Chilkur Balaji Temple History In Telugu | Visa Balaji Temple

చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి విననివాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు.కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా వెలుగొందుతున్న చిలుకూరు బాలాజీ దేవాలయం భక్తులపాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. 
Temple Timings
5.00 am to 7.30 pm
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మూడు చోట్ల ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. 
తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడు, ద్వారకా తిరుమల మరొకటి తెలంగాణలోని చిలుకూరుగా ప్రతీతి. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ ఆలయానికి 500 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలదు.
రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు నిత్యం పెద్దసంఖ్యలో బాలాజీని దర్శించుకుంటారు. హైదరాబాదు నగర శివార్లలో ఉన్నఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ అనేక సందర్భాల్లో కిక్కిరిసిన జనంతో తిరుమలను తలపిస్తుంది.తెలంగాణ తిరుపతిగాఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడి స్వామివారిని వీసాల బాలాజీ అని కూడా పిలుస్తుంటారు. 
చిలుకూరు దేవాలయం హైదరాబాద్‌ నుంచి 25 కి.మీ.ల దూరంలో వికారాబాద్‌ వెళ్లే మార్గంలో ఉంది. చిలుకూరు బాలాజీ ఆలయం హైదరాబాద్ కు చేరువలో మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో కలదు. హైదరాబాద్ కు చేరువలో ఉండటం, రవాణా సౌకర్యాలు కూడా చక్కగా అందుబాటులో ఉండటం వల్ల బాలాజీ ఆలయాన్ని దర్శించటానికి ప్రతిరోజూ వేలల్లో  భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. శుక్ర, శనివారాల్లో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
శ్రీ వెంకటేశ్వర స్వామీ కి అలాగే వారి భార్యలైన శ్రీ దేవి, భూ దేవి లకి అంకితమివ్వబడినది ఈ చిల్కూరు బాలాజీ టెంపుల్.
డబ్బులు అంగీకరించని ఏకైక ఆలయంగా ప్రపంచవ్యాప్తంగా ఈ గుడి ప్రాచుర్యం పొందింది. నిజానికి ఈ గుడిలో ఎటువంటి హుండీలు ఉండవు. దేవుని దృష్టిలో అందరూ సమానం. అందుకనే ఈ గుడిలో ప్రముఖులకి ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు ఉండవు.
చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్ళిన భక్తులు 11 ప్రదక్షిణాలు చేసి, మొక్కుకుంటారు.తమ కోరిక నెరవేరగానే మరోసారి గుడికి వెళ్ళి 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీ. అలా చేస్తే చిలుకూరు బాలాజీ భక్తుల కష్టాలు తీరతాయని,చిలుకూరు చిలుకూరు బాలాజీ టెంపుల్ వీసా బాలాజీ దేవునిగా ప్రసిద్ది చెందినది. 
కొన్నేళ్ల క్రితం పై చదువులకు పశ్చాత్త్య దేశాలకు వెళ్లి చదువుకొనే విద్యార్థులకు వీసా దొరకక ఇబ్బందిపడేవారు. చిలుకూరి బాలాజీ విశిష్టత తెలుసుకొని ఎక్కువ మంది త్వరగా వీసా రావాలని కోరుకోవటం. 
ఆ కోరిక నెరవేరటం వెంటనే జరిగిపోయాయి. దాంతో ఇక్కడి స్వామి వారికి వీసా దేవుడిగా పేరొచ్చింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చి మొక్కుకున్న విద్యార్థులకు వీసా వస్తుందని విశ్వసిస్తున్నారు. 
ఆ నమ్మకం ఎంతగా బలపడిందంటే చిలుకూరు బాలాజీకి వీసా వెంకటేశ్వరుడనే పేరు స్థిరపడింది.ఇక్కడ నిత్య పూజలంటూ ఏమీ ఉండవు. ఉదయం 5 గంటలకు గుడి తెరుస్తారు. అర్చకులు స్వామివారిని పూలతో అలంకరించి అర్చిస్తారు. అనంతరం భక్తులకు అనుమతిస్తారు.ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలనూ ఏటా చైత్రశుక్ల మాసంలో వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు.
Related Postings:

Transport
By Train:
Himayat Nagar Railway Station Junction is the nearest from Chilkur. The station is connected to some regions within the states. 
By Air:
Hyderabad Airport is the nearest airport and is located at about 20 km away Chilkur. Various buses, taxies and cabs are available from parts of Hyderabad to Chilkur as well.
By Bus:
The city is well connected to all major cities of the country by road, rail and air. It is easy to reach Chilakkur near Hyderabad. RTC-Hyderabad officials operate a bus every 5 minutes from the city to Chilakur Balaji Sannidhi.
The distance from the main parts of the city is ...
29.3 km from Shamshabad Airport
30.1 km from Secunderabad Railway Station
28.8 km from Kacheguda Railway Station
26.2 km from Nampally Railway Station
26.5 km from MGBs
31.1 km from JBS
21.4 km from the Mahidepattam.

Contact Details Of Chilkur Balaji Temple Swamy Temple
Chilkur Balaji Temple Rd, 
Himayat Nagar, 
Hyderabad, Telangana :500075
Phone: 0877 206 4254

Keywords:
chilkur balaji temple,chilkur balaji temple history,History - Chilkur Balaji Temple,History behined Sri Chilkur Balaji Temple,chilkur balaji temple history in telugu,chilkur balaji temple history in hindi,chilkur balaji temple timings,chilkur balaji temple timings for 108 rounds,about chilkur balaji temple in telugu language,chilkur balaji temple images,chilkur balaji temple contact number,chilkur balaji movie,chilkur balaji temple Story In Telugu,chilkur balaji temple History In Telugu,chilkur balaji temple Pooja Timings,chilkur balaji temple Phone no,Address,Visa God,chilkur balaji temple visa god,Chilkoor Balaji Temple,The Tale Of Visa God:Balaji Temple,HYDERABAD Famous Temple,Visa temple of Hyderabad,VISA God - Review of Chilkur Balaji Temple, Hyderabad, India

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS