ఈ మందపల్లి క్షేత్ర ప్రాంతమున పదునాలుగువేల నూట ఎనినిది పుణ్యతీర్థములు గలవు. వీటిలో ప్రధానమైనవి అశ్యర్ధ తీర్ధము, అగస్యతీర్దము, సాత్రిక తీర్దము, యాగ్నిక తీర్దము, సానుగ తీర్దము మొదలగునవి ముక్యమైనవి.
శనిదేవుడు ఒక్కసారి పట్టుకుంటే, ఏడేళ్లవరకూ మనచుట్టే తారట్లాడుతుంటాడని పేరు. ఆ మందగమనుడు శివలింగాన్ని ప్రతిష్ఠించిన క్షేత్రమే, తూర్పు గోదావరి జిల్లాలోని మందపల్లి. అభిషేక ప్రియుడైన మందేశ్వరుడిని పూజిస్తే, శని ప్రభావం వదిలిపోతుందని భక్తుల విశ్వాసం.శనీశ్వరుడికి సంబంధించి ఎన్నో కథలు. పట్టుకుంటే ఓపట్టాన వదలడంటారు. నలమహారాజును సైతం ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడని చెబుతారు. దేవతలకి కూడా దడపుట్టించగల మహాశక్తిమంతుడన్న ఖ్యాతి. ఎన్ని వేధింపులైనా ఆ క్షేత్రానికి అవతలే! ఒక్కసారి తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట మండలంలోని మందపల్లిలో వెలసిన మందేశ్వరుడిని దర్శించుకుంటే...శని ప్రభావం మటుమాయమైపోతుందని ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే, అక్కడి శివలింగాన్ని సాక్షాత్తూ శనిదేవుడే ప్రతిష్ఠించాడని ఐతిహ్యం. మందేశ్వరుడికి తైలాభిషేకాలు జరిపితే, శని వల్ల కలిగే సమస్త దోషాల నుంచీ విముక్తి లభించినట్టేనని బలమైన నమ్మకం.
ప్రతి మనిషి జీవితకాలంలో రెండుమూడుసార్లు ఏలిన నాటి శని ప్రభావం ఉంటుందనీ, శనిదేవుడికి తైలాభిషేకం చేస్తే ఆ ప్రభావాన్ని తప్పించుకోవచ్చనీ జ్యోతిష నిపుణులు చెబుతారు. ఆ కారణంగానే, దేశం నలుమూలల నుంచీ శనిత్రయోదశి లాంటి పర్వదినాల్లో వేలాది భక్తులు మందపల్లికి తరలివస్తారు. ముడినువ్వుల నూనెతో అభిషేకం చేసి, నువ్వులూ బెల్లమూ కలిపి నివేదిస్తారు. ప్రతి శనివారమూ ఆలయం శనిపీడితులతో కిటకిటలాడుతుంది. శనిదోషం లేని వారు స్వామిని దర్శించుకుంటే, రాబోయే కష్టాలూ తొలగుతాయని అంటారు.
పూర్వం, ప్రస్తుతం మందపల్లిగా పిలుస్తున్న ప్రాంతం దండకారణ్యంలో భాగంగా ఉండేది. ఇక్కడ మహర్షుల ఆశ్రమాలు ఉండేవి. నిత్యం యజ్ఞయాగాదులు జరిగేవి. ఆ పరిసరాల్లోనే అశ్వత్థుడు, పిప్పలుడు అనే బ్రహ్మ రాక్షసులు నివసించేవారు. అశ్వత్థుడు రావిచెట్టు రూపంలోనూ పిప్పలుడు బ్రాహ్మణుడి రూపంలోనూ కనిపిస్తూ యజ్ఞయాగాలకు ఆటంకం కలిగించేవారు. అంతటితో ఆగకుండా, యాజ్ఞికులను చంపి తినేవారు. ఫలితంగా, బ్రాహ్మణ సంతతి అంతరించిపోసాగింది. అదంతా గ్రహదోష ఫలితమేనని భావించిన మహర్షులు శనీశ్వరుడిని ప్రార్థించి, రాక్షస కృత్యాలను నిరోధించాలని కోరారు. శనిదేవుడు ఆ బ్రహ్మ రాక్షసులిద్దరినీ ఒక్క దెబ్బతో సంహరించాడు. ఫలితంగా, శనీశ్వరుడిని బ్రహ్మహత్యా దోషం పట్టి పీడించసాగింది. దాన్ని నివారించుకోడానికి ఏం చేయాలో అర్థం కాలేదు. సాయం కోసం మహర్షుల్ని సంప్రదించాడు. పరమశివుడు మాత్రమే ఆ పాతకాన్ని పరిహరించగలడని చెప్పారు. దీంతో శనిదేవుడు మందపల్లిలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఒక్కసారి పట్టుకున్నాక వదిలే తత్వం కాదు శనిగ్రహానిది. అందుకే, మందగమనుడనీ, మందుడనీ పిలుస్తారు. మందుడు ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి, మందేశ్వరుడన్న పేరు వచ్చింది. క్షేత్రం చుట్టూ వెలసిన పల్లె మందపల్లిగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
మరో కథనం ప్రకారం...ఓసారి నారదుడికీ పరమశివుడికీ మధ్య శని గొప్పదనం విషయంలో ఓ చర్చ జరిగింది. అది కాస్తా ‘ఎవరు గొప్ప?’ అన్న వివాదంగా మారింది. ‘చేతనైతే నన్ను పీడించమను..’ అంటూ ఆవేశంగా సవాలు విసిరాడు శివుడు. ‘ఒక్క క్షణం అయినా శివుడిని పీడించి తీరతాను’ అంటూ నారదుడి ముందు ప్రతిజ్ఞ చేశాడు శని. దీంతో, ఆ గ్రహరాజుకు తన ఆనవాలు తెలియకుండా శివుడు కైలాసాన్ని వీడివచ్చి... మందపల్లిలో తలదాచుకున్నాడు. ‘దేవదేవుడివైన నువ్వు సామాన్యుడిలా దండకారణ్యం దాకా వచ్చావంటే, అదంతా నా ప్రభావం కాదంటావా స్వామీ?’ అంటూ శని పరమేశ్వరుడి పాదాల మీద పడ్డాడు. శివుడిని పీడించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా లింగాన్ని ప్రతిష్ఠించాడు.
నా వారము ఏ జనులైతే నియతవ్రతులై అశ్వత్ధవృఉక్షమునకు ప్రదక్షిణము చేయుదురో వారి కోరికలన్నియు నీరేడును. వారికి నా పీడ కలగదు. ఈ అశ్వత తీర్ధము ఈ శనైశ్చర తీర్ధములను ఎవరైతే స్నానము చేయుదురో వారు సమస్త కార్యములు తీర్ధములు నిర్విఘ్నముగా కొనసాగును. సనివారము రోజున అశ్వద్ధ ప్రదక్షిణములు చేసిన వార్కి గ్రహపీడ కలుగదు. ఈ తీర్ధమునందు స్నానదానము చేసిన హేమదాన ఫలము లభించును అని సని వరములను యిచ్చెను. అప్పటి నుండి ఈ ప్రదేసము నందు అష్వత్ధతీర్ధము, పిప్పళ తీర్ధము, సానుగ తీర్ధము, అగస్త్యతీర్ధము, సాత్రికతీర్ధము, యగ్నిక తీర్ధము, సాముగ తీర్ధము నొదలగుగా గల పదునాలుగువేల నూట ఎనిమిది తీర్ధములు అనేకమంది ఋషులచేతను, దేవతల చేతను, కల్పించబడి ప్రసిద్ధి చెందిన స్నాన జపపూజాదులను స్వల్ప భక్తజనులకు సమస్త కార్యసిద్ధులు చేకూర్చిన సతయాగ ఫలము లభింపచేయుచున్నవి.
శనిత్రయోదశి పూజ
శనిత్రయోదశి రోజుల్లో మందపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మందేశ్వర (శనేశ్వర) స్వామికి శని దోష పరిహారార్ధం ఆచరిస్తే శని వల్ల కలిగే సర్వదోషాలు నివారిస్తాయని స్కంధపురాణంలో చెప్పబడింది. కావున భక్తులు "శని" వలన కలిగే సర్వదోషాలు నివృత్తి కావాలని తైలాభిషేకం నిర్వహించి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనవి.
గమనిక : శని త్రయోదశి పర్వదినములలో తప్ప ప్రతిరోజు అభిషేకములు జరిపించుకొనే వేళలు ఆదివారం నుండి శుక్రవారం వరకు ఉదయం 5 గం॥ల నుండి మధ్యాహ్నం 12 గం॥ల వరకు శనివారం ఉదయం 4 గం॥ల నుండి మధ్యాహ్నం 12 గం॥ల వరకు అభిషేకములు జరుగును. తిరిగి సాయంత్రం 4 గం||ల నుండి రాత్రి 7 గం||ల వరకు దర్శనం మాత్రమే జరుగును.
Temple Timings:
> Sunday to Friday, Abhishekams, Darshan & Other Sevas: 5:00 AM to 12:00 PM
> On Saturdays: Abhishekams, Darshan & Other Sevas: 3:30 AM to 1:00 PM
> Only Darshan: 4:00 PM to 8:00 PM
Nearby Places:
> Sri Uma Bharmendra Swamy
> Sri Uma Nageswara Swamy
> Sri Venugopala Swamy
Temple Address:
The Assistant Commissioner & Executive Officer
Sri Mandeswara Swamy Vari Devastanam
MANDAPALLI- 533223,
Kothapeta Mandal,
East Godavari District, ( konaseema)
Andhra Pradesh.
Phone: 08855-243208
Distance from Various cities:
Kakinada : 75 Kms
Amalapuram : 31 Kms
Vijayawada : 140 Kms
Rajahmundry : 38 Kms
Related Postings:
> Daksharamam Temple Information
> Samarlakota Bheemeswara Swamy Temple Information
> Ryali Sri Jaganmohini Kesava Swamy Temple History
> Annavaram Temple History Telugu
> Somarama Temple Bhimavaram Information
Temple Timings:
> Sunday to Friday, Abhishekams, Darshan & Other Sevas: 5:00 AM to 12:00 PM
> On Saturdays: Abhishekams, Darshan & Other Sevas: 3:30 AM to 1:00 PM
> Only Darshan: 4:00 PM to 8:00 PM
Nearby Places:
> Sri Uma Bharmendra Swamy
> Sri Uma Nageswara Swamy
> Sri Venugopala Swamy
Temple Address:
The Assistant Commissioner & Executive Officer
Sri Mandeswara Swamy Vari Devastanam
MANDAPALLI- 533223,
Kothapeta Mandal,
East Godavari District, ( konaseema)
Andhra Pradesh.
Phone: 08855-243208
Distance from Various cities:
Kakinada : 75 Kms
Amalapuram : 31 Kms
Vijayawada : 140 Kms
Rajahmundry : 38 Kms
Related Postings:
> Daksharamam Temple Information
> Samarlakota Bheemeswara Swamy Temple Information
> Ryali Sri Jaganmohini Kesava Swamy Temple History
> Annavaram Temple History Telugu
> Somarama Temple Bhimavaram Information
Good information very useful
ReplyDelete