Sri Maddi Anjaneya Swamy Temple Information | Timings History


శ్రీ మద్ది వీరాంజనేయస్వామి – గురవాయి గూడెం
ఏపీలో ప్రసిద్ధి గాంచిన హనుమంతుని ఆలయం మద్ది ఆంజనేయ స్వామి ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెం ఎర్రకాలువ ఒడ్డున గురవాయిగూడెం అనే గ్రామం కలదు.

ఈ గ్రామంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ మద్ది వీరాంజనేయస్వామి వారి ఆలయం ఉన్నది. ఇక్కడ ఒక మద్దిచెట్టు మొదట్లో ఆంజనేయస్వామి వెలసి ఉన్నాడు. అందువలన ఈ స్వామివారిని మద్ది వీరాంజనేయస్వామి అని పిలుస్తారు. ప్రతిరోజూ భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి దర్శించుకుంటారు. ఈ ఆలయానికి కప్పుగాని, విమాన శిఖరము గాని లేవు గాని లేవు. మద్దిచెట్టు లోపలినుండి పైకి బాగా పెరిగి ఉండుట వలన విమానం కట్టుటకు అవకాశం లేకుండా పోయింది. భక్తులు తమ కోరికలు నెరవేరిన తరువాత ఈ ఆలయంలో ప్రదక్షిణలు చేస్తారు. ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసేందుకు వీలుగా మండపం రూపొందించారు.

స్థలపురాణం:-
త్రేతాయుగంలో రావణసైన్యంలో మద్వాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు రాక్షస ప్రవృత్తిలో కాక ఆథ్యాత్మిక చింతనతో జీవించేవాడు. కాలక్రమంలో రామ, రావనయుద్ధం జరుగుచున్న సమయంలో రామునివైపు పోరాడుతున్న ఆంజనేయస్వామివారిని చూసి అతని మనసు చలించి అస్త్రసన్యాసం చేసి ‘హనుమా’ అంటూ తనువు చాలించాడు. ద్వాపరయుగంలో మధ్వికునిగా జన్మించి సదాచార సంపన్నుడై నిత్యం భక్తి బావంతో జీవించేవాడు. విధివశాత్తు కౌరవ పాండవుల యుద్ధంలో కౌరవ పక్షమున పోరాడుతున్న మధ్వికుడు, అర్జునుని జెండాపై ఉన్న శ్రీ ఆంజనేయస్వమివారిని చూసి పూర్వజన్మ గుర్తుకు వచ్చి, హనుమా అని ప్రాణత్యాగం చేసాడు. కలియుగంలో మధ్వుడుగా జన్మించి ఆధ్యాత్మిక చింతనతో జీవిస్తూ, ఎర్ర కాల్వ ఒడ్డుకు వచ్చి తపస్సు చేసుకొనుటకు అక్కడ ఒక నివాసం ఏర్పరుచుకున్నాడు. ప్రతి దినం కాలువలో స్నానం చేసి, స్వామివారిని పూజించేవాడు. ఒకరోజు మధ్వుడు స్నానంచేసి, ఒడ్డుకు రాబోయి కాలువలో పడబోగా, ఎవరో ఆపినట్లు ఆగిపోయాడు. ఆశ్చర్యం ఒక వానరం ఆయన చేయి పట్టుకొని ఒడ్డుకు తీసుకువచ్చి, ఆయనకు సపర్యలు చేసి, ఒక ఫలమును ఆహారంగా ఇచ్చింది. ఇలా కొంతకాలం జరిగింది. ప్రతిరోజు ఇలా తనకు సపర్యలు చేస్తున్న వానరాన్ని చూసి ఒకరోజు మధ్వుడు వానరాన్ని ఆంజనేయస్వామి వారిగా గుర్తించి “స్వామీ ఇంతకాలం మీతో సపర్యలు చేయించుకున్నాను. ఎంతటి దౌర్భాగ్యుడను. పాపాత్ముడను. ఇంక నేను జీవించి ఉండుట అనవసరం” అని స్వామీ వారి పాదాల వద్ద పడి ఏడవసాగాడు. అంతట శ్రీ ఆంజనేయస్వామి ప్రత్యక్షమై “మధ్వా! ఇందులో నీ తప్పు ఏమీలేదు. నీ భక్తికి మెచ్చి నేనే స్వయంగా వచ్చి నీకు సపర్యలు చేసాను. ఏదైనా వరం కోరుకో” అన్నాడు. అందుకు మధ్వుడు “మీరెల్లప్పుడూ నా చెంతనే ఉండేలా వరం ఇవ్వండి” అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీ ఆంజనేయస్వామి “నీవు ఇచ్చట మద్దిచేట్టుగా అవతరించు. నేను నీ సమీపంలో శిలారూపంలో ఒక చేతిలో ఫలం మరో చేతిలో గదతో ఇచ్చట వెలుస్తాను. ఈ పుణ్యక్షేత్రం నీ పేరుతో మద్ది ఆంజనేయస్వామిగా భక్తులు పిలుస్తారు. అని అనుగ్రహించాడు. ఈ ఆలయానికి పశ్చిమభాగంలో పురాతన శ్రీ వేంకటేశ్వర ఆలయం కుడా ఉంది. ఆంజనేయస్వామి ఆలయంలో 7 మంగలవారాలు 108 ప్రదక్షిణల చొప్పున చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుహ్ల నమ్మకం. వివాహం కానివారికి వివాహం జరుగుతుందని ప్రతీతి. కుటుంబ సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి. శని మహర్దశ, ఏలినాటి శని తదితర దోషాలు నివారణ అయి, అంతా శుభమే జరుగుతుందని నమ్మకం.


Contact:
Sri Maddi Anjaneya Swamy Temple
Jangareddy Gudem
West Godavari
Andhara Pradesh
Office:08821-226494

Darsanam:
Timings          Pooja Name
5:00 Am           అభిషేకం, నిత్య అర్చన
6:00 Am           ఆర్జిత పూజ ప్రారంభం, సర్వ దర్శనం
7:30 Am           బాల భోగం
8:00 Am           ఆర్జిత పూజలు, సర్వ దర్శనం, వేద పారాయణం ప్రారంభం
12:00 Pm         మహా నివేదన
12:15 Pm         మహా నివేదన
1:00 Pm           హారతి, కవత బంధనం


Afternoon:
Timings           Pooja Name
3:00 Pm           మధ్యాహ్నక పూజ, హారతి
3:15 Pm           సర్వ దర్శనం
8:00 Pm           ఆలయ శుద్ధి
8:30 Pm           సర్వ దర్శనం
9:00 Pm            కవత భంధనం

How to Reach:
Maddi Anjaneya Swamy ( Lord Hanuman ) temple is at 3 KM distance from Jangareddigudem town. The name of the village is Gurvaigudem.

Related Postings:

> List of Hindu Temples In India

> Tallest Hanuman Statues Information

> Accommodation in Nettikanti Anjaneya swamy Temple

> Varanasi Surrounding Tourist Places

> Famous Temples In Delhi

> Ardhagiri Anjaneyaswamy Temple history

     


Maddi anjaneya swamy temple maddi anjaneya swamy temple timings maddi anjaneya swamy images maddi anjaneya swamy temple photos sri maddi anjaneya swamy temple timings maddi anjaneya swamy temple address maddi anjaneya swamy temple phone number anjaneya swamy dandakam in telugu hindu temples guide.com

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS