కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం తిరుమల. తిరుమల ఒక్కసారైనా దర్శించాలని అందరు కోరుకుంటారు .. ఒక్కసారి వెళ్ళినవారు మరల మరల వెళ్లి దర్శించుకుంటూనే ఉంటారు... ఒంట్లో ఓపిక ఉండగానే పుణ్యక్షేత్రాలు దర్శించాలని నడక మార్గం లో వెళ్లే భక్తులకు అనిపిస్తుంది . నడవగలనో లేదో అనుకున్నాను స్వామి వారే నడిపించారని ఎందరో భక్తులు యాత్ర చేసి ఇంటికి వచ్చిన తరువాత స్వగతాలను చెప్పుకుంటారు.
మనం శ్రీవారి మెట్ల మార్గం ఏ విధంగా చేరుకోవాలి .. శ్రీవారి మెట్ల చరిత్ర ఏమిటి ? శ్రీవారి మెట్లకు అంత ప్రాముఖ్యత ఏ విధంగా వచ్చింది. చాలామందికి తెలియని విశేషాలు ఏమిటి ? శ్రీవారి మెట్లమార్గం ఏవిధముగా ఉంటుంది ? ఎలా చేరుకోవాలి ? టోకెన్స్ ఎక్కడిస్తారు ? లగేజి ఎక్కడ పెట్టాలో చిన్న చిన్న విషయాలను కూడా వదలకుండా వివరించబోతున్నాము .. ఆలస్యం చేయకుండా గోవిందా గోవిందా అంటూ మొదలు పెడతాం .
ముందుగా మనం ట్రైన్ లేదా బస్సు లో ఉదయాన్నే తిరుపతి లో దిగిన తరువాత కాస్త ఫ్రెష్ అయి నడక మొదలు పెట్టాలి అనుకుంటాం .. మీకు నా సలహా ఏమిటంటే తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా టీటీడీ వారు విష్ణు నివాసం నిర్మించారు .. ఈ వీడియో లో మీకు కనిపిస్తుంది అదే విష్ణు నివాసం .. అక్కడ మీరు ఫ్రెషప్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. మీకు లాకెర్ లు కూడా ఉచితంగా ఇస్తారు. మీరు ఎక్కువ సామాన్లు తెచ్చుకుని కొండపైకి వాటి అవసరం లేకపోతె లాకర్ తీస్కుని అందులో పెట్టుకోవచ్చు కాస్త బరువు తగ్గుతుంది కదా .. ఇక్కడే మీకు ఒకవిషయం చెప్పాలి .. శ్రీ వారి మెట్లు మార్గం లో నడక మొదలుపెట్టేముందే లగ్గేజి కౌంటర్ ఉంటుంది . మీరు అక్కడ మీ బ్యాగ్స్ ఇస్తే వారు కొండపైకి తీస్కుని వస్తారు. కాకపోతే వారు చేతి సంచులు లాంటివి తీసుకోరు .. ఇది గుర్తుపెట్టుకోండి.. మరొక విషయం మీరు టిఫిన్ కనుక చేసి ఉండకపోతే కొండ క్రిందనే టిఫిన్ చేసి నడక మొదలు పెట్టండి .. మెట్లమార్గం లో తినడానికి ఏమి ఉండవు.
తిరుమల చేరుకోవడానికి ప్రధానంగా మనకి రెండు నడక మార్గాలు ఉన్నాయి . ఒకటి అలిపిరి మార్గం , రెండు శ్రీవారి మెట్లమార్గం . అలిపిరి మార్గం చేరుకోవడానికి శ్రీవారి మెట్టు చేరుకోవడానికి ఉచిత బస్సు లు RTC బస్సు లు ఉంటాయి . అలిపిరి మార్గం తో పోల్చుకుంటే శ్రీవారి మెట్లమార్గం ద్వారా తిరుమల చేరుకోవడం సులువుగా ఉంటుంది. అలిపిరి మెట్లమార్గం లో 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. శ్రీవారి మెట్లమార్గం లో 1 నుంచి 2 గంటల సమయం పడుతుంది . అలిపిరి మెట్లమార్గం లో దారిపొడవునా చిన్న చిన్న షాప్ లు ఉంటాయి . శ్రీవారి మెట్ల మార్గం లో ఆలా షాప్ లు ఉండవు.
రైల్వే స్టేషన్ నుంచి శ్రీవారి మెట్టుకు వెళ్ళడానికి ఉచిత బస్సు లు , RTC బస్సు లు , ఆటో లు కూడా ఉన్నాయి. కపిలతీర్థం , శ్రీనివాసమంగాపురం దాటినా తరువాత శ్రీవారి మెట్టు వస్తుంది.
సుమారు 400 నుంచి 600 మెట్ల వరకు ఆగకుండా నడవండి .. పైగా ఈ మెట్లు ఎక్కడం సులువుగా ఉంటుంది ఎందుకంటే పెద్దపెద్ద మెట్లు మెట్లు ఉంటాయి.
శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్టు సుమారుగా 6 కిలోమీటర్లు ఉంటుంది. ఈ దారిగుండానే వేంకటేశ్వరుడు వివాహానంతరం ఆరు నెలలు కాలం అగస్త్యాశ్రమంలో గడిపి తరువాత తిరుమల చేరుకున్నాడని పురాణ కథ. నడిరేయి ఏ జామునో అలమేలు మంగను చేరడానికి దిగి వచ్చే స్వామి ఒక అడుగు ఈ "శ్రీవారి మెట్టు"పై వేసి రెండవ డుగు అలమేలు మంగాపురంలో వేస్తాడని ప్రతీతి. చంద్రగిరిని వేసవి విడిదిగా చేసుకొన్న విజయనగర చక్రవర్తులు శ్రీవారి మెట్టునుండ ఉన్న మెట్లదారిలో తిరుమలేశుని దర్శనం చేసుకొనేవారు. తన దేవేరులతో కలిసి కృష్ణ దేవరాయలు ఈ మార్గంలో అనేక పర్యాయాలు నడచి స్వామిని దర్శించుకొన్నాడు.
19వ శతాబ్ది తొలినాళ్ళకు చెందిన ఈస్టిండియాకంపెనీ ఉద్యోగి, యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఈ బాట గురించి తమ కాశీయాత్రాచరిత్ర గ్రంథంలో వ్రాశారు. 1830ల నాటికే శ్రీనివాసుని పాదం ఇక్కడ ఉండేది. పడమటి దేశస్థులు అక్కడ నుంచి ఎక్కుతారని ఆయన వ్రాశారు
శ్రీవారి మెట్టు నే నూరు మెట్ల దారి అంటారు. ఇది మొత్తం మెట్ల దారె. మధ్యలో ఎక్కడా మెట్లు లేకుండా వుండదు. దీనికి నూరు మెట్ల దారి అని పేరు. ఇందులో వున్నవి కేవలం నూరు మెట్లు మాత్రమే కాదు. 2 వేలకు పైగ మెట్లుంటాయి.
గతంలో శ్రీనివాస మంగాపురం వద్ద మంగాపురం అనె రైల్వే స్టేషను వుండేది. తిరుమలకు వెళ్లే యాత్రీకులందరు అక్కడే దిగి కళ్యాణ వేకటేశ్వరున్ని దర్శించుకొని కాలి నడకన నూరు మెట్ల ద్వార కొండ పైకి వెళ్లే వారు.

మీరు సామాన్లు కొండ క్రింద ఉండే లగేజి కౌంటర్ లో ఇచ్చేయండి . కాకపోతే ఇక్కడ సమస్య ఏమిటంటే సుమారు 2 గంటలు ఆలస్యంగా వస్తాయి , మీ లక్ కొద్దీ మీరు లగేజి ఇచ్చిన వెంటనే కొండపైకి వెళ్లే బస్సు వస్తే మీరు కొండపైకి వెళ్లే సమయానికి మీ లగేజి వస్తుంది .
మెట్లమార్గం నుంచి పైకి వెళ్ళేటప్పుడే దర్శనం టైం ఎప్పుడు అనేది మనకు ఇచ్చే దర్శనం టోకెన్ టికెట్ లో ఉంటుంది. దానిని బట్టి మీరు కొండపైన మీ ప్లాన్ లు చేస్కోవచ్చు.
మీరు మెట్లు ఎక్కడం పూర్తీ కాకాగానే లగేజి కౌంటర్ ఉంటుంది. అక్కడ మీ సామాన్లు తీస్కోండి .
మీరు మెట్లు ఎక్కడం పూర్తీ కాకాగానే లగేజి కౌంటర్ ఉంటుంది. అక్కడ మీ సామాన్లు తీస్కోండి .
మీకు రూమ్స్ కొండపైన CRO ఆఫీస్ దగ్గర ఇస్తారు . CRO ఆఫీస్ దగ్గర రూమ్స్ కోసం లైన్ లో నిలబడి ఉంటారు మీరు ఆ లైన్ లో నిలబడితే 90% మీకు రూమ్స్ దొరుకుతాయి .
CRO ఆఫీస్ దగ్గర పెద్ద స్క్రీన్ ఉన్న టీవీ కనిపిస్తుంది. ఆ స్క్రీన్ వెనుకాల ఇప్పుడు అంగప్రదక్షిణ టికెట్స్ ఇస్తున్నారు . మధ్యాహ్నం 2 గంటల నుంచి టికెట్స్ ఇవ్వడం మొదలుపెడుతున్నారు. ఆడవారికి మగవారికి కలిపి మొత్తం 700 టికెట్స్ ఇస్తారు . 10 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్స్ అవసరం ఉండదు. ఆధార్ కార్డు తప్పకుండ తీస్కుని వెళ్ళండి , అంగప్రదక్షిణ టికెట్ ఉంచితంగా ఇస్తారు కాకపోతే లడ్డు కొరకు 10/- తీసుకుంటారు. టికెట్స్ ఉన్నవారు ఆ రోజు రాత్రి 12 గంటలకు స్వామి వారి పుష్కరిణి లో స్నానం చేసి తడిబట్టలతో 1 గంటకు క్యూ లైన్ దగ్గరకు వెళ్ళాలి , ఎక్కడికి రావాలో మీకు ఇచ్చిన టికెట్ పై ఉంటుంది. రాత్రి 1 గంటకు క్యూ లైన్ నుంచి కంపార్ట్మెంట్ లో ఉంచి 3 గంటలకు గుడిలో కి తీస్కుని వెళ్లారు . ఒక ప్రక్కన సుప్రభాత సేవ జరుగుతుంటే మరో పక్కన మనం అంగప్రదక్షిణ చేస్తాము. జీన్ ప్యాంట్ తో చేయవచ్చు . తోలు బెల్ట్ ని అనుమతించరు. అంగప్రదక్షిణ కు వెళ్దాం అనుకునే వారు రాత్రి పూట తక్కువ ఆహరం తీస్కోండి. అంగప్రదక్షిణ అయినతరువాత మనకు దర్శనం ఉంటుంది.
మరికొన్ని విశేషాలు మరో పోస్ట్ లో చెప్పుకుందాం .. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి .
Tags
Tirumala