పంచారామాలలో ఒకటయిన ఈ శ్రీ కుమారభీమారామ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలో ( ప్రస్తుతం కాకినాడ జిల్లా ) సామర్లకోటకు కిలోమీటరు దూరంలో ఉంటుంది. సామర్లకోట లోనే రైల్వే స్టేషన్ ఉండటం వలన దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు చాల సులువుగా ఇక్కడకు చేరుకోవచ్చు. సామర్లకోట నుంచి 10వ శక్తి పీఠ క్షేత్రమైన పిఠాపురం 13 కిమీ దూరం లో ఉంది, పిఠాపురం వెళ్ళడానికి బస్సు లు ఆటో లు ఉంటాయి, మరియు సామర్లకోట దర్శించి కాకినాడ మీదుగా ద్రాక్షారామం వెళ్ళవచ్చు.
సామర్లకోట లో ఉండటానికి హోటల్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు ఇక్కడ ఆలయంలోని ఈశ్వరుడు కుమార భీమేశ్వరుడుగా ప్రసిద్ధిచెందగా, అమ్మవారు బాలాత్రిపురసుందరిగా పూజలు అందుకుంటోంది. ఇక్కడస్వామి వారు లింగరూపంలో దర్శనం ఇస్తారు.
ఇక్కడి శివలింగం సున్నపు రాయిచే నిర్మితమై తెల్లని రంగులో.చూడముచ్చటగా ఉండి భక్తులను ఆకర్షిస్తుంది.
Temple Timings
6.00 am to 12.00 pm
4.00 pm to 8.00 pm
విశాలమైన ప్రాకారాలతో, నాలుగు ద్వారాలతో, కోనేటి జలాలతో, చాళుక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించాగానే మనసుకి ఎంతో ఆహ్లాదం, ఆనందం కలుగుతాయి.
దేవాలయం లోపలి ప్రాకారంలో వినాయకుడు, కాల భైరవుడు, వీరభద్రుడు, మహాకాళి, శనేశ్వరుడు, నవగ్రహాలు కొలువుదీరు కనిపిస్తాయి. ప్రధాన ద్వారానికి ఎడమవైపున బాలాత్రిపురసుందరి అమ్మవారు కుడి వైపున ఊయల మంటపం కనిపిస్తాయి. గర్భగుడిలో రెండో అంతస్తు వరకూ పెరిగిన 14 అడుగుల భీమేశ్వరుడి శివలింగం నయనానందాన్ని కలిగిస్తుంటుంది.
నిర్మాణ సమయంలోనే ఈ శివలింగం అంతకంతకు పెరిగిపోతుండటం గమనించి శిల్పులు శివలింగం పైభాగాన చీల కొట్టారనే కథ స్థానికంగా వినిపిస్తూ వుంటుంది.
ఈ మందిరం నిర్మాణం క్రీ.శ 892 లో ప్రారంభమై సుమారు క్రీ.శ. 922 వరకు సాగింది. ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్ప కళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంది. 1340-1466 మధ్యకాలంలో రాజ్యం చేసిన కాకతీయులు ఈ మందిరాన్ని కొంత పునర్మిర్మించారు.
ఇక్కడ కాకతీయుల నాటి శిల్ప కళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యులనాటి శిల్ప కళను తేలికగా గుర్తించవచ్చును. 1147 - 1494 మధ్యకాలంలో ఆలయానికి సమర్పించిన విరాళాల గురించిన శాసనాలున్నాయి.
గుడిలో స్వామి వారికి ఎదురుగావున్న మండపంలో ఆరు అడుగుల ఎత్తులో నంది విగ్రహం ఏక శిలచే చెక్కబడివున్నది.ఆలయంలోని మండపం నూరు రాతిస్తంభాలంకలిగి ఉంది.రెండో అంతస్తువరకు దాదాపు 14 అడుగులున్న శివ లింగం. శివలింగఆధారం క్రింది గదిలో వుండగా, లింగ అగ్రభాగం పై కప్పును చీల్చుకొని మొదటి అంతస్తు వరకుండును. భక్తులు పూజలు, అర్చనలు ఇక్కడేస్వామి వారికీ పూజలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
మొదట మొదటి అంతస్తులో వున్న లింగ దర్శనం తరువాత క్రిందవున్న లింగ పాద భాగాన్ని దర్శించుకొనెదరు. మొదటి అంతస్తుకు చేరుటకు ఇరువైపులనుండి మెట్లు వున్నవి.
ఈ దేవాలయ నిర్మాణం పంచారామాలలో ఒక్కటైన ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని పోలివుండును.చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. ఈయనే ద్రాక్షరామ దేవాలయాన్నీ నిర్మించింది. అందుకె ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటేరకంగా మరియు నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుంది.
అక్కడిలానే ఈ దేవాలయం చుట్టు రెండు ఎత్తయిన రెండు ప్రాకారాలను కలిగివున్నది.ప్రాకారాపు గోడలు ఇసుక రాయిచే కట్టబడినవి. వెలుపలి ప్రాకారపు గోడకు నాలుగుదిక్కులలో నాలుగు ప్రవేశ మార్గాలున్నాయి.
ప్రదాన ప్రవేశ ద్వారాన్ని సూర్య ద్వారం అంటారు.గుడిలోని స్థంబాల మీద అప్సర బొమ్మలు చెక్కబడివున్నవి. చాళుక్య వంశానికి చెందిన విక్రమాదిత్యుని పుత్రుడు చాళుక్య భీమేశ్వర కుమరరామ పేరుమీదుగా ఇక్కడి శివున్ని కుమరరామ అని వ్యవహారంలోకి వచ్చినట్లు తెలుస్తున్నది.
ఇక చైత్ర, వైశాఖ మాసాల్లో సూర్య కిరణాలు ఉదయం వేళలో స్వామివారి పాదాలను సాయంత్రం సమయంలో అమ్మవారి పాదాలను తాకడం ఇక్కడి విశేషంగా చెప్పుకుంటారు.స్వామికి బాలాత్రిపురసుందరికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు. అయిదు రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నందివాహనంపై అమ్మవారిని సింహవాహనంపై ఊరేగిస్తారు.
ఈ కల్యాణాన్ని తిలకించడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలంతా వస్తుంటారు. ఇక కార్తీక మాసంలో కూడా ఇక్కడ పూజలు . అభిషేకాలు, ఉత్సవాలు విరివిగా జరుగుతూ వుంటాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ భక్తులు పునీతులవుతుంటారు.
మీకు ఏమైనా అదనంగా సామర్లకోట గురించి సమాచారం కావాలంటే మన హిందూ టెంపుల్స్ గైడ్ సభ్యులకు కాల్ చేసి అడగవచ్చు :
కోటి గారు : 9849313540
ఇవి చదివారా ? |
---|
సోమారామము |
శ్రీ కుమారభీమారామము |
క్షీరారామం |
అమరారామం |
ద్రాక్షారామం |
Related Postings:
Near By famous Temples:
1.Someswara Swamy Temple (Somaramam)
2.Bheemeswara Swamy Temple (Draksharamam)
3.Pithapuram Padagaya
4.Pithapuram Puruhutika Ammavaru
5.Annavaram Satyanarana Swamy
6.Tholi Tirupati
Transport
By Road:
Buses Are Avaialable To Samarlakot From The major Cities Like kakinada,Hyderabad,Vijayawada,Rajahmundry,Tirupati,And Visakhapatnam
By Train:
Most Of The Trains passing Between Vijayawada - vishakapatnam line will stop all trains at Samarlakot Railway station.
By Air:
The Nearest Airport To Samarlakot is Situated At Visakhapatnam.Samarlakot is at 3 hrs Distance From Visakhapnam.
The Nearest Airport at west side of Samarlakot is Situated at Rajahmundry. Samarlakot is at a 1hrs distance frome Rajahmundry
Contact Details Of Sri Kumararama Bhimeswara Swamy Temple
Samarlakot
East Godavari District
A.P- 533440
Office : 08897205858
keywords:
Sri Kumararama Bhimeswara Temple,Sri Kumararama Bhimeswara Temple in telugu History,
Sri Kumararama Bhimeswara Temple story in telugu, Kumararamam ,Sri Kumararamam Bhimeswara, Temple samarlakota ,Samarlakot Rooms,samarlakot Online Rooms Booking,Sri Kumararamam Bhimeswara Swamy Pooja And Temple Timings,Sri Kumararamam Bhimeswara Swamy Accommondation,Sri Kumararamam Bhimeswara Swamy,Sri Kumararamam Bhimeswara Swamy Temple History,Bhimeswara Swamy temple ,Pancharalu,Pancharama Kshetralu,Pancharamas,Pancharama kshetras,
Tags
1000 years old
Andhrapradesh
East Godavari
Famous Temples
Kakinada District
Pancharama Kshetras
Samarlakot
Siva Temples
Temples Guide Team