ప్రాచీన గణపతి క్షేత్రాలలో అయినవిల్లి క్షేత్రమొకటి. ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ( ఇంతకూ ముందు తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది ) లో అయినవిల్లి ఉంది ,మండలం కూడా అయినవిల్లే . కోనసీమ లో ప్రసిద్ధ క్షేత్రంగా చెప్పబడుతున్నది అమలాపురం నుంచి 13 కిమీ దూరం లో అయినవిల్లి ఉంది.
ఈ క్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక క్షేత్రం కన్నా పురాతనమైనది స్థలపురాణం వివరిస్తుంది. పూర్వం అయినవిల్లిలో స్వర్ణ గణపతి మహాయజ్ఞం జరుగుతూ వుండగా వినాయకుడు ప్రత్యక్షమై అక్కడి వారిని అనుగ్రహించాడని 14 వ శతాబ్దంలో శంకరభట్టు వ్రాసిన శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో పేర్కొనబడింది.
ఇతిహాసం ప్రకారం రెండు కథలు ఉన్నాయి. మొదటి కథ ప్రకారం దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ పూజలు జరిపాడని చెబుతారు. స్వయంభువ వినాయకక్షేత్రాలలో ఇది మొదటిదని విశ్వసించబడుతుంది. ఇది కృతయుగానికి చెందినదిగా భావిస్తున్నారు.మరొక కథనం అనుసరించి వ్యాసమహర్షి దక్షిణ భారత దేశ యాత్ర ప్రారంభసమయంలో ఇక్కడ పార్వతి తనయుడైన వినాయకుని ప్రతిష్ఠించాడని ఈ వినాయకుడే భక్తుల కోరికలు తీర్చే సిద్ధి వినాయకుడు అయ్యాడని చెబుతారు.
సువిశాలమైన ఆవరణలో ఎత్తైన ప్రాకారంతో విరాజిల్లుతున్న ఈ దేవాల యంలో శ్రీవిఘ్నేశ్వరస్వామి దక్షిణాభిముఖుడై ఉంటాడు. సాధారణంగా ప్రతీ దేవాలయాలు తూర్పుముఖంగా ఉంటాయి. అయి తే అయినవిల్లిలో సిద్ధివినాయకుని ఆలయం మాత్రం దక్షిణముఖంగా ఉండడం విశేషం. అంతేగాక ఈ గ్రామంలో దక్షిణ సింహాద్వారంతో నిర్మించిన గృహాలకు ఎటువంటి విఘ్నాలు కలుగవని, గృహాలు సంవృద్ధికరంగా ఉంటాయని స్థానికుల ప్రగాఢవిశ్వాసం. రెండు గోపురాలతోచూపరులను ఆకట్టుకునే సింహద్వారాలతో విఘ్నేశ్వర దేవాలయ సౌందర్యం సందర్శకులను సమ్మోహనపరుస్తూ ఉంది. ఆలయ ప్రాంగణంలో క్షేత్రపాలకుడైన కాలభైరవుని ఆలయంతోపాటు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకేశవునికి, శివునికి, శ్రీఅన్నపూర్ణాదేవికి, శ్రీకాలభైరవస్వామికి ఉపాయాలు ఉన్నాయి. శివకేశవులకు తారతమ్యాలు లేకుండా ఈ ఆలయాన్ని నిర్మించారని విశ్వసిస్తున్నారు.
ఆలయానికి రెండు గోపురాలు ఉన్నాయి. దక్షిణ గోపురం ద్వారా ఆలయానికి చేరితే వినాయకుడిని దర్శనం చెసుకోవచ్చు. ఇక్కడ స్వామి దక్షిణ ముఖుడై ఉన్నాడు. ప్రధాన ఆలయంలోని విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవడానికి తూర్పు గోపురం నుండి ప్రవేశించవచ్చు.
ఈ ఆలయానికి అనుసంధానంగా ఉన్న ఆలయం లోనే శ్రీదేవి, భూదేవి సమేతుడైన కేశవ స్వామి ఉన్నారు. అన్నపూర్ణా దేవి ఆలయం కూడా ఈ ఆలయ సన్నిధిలో ఉంది. ఆలయానికి క్షేత్ర పాలకుడైన కాలభైరవుడు గుడి కూడా ప్రధానాలయ ప్రాంగణం లోనే ఉంది. ఈ ఆలయానికి వివిధ ప్రదేశాలనుండి భక్తులు వచ్చి వారి మొక్కులు తీర్చుకొంటారు. ఇక్కడి ఆలయంలో పూజలు శైవ ఆగమశాస్త్రానుసారంగా జరుగుతాయి.
ఈ ఆలయంలో ప్రతీనెలా కృష్ణపక్ష, శుక్లపక్ష చవితి తిధులు, దశమి, ఏకాదశులలో, వినాయకచవితి పర్వదినాలలో సిద్ధివినాయకునికి విశేషార్చనలు జరుపుతారు. ప్రతినిత్యం స్వామివారికి శైవాగమన ప్రకారం కొబ్బరికా యలు, పండ్లరసాలతో అభిషేకాలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. భక్తులు ఇక్కడకు వచ్చి కోరిన కోర్కెలు తీరిన వెంటనే మరలా మొక్కుబడులు తీర్చుకొ నడం విశేషం.
దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు, ప్రముఖులు నిత్యం స్వామివారిని సందర్శిస్తారు. అతి పురాతనమైన ఈ ఆలయాన్ని దేవతలే నిర్మించారని విశ్వసిస్తున్నారు. అయినవిల్లి సిద్ధివినాయకుని భక్తిశ్రద్ధలతో అర్చిస్తే కోర్కెలతోపాటు బుద్ధి వికసిస్తుందని విశ్వసిస్తున్నారు.
మీకు ఏదైనా సమాచారం కావాలంటే మన హిందూ టెంపుల్స్ గైడ్ సభ్యులకు కాల్ చేసి అడగవచ్చు .. ముందుగా వాట్స్ యాప్ లో మెసేజ్ చేసి కాల్ చేయగలరు .
ఊట శ్రీనివాసరావు గారు : 9493255771
Ainavilli Siddi Vinayaka Temple Timings
Morning Hours: 5:00 am – 1:00 pm
Evening Hours: 3:30 pm – 8:30 pm
Near By Famous Temples:
1.Sri Bala Balaji Temple (Appana palli).
2.Sree Veereswara Swamy Temple, Muramulla.
Transport:
By Road
APSRTC Provides number of Buses to Ainavilli
1.From Kakinada Bus stand to Ainavilli about 70 Km(Via Yanam, Amalapuram and Mukteswaram) .
2. From Rajahmundry Bus Stand to Ainavilli about 55 Km(Via Ravulapalem, Kotapeta and Vanapalli).
By Train
Nearest stations are Kakinada & Rajahmundry Railway Stations.
By Air
Nearest Airport is at Rajahmundry.
Related Postings:
Contact Details Of Sri Vighneswara swamy Vari Devasthanam:
The Executive Officer,
Sri Vighneswara Swamy Vari Devasthanam,
Ainavilli,
East Godavari District, ( kondaseema District )
Andhra Pradesh - 533 211.
Tags
Ainavilli
Andhrapradesh
East Godavari
Famous Temples
Konaseema district
Lord Vinayaka East Godavari
Temples Guide Team
Vinayaka Temples