జార్ఖండ్ లేదా ఝార్ఖండ్ భారతదేశంలో ఒక రాష్ట్రము. 2000 నవంబరు 15న బీహార్ రాష్ట్రంనుండి దక్షిణ ప్రాంతాన్ని వేరుచేసి జార్ఖండ్ ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటు చేశారు . చిరకాలం శాంతియుతంగా, ప్రజాస్వామికంగా జరిగిన పోరాటానికి ఫలితంగా రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రంలో అధికభాగం ఛోటానాగపూరు పీఠభూమిలో ఉంది. కోయల్, దామోదర్, బ్రహ్మణి, ఖర్కాయ్, సువర్ణ రేఖ వంటి నదులకు ఇది జన్మస్థానం. రాష్ట్రంలో చాలా భాగం అటవీమయం. పులులు, ఏనుగులకు కొన్ని చోట్లు ఆవాసం.
జార్ఖండ్ ప్రసిద్ధ దేవాలయాలు
బుండుకు - సూర్య దేవాలయం
రాంచి - జగన్నాథపూర్ దేవాలయం
రాంచి - దేవేరి ఆలయం
రాంచి - అంగ్రబడి దేవాలయం
రాంచి - ఛిన్నమస్తా ఆలయం
ధనాబాద్ - శక్తి మందిరం
డియోఘఢ్ - తపోవన్
డియోఘఢ్ - త్రికూట పర్వతం
జార్ఖండ్ - ద్వారపాల్ రాతిగుహలు
FAMOUS TEMPLES