రామ రామ రామేతి,
రమే రామే మనోరమే!
సహస్రనామ తత్తుల్యం,
రామనామ వరాననే’
శ్రీ ఈ శ్లోకం మూడుసార్లు పఠిస్తే విష్ణు సహస్రనామం చదివినంత పుణ్యం వస్తుంది అంటారు. అలాగే ఆ సీతారాముల కల్యాణాన్ని కనులారా చూసి తరించాలనుకుంటారు భక్తులు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఆ మహోత్సవానికి పేరొందిన ప్రదేశం భద్రాచలమే
ఉగాది ప్రారంభంనుండే వసంతఋతువుప్రారంభంతో ,మానవజీవితంకూడా నవవసంతంగా నిరంతరం శోభిల్లాలనే ఆకాంక్షతో వసంతానవరాత్రులను మనం జరుపుకుంటాం. ఈ వసంతానవరాత్రులలో చివరిరోజైన నవమిరోజున పురస్కరించుకుని లోకకల్యాణం కోరుతూ సీతారాముల కల్యాణం జరపటం ఒక ప్రసిద్ధ ఆచారంగా ఉంది. శ్రీరామచంద్రునికి నిండుపున్నమివేళ కల్యాణంవేడుకలు జరపటం ఒంటిమిట్టక్షేత్ర ప్రత్యేకత. జాంబవంతునిచే ప్రతిష్ఠించబడిన ఒంటిమిట్ట శ్రీకోదండరామ ఆలయంలో శ్రీరామనవమినుంచి తొమ్మిదిరోజులపాటు బ్రహ్మోత్సవాలు చూసేవారికి అవి కన్నుల పండుగే .యుగయుగాన, జగజగాన రామయ్యకథ మనవాళికంతటికి మార్గదర్శనం చేస్తూనే ఉంటుంది. ఒక పరిపూర్ణవ్యక్తిత్వంగలవానిగాను, పుత్రునిగా, అన్నగా, భర్తగా, మిత్రునిగా, విరునిగా, రాజుగా అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన మర్యాదాపురుషోత్తముడు రాముడు , అంతేకాదు, కుటుంబ జీవితానికి, ఆదర్శ దాపత్యానికి, సత్యపరాక్రమానికి, సుపరిపాలనకు, శరణన్న సమస్త జీవకోటికి అభయహస్తం ఇచ్చి ఆదుకోవటానికి .... ఇలా ఎన్నిటికో కొండగుర్తు శ్రీరాముని దివ్యచరితం.
కష్టాలకడలిని దాటి సత్యం, ధర్మం ఇరుప్రక్కల నడుస్తుండగా లోకపావనియైన సీతను చేపట్టి లోకకంటకుడైన రావణాసురుని సంహరించి, తండ్రికిచ్చిన మాట చెల్లించుకుని, రాజంటే రాముడే, రాజ్యం అంటే రామరాజ్యమే అని నేటికీ గుర్తిండిపోయేటట్లుగా భారతీయులందరి మనసులలోను చరగనిముద్ర వేసుకున్నది శ్రీరామపట్టాభిషేకం చిత్రం. ఇది చుసిన మానవజాతికి నిరంతరం కొండంతస్ఫూర్తిని అందిస్తూనే ఉంటుంది.
సీతారాముల కల్యాణం!
భక్తుల గుండెల్లో కొలువైన సుందర చైతన్య రూపుడైన శ్రీరాముడు త్రేతాయుగంలో వసంత రుతువులో చైత్ర శుద్ధనవమిరోజున పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడట. అరణ్యవాస అనంతరం చైత్రశుద్ధనవమి రోజునే అయోధ్యలో సీతాసమేతుడై పట్టాభిషిక్తుడయ్యాడు. సీతారాముల కల్యాణం కూడా అదేరోజున జరిగిందని చెబుతారు. అందుకే శ్రీరామనవమిని వూరూవాడా పండగలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఆ కల్యాణమహోత్సవానికి ఎంతో పేరుపొందిన శ్రీరామ క్షేత్రాల్లో భద్రాచలం ఒకటి. దాని తరవాత అంతటి ప్రాధాన్యం ఉన్న క్షేత్రంగా పేరొందినదే ఈ గొల్లల మామిడాడ కోదండ రామాలయం.భద్రాచలంలో చేసే పద్ధతిలోనే ఈ ఆలయంలోనూ కల్యాణ క్రతువుని జరపడం పూర్వంనుంచీ ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో మంచి ముత్యాల తలంబ్రాలనూ పట్టుబట్టలనూ బహూకరిస్తారు. వివాహమహోత్సవం అనంతరం స్వామివారి తలంబ్రాలను ప్రసాదంలా పంచుతారు. వాటిని ఇంటికి తీసుకెళ్లి పాయసంగానీ పరమాన్నంగానీ చేసుకుని తిన్నవారికి కోరికలు తీరతాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే కల్యాణానికి వచ్చిన వాళ్లంతా అక్కడ ఏర్పాటుచేసిన కౌంటర్ల నుంచి వాటిని తప్పక తీసుకువెళతారు.
ఈ నెల ఐదో తేదీన జరగబోయే కల్యాణానికి కనీసం లక్షమందైనా భక్తులు వస్తారన్నది నిర్వాహకుల అంచనా. నాలుగో తేదీ నుంచే పెళ్లి పనులను ప్రారంభించి,. ఐదో తేదీన 11 గంటల నుంచి సీతారాముల కల్యాణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం స్వామి వారి కల్యాణ ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో వూరేగిస్తారు. మహాన్నదానం కూడా నిర్వహిస్తారు. చుట్టూ పచ్చని కొబ్బరితోటలూ మామిడితోపులూ వాటి మధ్యలో వరిపొలాలూ గోదావరి పిల్లకాలువలతో భూదేవి మెడలోని పచ్చలహారంలా శోభిల్లే గొల్లలమామిడాడలో ఆ కోదండరామచంద్రమూర్తి ఆలయంతోబాటు కుక్కల నారాయణస్వామి ఆలయాన్నీ సూర్యదేవాలయాన్నీ కూడా సందర్శించవచ్చు. రాజమండ్రి వరకూ రైలూ లేదా బస్సులో వెళ్లి అక్కడ నుంచి కెనాల్ రోడ్డు మీదుగా బస్సూ ట్యాక్సీల్లో గొల్లల మామిడాడకు చేరుకోవచ్చు.
Related Postings:
> Bhadrachalam Temple Specialty
> Famous Temples In Khammam District
> Sriramgam Temple Guide
> Konaseema Tirupati Vadapalli Temple Information in Telugu
> Chilkur Balaji Temple Information in Telugu
> Sri Ananta Padmnabha Swamy Temple Information
> Rayadurgam Sri Prasanna Venkataramana Temple History
> Kanchipuram Varadaraja Perumala Temple Information
> Tirumala Complete Information in Telugu
> A Complete Details About Arunachalam | Tiruvanamalai Tamil Nadu
> Telugu Devotional Books Free Download
Srirama navami history in telugu, srirama navami, srirama navami images, srirama navami special, sri ramanavami information in telugu, bhadrachalam, Khammam, sri ramanavami PDF files, sri ramanavami, east godavari district, andhrapradesh, Gollalamamidada, srirama navami visistata, sri ramanavami bhadrachalam, hindu temples guide.com, sri rama navami in telugu language, sri ramanavami 2017.
Tags
Story
I like your blog
ReplyDelete