ద్రాక్షారామం Draksharamam Temple History | Sri Bhimeswara Swamy Vari Devastanam | Pancharama Kshetram


దాక్షారామం వాడుకలో ద్రాక్షారామం అయింది. పూర్వం దక్ష ప్రజాపతి నిరీశ్వర యజ్ఞం చేసిన ప్రదేశమే నేడు ద్రాక్షారామంగా పిలువబడుతుంది. ఒకప్పుడు ఇది "దక్ష ఆరామం"గా పిలువబడి కాలక్రమేణా అది ద్రాక్షారామంగా మారింది. 
👉 ఈ క్షేత్రం పంచారామ క్షేత్రాలలో ఒకటి 
👉 ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో 12వ శక్తి పీఠం 
👉 ఈ ఆలయాన్ని సాశ. 7, 8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది. 


Temple Timings
5.30 am to 1.30 pm
1.30 pm to 9.00 pm



👉 శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం.
👉 త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, అష్తాదశ శక్తిపీఠాలలో ద్వాదశ పీఠంగా, దక్షిణ కాశీగా, వ్యాస కాశీగా ద్రాక్షారామానికి ప్రశస్తి ఉంది. 








👉 ఇక్కడి స్వామివారిని అభిషేకించడానికి సప్తఋషులు కలిసి గోదావరిని తీసుకు వచ్చారనీ పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి. అందువలన అంతర్వాహినిగా ప్రవహించే ఈ గోదావరిని సప్త గోదావరి' అని పిలుస్తూ వుంటారు. 





👉 ఇక్కడి పంచలోహ విగ్రహాలు తామ్ర మూర్తులు 8 వ శతాబ్దం నుంచి ఉన్నవిగా భావిస్తున్నారు




ఈ భీమేశ్వరుడికి ఎనిమిది దిక్కులలోను ఎనిమిది శివలింగాలను చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించాడని విశ్వసించబడుతుంది. వీటిని అష్టలింగములు లేదా అష్ట సోమేశ్వరములు అంటారు. తూర్పున కోలంక, పడమర వెంటూరు, 'దక్షిణాన కోటిపల్లి ఉత్తరాన వెల్ల ఆగ్నేయంలో దంగేరు. నైరుతిలో కోరుమిల్లి వాయువ్యంలో సోమేశ్వరం ఈశాన్యాన పెనుమళ్ళ ప్రాంతాలలో ఈ అష్ట సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి. ఈ భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఇంద్రేశ్వర, యజ్ఞేశ్వర, సిద్దేశ్వర, యోగీశ్వర, యమేశ్వర, కాళేశ్వర వీరభద్రేశ్వర లింగాలు దర్శనమిస్తాయి. ఇక తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశగా ఉన్న ఒక్కో గాలి గోపురాన్ని ఒక్కో అమ్మవారు పర్యవేక్షిస్తున్నట్టు స్థలపురాణం వివరిస్తుంది.




ద్రాక్షారామ భీమేశ్వరాలయం, కోనసీమ జిల్లా, రామచంద్రపురం మండలం, ద్రాక్షారామం గ్రామంలో, గోదావరి నది తూర్పు ఒడ్డున ఉంది
ద్రాక్షారామం కాకినాడ నుండి 28 కిమీ, రాజమండ్రి నుండి 50 కిమీ, అమలాపురం నుండి 25 కిమీ దూరంలో ఉంది. 

ఇంకా మీకు అదనంగా సమాచారం కావాలంటే హిందూ టెంపుల్స్ గైడ్ సభ్యులకు కాల్ చేయవచ్చు . మీరు ముందుగా వారికి వాట్స్ యాప్ లో మెసేజ్ పెట్టి కాల్ చేయగలరు. 
శ్రీ ఊట శ్రీనివాసరావు గారు : 9493255771



యాత్రీకుల సౌకర్యార్ధం ఇచ్చట పైండా వారిచే నిర్మించబడిన అన్నదానసత్రం ఉంది. దేవస్థానం వారి యాత్రికుల వసతి గృహం, ఆలయానికి 1/2 కి.మీ దూరంలో ఆర్.టి.సి బస్టాండుకు దగ్గర కోటిపల్లి రోడ్డులో ఉంది.






Near By Famous Temples
Papi Kondalu
Dindi
Mada-Forest
Pada Gaya- Pithapuram
Tholi Tirupathi- Peddapuram

Transport
By Road
Draksharamam is nearby from towns like Kakinada, Rajahmundry and Samalkota. It is at a distance of 6kms from Ramchandrapuram and hence can be reached either by bus or car. There are government-run bus facilities available from Kakinada and Ramchandrapuram.

By Train
The nearest railway stations are at Kakinada, Rajahmundry and Samalkota from where you can either take a bus or drive in a taxi.

By Air
The nearest airport is at Rajahmundry.

Related Postings
18 Shakti Peethas
Contact Details Of Sri Bhemeswara Swamy Vari Devastanam
The Executive Officer
Sri Bhemeswara Swamy Vari Devastanam
Draksharamam,
Ramachandrapuram,
konaseema  District,
Pincode: 533262, A.P


              
keywords:
Pancharamalu,Pancharama Temples,Pancharama Kshetras in telugu,Pancharamalu in telugu,Pancharamalu List in Telugu

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS