం పుట్టింది. లోకాలను రక్షించుకోవడం కోసం పరమశివుడు ఆ కాలకూట విషాన్ని మింగేశాడు. ఆ విష ప్రభావం కారణంగా తూలిన అయన, కొంతసేపు అమ్మవారి ఒడిలో సేదదీరాడు. ఆ సమయంలో దేవలంతా అక్కడికి చేరుకున్నారు. సురులంతా దిగివచ్చిన కారణంగా ఆ ప్రాంతాన్ని సురుల పల్లి అనే పేరు వచ్చింది. కాల క్రమంలో అది కాస్త సురటు పల్లిగా మారింది. ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులకి, శయన భంగిమలో గల శివుడిని దర్శించుకోవడం ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలిగిస్తుంది.

గురువారం దాంపత్యసేవకు భక్తులు బారులు తీరుతుంటారు. ఏడు వారాలపాటు నిమ్మచెక్కలో ఆవు నెయ్యిని పోసి దీపారాధన చేస్తే అన్ని సమస్యలు తొలిగి సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో జీవిస్తారని ఇక్కడకు వచ్చే భక్తుల విశ్వాసం.

ఎలా వెళ్ళాలి? 
తిరుపతి నుండి 73కి.మీ చెన్నై వైపుగా, చెన్నై నుండి 68 కి.మీ తిరుపతి వైపుగా ప్రయాణిస్తే చెన్నై-తిరుపతి జాతీయ రహదారిని ఆనుకుని వున్న ఈ ఆలయాన్ని చేరుకోవచ్చును. తిరుపతి నుండి సత్యవేడు వెళ్ళే ఎ పి ఎస్ ఆర్ టి సి బస్సులో ప్రయాణం చేసి ఈ ఆలయాన్ని చేరవచ్చును.

                

pallikondeswara temple surutapalli timings, surutapalli temple timings, surutapalli sivan temple history in tamil, surutapalli shiva temple images, surutapalli to tirupati, suruttapalli sivan temple timings, chittoor to surutapalli distance, surutapalli sivan images, palli kondeswara temple history, pallikondeswara temple, sri pallikondeswara temple, 

1 Comments

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS