Importance of Bindi in Hindu Tradition | Hindu Temples Guide Articles


కుంకుమ ఎందుకు దరించాలి ?
హిందూ ధర్మం లో తిలక ధారణకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. భ్రూ మధ్యములొ ధరించే ఈ కుంకుమ వల్ల కొన్ని నాడులు ఉత్తేజితము అవుతాయి అని శాస్త్ర పరిశోధనలలో తేలింది కూడా. అలాగే ఎదుటివారు మన ముఖము చూడగానే కనిపించే ఈ కుంకుమ వల్ల దృష్టి దోషం కూడా ఉండదు అని చెపుతారు. 

అలాగే వివాహిత మహిళలకు సౌభాగ్యచిహ్నాలుగా  మంగళ సూత్రం, నల్ల పూసలు, మెట్టెలు, పసుపు, కుంకుమ, పూవులను చెపుతారు. మంగళ సూత్రం, నల్లపూసలు ధరించిన స్త్రీని చూడగానే ఆమె వివాహిత అని అర్ధం అవుతుంది ఎవరికైనా. ఆమె మిద వెంటనే గౌరవభావం వస్తుంది. పసుపులో ఎన్ని ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉన్నాయో కొత్తగా చెప్పక్కరలేదు. అలాగే మెట్టెలు ధరించడం వల్ల కూడా కొన్ని నాడులు సక్రమంగా పని చేస్తాయి. ఇవన్ని శాస్త్రీయంగా నిరుపితమైన సత్యాలు.

కానీ మనం ఎం చేస్తున్నాం? అత్యంత ముఖ్యమైన తిలకాన్ని పెట్టుకోవడం మానేస్తున్నాం. ఫాషన్ అంటూ నుదుటిన బొట్టు లేకుండానే బయటికి వెళ్ళిపోతున్నాం. మగవారైనా, ఆడవారైనా స్నానం చేసిన వెంటనే నుదుటిన బొట్టు ధరించాలి అని శాస్త్రం. ఇది ఎవరు పట్టించుకోవటం లేదు. పూజ చేసుకునే ముందు కాళ్ళకు పసుపు రాసుకొని కూర్చోవాలి అంటుంది శాస్త్రం. బొట్టే లేకపోతే, ఇంకా పసుపుకు స్థానం ఎక్కడ? మహా అయితే పూజ , లేదా నమస్కారం అయ్యే వరకు బొట్టు పెట్టుకొని ఇవతలకి రాగానే తుడిచెస్తున్నారు ఈకాలం అమ్మాయిలు .ఒకవేళ పెట్టుకొన్నా కనీ కనపడకుండా చిన్న నల్ల రంగు బొట్టు పెట్టుకుంటున్నారు. నల్ల రంగు బొట్టు ఎప్పుడు పెట్టుకొంటారో వారికి ఎవరు చెప్పటం లేదు.


 కొన్ని మతాలలో బొట్టు పెట్టుకునే అలవాటు లేదు. విదేశీయులు కూడా పెట్టుకోరు. వారిని అనుకరించి మనం మన పధ్ధతి మార్చుకోవడం ఎంత సబబు? ఇతర మతాల వాళ్ళు వాళ్ల అలవాట్లు, సంప్రదాయాలు వదులుకోవటం లేదే? మనకెందుకు ఆ అనుకరణ!విదేశీయులు మన భగవద్గిత, పురాణాలూ, ఇతిహాసాలలో ఉన్న గొప్పదనం గ్రహించి వాళ్ళు నేర్చుకుంటున్నారు. మనం మన సంస్కృతిని మర్చిపోతున్నాం.

మగవారు కూడా బొట్టు పెట్టుకునే ఈ దేశంలో ఆడపిల్లలు బొట్టు మానేయటం ఎంత తప్పో ఎవరైనా అలోచించారా? అమ్మా!  దయచేసి మీ పిల్లలకు బొట్టు పెట్టుకోవడం నేర్పించండి. మీ పిల్లలకు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నారు. ఇది కూడా బాధ్యతగా నేర్పించండి.
Related Postings:

> Tirumala Complete Information in Telugu

> Arunachalam Complete Information

> Devotional Ebooks Free Download

> Kashi Yatra Importance in Telugu

> Sri Chaganti Pravachalu Videos

> Famous Temples in Visakhapatnam District

> Famous Temples In Krishna District


Bindi Importance, Hindu Temples List, AP Famous Temples, Temple Timings, TTD, Tirumala Accommodation details, Importance of Bindi in telugu, hindu temples guide.com

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS