సిక్కిం భారతదేశపు హిమాలయ పర్వతశ్రేణులలో ఒదిగి ఉన్న ఒక రాష్ట్రము. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం. వైశాల్యంలో రెండవ చిన్న రాష్ట్రం (అన్నింటికంటే చిన్నది గోవా). 1975 వరకు సిక్కిం "చోగ్యాల్" రాజ వంశీకుల పాలనలో ఉండే ఒక స్వతంత్ర దేశము. 1975లో ప్రజాతీర్పు (రిఫరెండం) ను అనుసరించి సిక్కిం భారతదేశంలో 22వ రాష్ట్రంగా విలీనమైంది. సిక్కిం అధికారిక భాష నేపాలీ. రాజధాని గాంగ్టక్ అన్నింటికంటే పెద్ద పట్టణం. హిందూమతము, వజ్రయాన బౌద్ధం ప్రధానమైన మతాలు. ఉత్తర ప్రాంతం టుండ్రాలలాగా ఉంటుంది ప్రపంచంలో 3వ ఎత్తైన శిఖరంగల కాంచనగంగ పర్వతం సిక్కిం, నేపాల్లలో విస్తరించి ఉంది. ఎంతో ప్రకృతి సౌందర్యాలను ఒనగట్టుకొన్నందువల్లా, ప్రశాంత రాజకీయ స్థిరత్వం వల్లా సిక్కిం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.
సిక్కిం ప్రసిద్ధ దేవాలయాలు
కాంచనగంగ
గ్యాంగ్ టాక్ - త్సోoగో చాంగు సరస్సు
గ్యాంగ్ టాక్ - హనుమాన్ టోక్
సిక్కిం - సిద్ధేశ్వర దేవాలయం
కిరాతేశ్వర్ మహాదేవ్ ఆలయం
గ్యాంగ్ టాక్ - టాకూర్బారి దేవాలయం
గ్యాంగ్ టాక్ - రుమ్ టెక్ బౌధ్ధరామం
అసంగత్సంగ్ - శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయం
బాబా హర్భజన్ సింగ్ ఆలయం
FAMOUS TEMPLES