మహానందీశ్వరుడు :
మహానంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లా, మహానంది మండలం లోని గ్రామం. సాక్షాత్తు పరమేశ్వరుడే ఆవు రూపంలో వెలిసిన క్షేత్రం మహానంది. నల్లమల పర్వతాల అడవుల్లో వెలసిన ఈ పుణ్యక్షేత్రంలో... పరమశివుడు స్వయంభువుగా గోవు(ఆవు) ఆపద ముద్రరూపంలో వెలిశాడు! ఇది ప్రముఖ శైవ క్షేత్రం.ఇది నంద్యాలకు 14 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్దినాటిది. ఇచ్చట గల శివలింగము ఎత్తుగా కాక కొంచెము తప్పటగ వుంటుంది. పుట్టలో గల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కుట వలన లింగము కొంచెము అణిగివుంటుంది. ఆవు గిట్ట గుర్తు లింగముపై వుంటుంది. ఇచ్చట శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకత. ఈ పుష్కరిణిలు విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క పనితనాన్ని తెలియచేస్తుంది.
ప్రధాన ఆలయానికి ఆలయ ముఖ ద్వారం గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణి లోనికి స్వచ్ఛమైన నీరు సర్వ వేళలా గోముఖ శిల న్నుండి ధారావాహకంగా వస్తుంటుంది. ప్రధాన ఆలయంలోని లింగం క్రింద భూమిలో ఐదు నీటి ఊటలు ఉన్నాయి. లింగము క్రింద నుండి నీరు ఊరుతూ వుంటుంది. ఆ నీరు పుష్కరిణిలోనే బయటకు కనిపిస్తుంది. ఈ నీరు ఎంత స్వచ్ఛంగా వుంటుందంటే నీటిపై కదలిక లేకుంటే నీరున్నట్టే తెలియదు. ఇక్కడి శివలింగం కింది నుంచి ఏడాది పొడవునా ఒకేస్థాయిలో స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న నీటి ప్రవాహం కొనసాగుతుంటుంది. వేసవిలో చల్లగా.. శీతాకాలంలో వెచ్చగా, వానాకాలంలోనూ మలినాల్లేకుండా తేటగా.. సూది సైతం స్పష్టంగా కనబడేస్థాయి స్వచ్ఛతతో ఉండటం ఈ నీటి ప్రత్యేక లక్షణం! ఐదున్నర అడుగులు లోతున్నా క్రిందనున్న రూపాయి బిళ్ల చాల స్పష్టంగా కనబడుతుంది. ఆలయ ఆవరణంలో కొన్ని బావులున్నాయి. అన్నింటిలోను ఇలాంటి నీరే ఉంది. ఈ నీటిని తీర్ధంగా భక్తులు తీసుకెళతారు. .ఇచ్చట బ్రహ్మ, విష్ణు, రుద్ర గుండాలు (పుష్కరుణులు) ఉన్నాయి. మహాశివరాత్రి పుణ్యదినమున లింగోధ్బవసమయమున అభిషేకము, కళ్యాణోత్సవము, రథోత్సవములు జరుగుతాయి. కోదండరామాలయం, కామేశ్వరీదేవి ఆలయం ఇతర దర్శనీయ స్థలాలు. మహానందికి 18 కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది నంది ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి నవ నందులని పేరు.ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది. అదేమంటే, గర్భాలయానికి ప్రక్కన ఒక శిలా మండపం ఉంది. అది నవీన కాలంలో చెక్కిన శిల్పాలు. ఆ శిలా స్థంబాలపై ఆ శిల్పి తల్లి తండ్రుల శిల్పాలు చెక్కి తల్లి దండ్రులపై తనకున్న భక్తిని చాటుకున్నాడు.
స్థలపురాణం :
పూర్వీకులు తెలిపిని కథానుసారం.. ఒక రుషి నల్లమల కొండల్లో చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకొని కుటుంబంతో జీవించేవాడు. అతడు శిలాభక్షకుడై ఎల్లప్పుడు తపోధ్యానంలో నిమగ్నమై ఉండేవాడు. ఆ మేరకు ఆయన్ను అంతా శిలాదుడని(శిలాద మహర్షి) పిలిచేవారు. భార్య తమకు దైవప్రసాదంగా ఒక కుమారుడు ఉంటే బాగుంటుందని ఆకాంక్షించగా.. ఆమె కోరికను తీర్చేందుకు శిలాదుడు ఆ సర్వేశ్వరుడిని గురించిన అత్యంత నిష్టతో తపస్సు ప్రారంభించాడు. కొన్నాళ్లకు అతని భక్తికి మెచ్చిన మహేశ్వరుడు అతని చుట్టూ పుట్టగా వృద్ధి చెందాడు. ఇంకొన్నాళ్ల ఘోర తపస్సు అనంతరం శివుడు ప్రత్యక్షమై... కావల్సిన వరాలు కోరుకొమ్మన్నాడు. దేవాధిదేవుడ్ని చూసిన పారవశ్యంలో శిలాద మహర్షి భార్య కోరిన కోరిక మరిచిపోయాడు! మహాదేవా.. నీ దర్శన భాగ్యం లభించింది. ఇంతకన్నా నాకు ఇంకేమి కావాలి? నిరంతరం నన్ను అనుగ్రహించు తండ్రీ.. అని వేడుకున్నాడు. అయితే దయాళువైన పరమశివుడు మహర్షి మరిచిన భార్య ఆకాంక్షనూ గుర్తుంచుకుని.. మీ దంపతుల కోరిక సిద్ధించుగాక అని దీవించి వెళ్లిపోయాడు. ఆమేరకు పుట్ట నుంచి ఒక బాలుడు జన్మించాడు. శిలాదుడు వెంటనే భార్యను పిలిచి ఇదిగో నీవు కోరిన ఈశ్వర వరప్రసాది... మహేశ్వరుడు అనుగ్రహించి ప్రసాదించిన మన కుమారుడు.. అంటూ ఆ బాలుడిని అప్పగించాడు. వారు ఆ బిడ్డకు ‘ మహానందుడు’ అనే పేరు పెట్టారు. అనంతరం మహానందుడు ఉపనయనం అయ్యాక గురువుల దగ్గర అన్ని విద్యలు నేర్చాడు. తల్లిదండ్రుల అనుమతితో శివుని గురించి తపస్సు చేశాడు. అతని కఠోర దీక్షకు మెచ్చిన పరమశివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమై వత్సా.. వరం కోరుకో.. అనగా.. మహానందుడు... దేవాధిదేవా.. నన్ను నీ వాహనంగా చేసుకో... అని కోరాడు. అలాగే అని వరమిచ్చిన శివుడు ‘మహానందా.. నీవు జన్మించిన ఈ పుట్ట నుంచి వచ్చే నీటి ధార కొలనుగా మారి అహర్నిశలూ ప్రవహిస్తూ, సదా పవిత్ర వాహినిగా నిలుస్తుంది. చుట్టూ 80 కి.మీ.ల దూరం మహానంది మండలంగా ఖ్యాతి చెంది పరమ పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతుంది. అని వరమిచ్చాడు. తాను ఇక్కడి నవనందుల్లో లింగరూపుడిగా ఉంటానని వరం అనుగ్రహించాడు.
మరియొక కధ: ఈ క్షేత్రంలో ఒకప్పుడు ఒక పుట్ట ఉండేది. ఆపుట్టమీద రోజూ ఒకకపిలగోవు వచ్చి పాలు వర్షిస్తూ ఉండేది. పశువులకాపరి ఒక ఇది చూచాడు. పుట్టక్రింద బాలకృష్ణుడు నోరుతెరచి ఈపాలు త్రాగుతుండేవాడు. ఈదృశ్యం ఆగొల్లవాడు పెద్దనందునితో చెప్పాడు. నందుడువచ్చి చూచాడు. ఆదృశ్యం కంటబడింది. తన్మయుడయ్యాడు. గోవు భయపడింది. అదు పుట్టను తొక్కి పక్కకు పోయింది. ఆ గిట్టలు ఆపుట్టమీద ముద్రితమైనవి. ఇవాల్టికు కూడా అవి మనం చూడవచ్చును. నందుడు తను చేసిన అపరాధానికి విచారించాడు. ఇష్టదైవమైన నందిని పూజించాడు. ఆవు తొక్కిన పుట్ట శిలాలింగం అయ్యేటట్లు నంది ప్రసాదించింది. గర్భాలయం ఎదుట పెద్దనంది ఉన్నది.దాని ఎదుట చక్కటి పుష్కరిణి. ఈ రెండిటివల్ల ఈ క్షేత్రానికి మహానంది తీర్ధము అనే పేరు వచ్చింది. దేవాలయం ప్రాకారం బయట విష్ణుకుండం, బ్రహ్మకుండం అనే రెండు కుండాలు ఉన్నాయి. త్రిమూర్తిత్త్వానికి గుడిలో స్వామివారు అతీతులు. లింగం ఏర్పడిన వంకలు ప్రకృతి పురుష తత్త్వాలను తెలుపుతాయి. భైరవజోస్యుల మహానందయ్య గారి భార్య ఈ ఆలయ నిర్మాణానికి కారకురాలు. ఇక్కడ ఉన్న కామేశ్వరీదేవి ఎదుట ఉన్న శ్రీచక్రం శంకరాచార్యుల ప్రతిష్ఠ.
నవనందులు :
కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టు కొలువై ఉన్న నవనందుల దర్శనం జన్న జన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్ని పటాపంచలు అవుతాయని పెద్దల నానుడి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు ఇట్టే తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. నంద్యాల పట్టణంలో ప్రమధ నంది, ఆంజనేయస్వామి ఆలయంలో అంతర్భాగంగా నాగనంది, సోమనంది ఉన్నాయి. అలాగే బండి ఆత్మకూరు మండలం పరిధి సోమయాజులపల్లె సమీపంలో శివనంది, నల్లమల అడవిలో కృష్ణ నంది(విష్ణునంది), మహానంది క్షేత్రం ఆవరణలో మహానందితో పాటు వినాయకనంది, గరుడనంది, సుమారు 10 కి.మీ.ల దూరంలోని తమడపల్లెకి 2 కి.మీ.ల దూరంలో సూర్యనంది క్షేత్రం ఉన్నాయి. ఈ నందులన్నింటీని ఒకే రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలోపు భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం
మహానందిలో దర్శనవేళలు :
ప్రతిరోజు వేకువజామున ఆలయశుద్ధి. 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు బిందెసేవ, 5.30 గంటల నుంచి సుప్రభాతసేవ, 6 గంటల నుంచి 6.30 గంటల వరకు అష్టవిధ మహామంగళహారతుల పూజలు (ఈ సమయంలోనే భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం) ఉంటాయి. ఇదే రీతిలో సాయంత్రం 6 గంటల నుంచి 6.30 గంటల వరకు పైవిధంగా తెలిపినట్లుగానే అష్టవిధ మహామంగళహారతులు, నిజరూప దర్శనం ఉంటుంది. అంతేకాక భక్తులకు ప్రతిరోజు ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దైవదర్శనం ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో మాత్రం కేవలం 15 నిమిషాలు నివేదన సమయంలో దర్శనం నిలుపుదల చేస్తారు. ఆ తర్వాత దర్శనం మామూలే.
కోనేరులో పుణ్యస్నానాల సమయాలు :
రుద్రగుండం పుష్కరిణిలో ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మళ్లీ 6.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పుణ్యస్నానాలకు అనుమతి ఉంటుంది. వీటి మధ్యకాలంలో బయట ఉన్న రెండు చిన్న కోనేర్లలో నిరంతరం పుణ్యస్నానాలు చేయవచ్చు.
వసతి :
మహానంది లో అనేక గెస్ట్ హౌస్ లు, హోటళ్ళు కలవు. గుడికి సమీపంలో శంభుప్రియ గెస్ట్ హౌస్, బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రం, హరితా హోటల్, హోటల్ బాలాజీ, న్యూ ఉడుపి హోటల్, శ్రీ కృష్ణ డీలక్స్ ఏసీ, నాన్ ఏసీ మరియు శివప్రియ లాడ్జ్ మొదలగునవి యాత్రికులకు వసతి సదుపాయాలను అందిస్తున్నాయి.
మహానంది ఎలా చేరుకోవాలి ?
మహానంది కి సమీపాన కడప ఎయిర్ పోర్ట్, నంద్యాల రైల్వే స్టేషన్ కలదు. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, గుంటూరు తదితర ప్రాంతాల నుండి నంద్యాల కు బస్సులు కలవు. నంద్యాల నుండి మహానందికి బస్సు సౌకర్యము ఉంది. గిద్దలూరు-నంద్యాల మార్గంలో ఉన్న గాజులపల్లె, ఇక్కడికి సమీప రైల్వే స్టేషను.
Note : చాలా పుణ్యక్షేత్రాలకు కర్నూల్ airport సమీపంగా ఉంటుంది.

మీకు ఏదైనా అదనంగా సమాచారం కావాలంటే మీరు హిందూ టెంపుల్స్ గైడ్ టీమ్ సభ్యులకు కాల్ చేసి తెలుసుకోవచ్చు.
గురుప్రసాద్ గారు : 9959520540
-
yaganti temple history in telugu, mahanandi temple timings, yaganti temple matter in telugu, yaganti matter in telugu,mahanandi temple seva booking, mahanandi temple koneru, mahanandi temple to srisailam, yaganti temple wikipedia in telugu, mahanandiswara swamy temple history telugu, mahanandi, mahanandi temple history, mahanandi images, mahanandi temple accommodation, mahanandi temple timings.