భక్తుల పాలిట కొంగు బంగారమై చోడవరం లో కొలువుదీరిన "శ్రీ కార్యసిద్ధి వినాయకుని" వైభవము.
"చోడవరం", ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము. అనకాపల్లి పట్టణానికి 18 కి.మీ. దూరంలో ఉంది. ఈ ఊరికి రోడ్డు మార్గము మాత్రమే కలదు. ఈ "చోడవరం" పూర్వ నామం "చోళవరం".
జిల్లా కేంద్రమైన విశాఖపట్నానికి సుమారు 50 కి.మీ. దూరంలో "చోడవరం" లో వెలసిన కార్య సిద్ధి వినాయకుడు భక్తుల కోర్కెలను తీరుస్తూ, కొంగుబంగారమై భాసిల్లుతున్నాడు. ఈ ఆలయ ప్రాంతంలో గొల్లలు గొర్రెలను కాస్తుండగా, ఒక గోయ్యలోనుంచి వినాయకుడు పైకి వచ్చి దర్శనమిచ్చాడని, సాక్షాత్తు వినాయకుడే స్వయంభూగా వెలసాడని నమ్మిన ఆ పుర ప్రజలు చిన్న గుడికట్టి అప్పటినుండి పూజాదికాలు నిర్వహించారని స్థానికుల కథనం.
Chodavaram Temple History:
ఈ ప్రాంతం 11 వ శతాబ్దిలో చోళరాజుల పాలనలో ఉన్నట్లు; అతి పురాతనమైన శ్రీ స్వయంభూ విఘ్నేశ్వర స్వామి దేవాలయం చోళుల కాలమునాటిదిగా చారిత్రిక కథనం. స్థానిక చరిత్ర ప్రకారం, "పాత ఆలయ అవశేషాలు 1850 లో వెలికితీయబడ్డాయి. ఈ వివరాలను బట్టి, ఇప్పటి ఆలయం 200 సంవత్సరాల నాటిదే అయినా, పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం, ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలో, చాళుక్య చోళులు (దాదాపు 1200 AD) కాలంలో స్వామివారికి ఆలయం నిర్మించినట్లు కనుగొన్నారు.
స్వయంభూ అయిన స్వామి వారి **మూలస్థానం" తెలుసుకొనేందుకు 200 సంవత్సరాల క్రితం" చోడవరం" పురవాసులు విశ్వ ప్రయత్నం చేసి విఫలురై, ఆ ప్రయత్నం మానివేశారని; ఆ ప్రయత్నంలో వారిచే త్రవ్వబడినదే "ఏనుగుబోదె" లేదా "పాతచెరువు" అంటారు.
అలాగే స్వామివారు కూడా ప్రతీ రోజు పెరుగుతున్నారని ఆలయ ప్రధాన అర్చకుల మాట. ఈ ఆలయ అర్చకత్వం కూడా అనువంశికంగా "కొడమంచిలి" వంశీయులే నిర్వహిస్తున్నారు. ఈ ఆలయ నిర్వహణ, అభివృద్ధి, దేవాదాయ ధర్మాదాయ శాఖ, ధర్మకర్తలమండలి, శ్రీ బాలగణపతి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ ఆలయం ప్రశస్తి 1956 లో వెలుగులోకి వచ్చింది. శ్రీ డా.! చుండూరి వెంకన్నపంతులు గారు మరియు ఆనాటి ఆలయ అనువంశీక అర్చకులు శ్రీ కొండమంచిలి చలపతి రావు గార్ల ఆధ్వర్యంలో 1956 వ సంవత్సరం లో మహాసంప్రోక్షణ చేసి నిత్య ఆరాధనా, నవరాత్రి ఉత్సవ నిర్వహణకు ఏర్పాటు చేశారు.
దేవాదాయ ధర్మాదాయ శాఖ, ధర్మకర్తలమండలి, శ్రీ బాలగణపతి సంఘం వార్ల సంయుక్త పర్యవేక్షణలో 1975 వ సంవత్సరంలో ఆలయ అభివృద్ధి, అనేక పునర్నిర్మాణ కార్యకలాపాలు, భక్తులు కొరకు అనేక సౌకర్యాలు ఏర్పాటు, చాలా వేగవంతంగా జరిగాయి. ఈ నాటికీ వీరి సంయుక్త పర్యవేక్షణలోనే ఈ ఆలయ నిర్వహణ, స్వామివారికి నిత్య పూజలు, సేవలు, ఉత్సవాలు ఎంతో వైభవోపేతముగా జరుగుచున్నవి. ఇక్కడ "వినాయక చవితి" అత్యంత వైభవోపేతం గా నిర్వహిస్తారు.
"చోడవరం"లో శివాలయం కూడా అతిపురాతనం. ఆ పక్కనే ఒక "కొలను" కూడా ఉన్నది. ఇక్కడి స్వయంభూ వినాయకుని తొండం భూగర్భంలో చాలా పెద్దగా కొలను వరకూ వ్యాపించి ఉన్నదనీ, మరియు ఆ తొండం క్రమెపి పెరుగుతోందని స్థానిక భక్తులు చెపుతారు. అదే కారణానికే, ఆ గ్రామ పెద్దలు, స్వామి వారిని కదిపి శివాలయంలో ప్రతిష్టించాలనే ప్రయత్నం నెరవేరలేదట.
Temple Darshan Timings:
Morning Hours: 6:00 am - 12:00 pm
Evening Hours: 5:00 pm - 8:00 pm
How to Reach:
By Air:
The Visakhapatnam airport is located 50 km from Chodavaram. Many Airlines connects Visakhapatnam with Hyderabad,Banglore,Mumbai,Delhi,Chennai, Sharjah, Kuwait, and Colombo, there from you have to travel by bus to reach temple.
By Train:
Visakhapatnam is an important junction on the Southern Railway. It is connected to Chennai, Banglore, Mumbai, Tirupati, Hyderabad, Orrisa and to many places around India on the broad gauge.
By Bus:
Chodavaram and Visakhapatnam is well connected by road with important places in South India. For local transport, there are regular city bus service to Visakhapatnam,Anakapalee all the places of tourist interest from Chodavaram Bus Station and Visakhapatnam Bus Station. Tourist taxis, auto-rickshaws, and cycle rickshaws are also available.
Related Postings:
> Accommodation in kanipaka Varasiddhi Vinayaka Temple
> Famous Temples in Andhra Pradesh
> Kanipakam Temple History
>Sri Sampath Vinayaka Temple Accommodation Visakhapatnam
karya siddhi vinayaka temple in chodavaram, chodavaram map, karya siddhi anjaneya temple, Chodavaram Temple, Chodavaram Visakhapatnam district, Chodavaram images, Chodavaram vinayaka temple address, Chodavaram Temple Timings, Chodavaram Temple History in telugu, Chodavaram temple information, Chodavaram temple accommodation, hindu temples guide.com