A History Of The Red Fort - Red Fort - Delhi | Red Fort Photos - errakota story

ఎఱ్ఱకోట :
'ఎర్ర కోట ఢిల్లీలో కల ఒక కోట. దీనిని ప్రభుత్వ భవనముగా వాడుచున్నారు. ఇక్కడ జాతీయ పండుగలు, ఉత్సవాలు జరుపుతారు. భారతదేశము తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించినపుడు మొదటిసారిగా జాతీయ పతాకాన్ని దీనిపైనే ఎగురవేశారు. దీని అసలు పేరు ఖిలా ఎ ముబారక్. దీనిలో రాజకుటుంబం నివసించేది. ఇది యమునా నది తీరాన ఉంది.
ముఖ ద్వారము

భారతదేశ అద్భుత కట్టడాల్లో ఒకటి... ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు... మన ఏడు వింతల్లో ఒకటి... స్వాతంత్య్ర సంబరాలకు చిహ్నం... అదే ఢిల్లీలోని ఎర్రకోట!


'ఇలలో స్వర్గం అంటూ ఉంటే అది ఇదే... ఇదే...' అనే అర్థాన్నిచ్చే వాక్యాలు ఎర్రకోటలోని సభాస్థలి గోడలపై బంగారు అక్షరాలతో మెరుస్తూ కనిపిస్తాయి. పర్షియా కవి అమీర్‌ ఖుస్రో రాసిన కవితలోని ఈ పంక్తులను అక్కడ చెక్కించింది మొగల్‌ చక్రవర్తి షాజహాన్‌. ఎర్రకోట నమూనాను రూపొందించి, దగ్గరుండి కట్టించింది కూడా షాజహానే. ఎర్ర చలువరాతితో అద్భుతంగా నిర్మించిన ఈ కోట వెనుక 360 ఏళ్ల చరిత్ర ఉంది.
ముఖ ద్వారము-ఇంకో దృశ్యం
 
దీని నిర్మాణాన్ని 1638లో మొదలు పెడితే 1648లో పూర్తయింది. యమునా నది ఒడ్డున, మొత్తం 120 ఎకరాల సువిశాల స్థలంలో ఈ కోటను పర్షియా నుంచి రప్పించిన నిపుణులతో కట్టించారు. యాభై అడుగుల పొడవు, 24 అడుగుల వెడల్పుతో ఉండే ఈ సభాస్థలి పైకప్పు, గోడలను వెండి బంగారాలతో తాపడం చేశారు. ఇందులోనే ప్రపంచ ప్రఖ్యాతమైన నెమలి సింహాసనం ఉండేది. కోటలోని ఉద్యానవనాలు, పాలరాయి మండపాలు, నీటిని చిమ్మే ఫౌంటెన్లు అద్భుతంగా ఉంటాయి. ఎన్నో చారిత్రక ఘట్టాలకు ఈ కోట మౌన సాక్షి.
దీవాన్ ఎ ఖాస్ లోభాగం


దీని ప్రహరీగోడ రెండు కిలోమీటర్ల పొడవుగా, దాదాపు 90 అడుగులకు పైగా ఎత్తుతో ఉంటుంది. ఇందులో ముంతాజ్‌ మహల్‌ మ్యూజియం, మోతీమజీద్‌, రంగ్‌మహల్‌ ఎంతో ఆకట్టుకుంటాయి. 'బ్లడ్‌ పెయింటింగ్స్‌' మ్యూజియం, పురావస్తు మ్యూజియం, యుద్ధ స్మారక ప్రదర్శన శాలలు కూడా ఎర్రకోటలో ఉన్నాయి.
ఆర్చీలు, దీవాన్ ఎ ఆమ్

యమున నది ఒడ్డున దాదాపు 120 ఏకరాల విస్తీర్ణంలో దీన్ని అద్భుత కళాఖండంగా తీర్చిదిద్దారు. ఈ మహాసౌధానికి సంబంధించిన నమూనాను రూపొందించి, దగ్గరుండి కట్టించిన ఘనత షాజహన్‌కే దక్కుతుంది. కాగా, దీని శిల్పి మాత్రం హమీద్. 2.41కి.మీల విస్తీర్ణంలో రెండు ప్రధాన ద్వారాల(గేట్స్)తో నిర్మించారు. అవి, లాహోర్ గేట్, ఢిల్లీ గేట్.


ఇక ఎర్రకోట ప్రహరీగోడ కూడా భారీగానే నిర్మితమైంది. 2కి.మీల పొడవు, 90 అడుగుల ఎత్తుతో దీన్ని నిర్మించడం జరిగింది. కోటలో ఎన్నో అద్భుత కట్టడాలు ఉన్నాయి.
మోతీ మస్జిద్

వీటిలో ముంతాజ్ మహల్, రంగ్ మహల్, మోతీ మజీద్, దివానీ ఖాస్, దివాన్-ఇ-ఆమ్ ముఖ్యమైనవి. దివాన్-ఇ-ఆమ్‌లో రాజు ప్రజల వినతులు వినేవారట. ఇక్కడ పర్షియన్ నిపుణుల చేత వజ్రాలు, బంగారం పొదిగిన నెమలి సింహాసనంపై కూర్చుని రాజు ప్రజల సమస్యలు పరిష్కరించేవారు. దీని లోపలి గోడలపై బంగారం, వెండితో అద్భుతమైన పెయింటింగ్స్‌తో పాటు కొన్ని శ్లోకాలు రాశారు.
దీవాన్ ఎ ఖాస్ (ఎడమ) & ఖాస్ మహల్ (కుడి) 
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశంలో మొదట జాతీయ జెండాను ప్రధానమంత్రి ఇక్కడే ఆవిష్కరిస్తారు.

red fort history, red fort agra, red fort delhi timings, essay on red fort, red fort photo gallery,lal kila kisne banaya, red fort information, 5 lines on red fort in english, errakota history in telugu, red fort history in telugu, red fort information.

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS