ఏలినాటి శని ప్రభావం ఏడున్నర ఏళ్లు వుంటుంది. ఏలినాటిని ఏడునాడు అని కూడా అంటారు. నాడు అంటే అర్ధభాగం అని అర్థం. జాతకచక్రంలో 12 రాశులుంటాయి.
గ్రహాలు ఆయా రాశుల్లో ప్రవేశించిన సమయంలో గ్రహ ప్రభావం ప్రారంభమవుతుంది. 12, 1, 2 స్థానాల్లో శని గ్రహం ప్రవేశిస్తుంది. ఒక్కోస్థానంలో శని రెండున్నర సంవత్సరాలు వుంటాడు. దీంతో మొత్తంగా ఏడున్నర సంవత్సరాలు శని వుంటాడని అర్థం.
శని పాపగ్రహం అందుకనే కష్టాలు కలుగుతాయి. ఈ గ్రహం మన రాశిలో వున్నప్పుడు ప్రాణభయం, ధనం లేకపోవడం, ఒక వేళ వచ్చినా వెళ్లిపోవడం, మంచిస్థానం నుంచి అధమస్థానానికి వెళ్లిపోవడం... తదితరాలు జరుగుతాయి. శని మన రాశిలో ప్రవేశించినా కొన్ని మంచిపనులు చేసేందుకు దోహదం చేస్తాడు. ఉదా. వివాహం, ఇంటి నిర్మాణం, ఉద్యోగం లాంటివి. అయితే వీటి వెనుక చాలా ఇబ్బందులు వుంటాయి. వివాహం జరిగితే చాలా ఖర్చవుతుంది. అలాగే ఇంటి నిర్మాణం పూర్తి చేయడమో లేక ఇంటిని కొనుగోలు చేస్తే అనంతరం ఆర్థిక వనరులకు కటకట ఏర్పడుతుంది.
ఒక ఉద్యోగి ఇంటిని కొనుగోలు చేస్తే అతడి నెల జీతం నుంచి నెలవారీగా వాయిదాలు కట్టవలసివుంటుంది. దీంతో జీతం తగ్గుతుంది. అందుకనే ఇల్లుకట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు. శనిప్రభావ తీవ్రత తగ్గించేందుకు పెద్దవాళ్లు అనేకమార్గాలు సూచించారు. విష్ణుసహస్రనామం, సుందరాకాండ పారాయణం, ఆదిత్యహృదయం, భగవంతుని ప్రార్థన చేయాల్సి వుంటుంది. దీంతో పాటు తీర్థయాత్రలు, వ్రతాలు చేయాలి.
ప్రతి శనివారం శనిదేవుడిని ఆరాధించడం, నవగ్రహాల్లో ఆయన విగ్రహం ముందు నువ్వులనూనెతో దీపం వెలిగించడం చేయాలి. పరమేశ్వరుని పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. పక్షులకు ఆహారం వేయాలి. ముఖ్యంగా కాకులకు ఆహారం పెడితే మంచిది. ఆవులకు ఆహారం వేయడంతో పాటు నల్ల చీమలకు చక్కెర వేయడం లాంటి కార్యాలతో శని ప్రభావాన్ని తగ్గించవచ్చు. యాచకులకు, వికలాంగులకు పెరుగన్నం పెడితే కూడా శని తీవ్రత తగ్గుతుందని పెద్దలు చెబుతారు. అన్నింటికన్నా మనస్సును స్థిరంగా, పవిత్రంగా వుంచుకొని ఆ పరమేశ్వరుని ఆరాధనలో వుంటే ఏ గ్రహ ప్రభావం మనపై పడదు.
నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ |
ఛాయామార్తండసంభూతం తం నమామి శనైశ్చరమ్ |
ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది. నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది.
క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార
వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ
ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ
కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ
శుద్ధబుద్ధి ప్రదాయనే
య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి
నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది. శని దోషం నుండి బయటపడేందుకు పైన ఉదహరించిన ''క్రోడం నీలాంజన ప్రఖ్యం..'' అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి, తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.
Famous Posts:
> మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా?
> భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ?
> వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.
> శివ గుణాలు లోకానికి సందేశాలు
> భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?
Tags: Elinati sani meaning in telugu, elinati sani, elinatisani, elinati sani telugu information, sani matrams, sani slokams, elinati sani history, sani graha matram, hindu temples guide, ఏలినాటి శని
Tags
interesting facts