List of Astadasa Puranalu in Telugu | 18 puranas in telugu

అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడు కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి

పురాణం లక్షణాలు
ప్రతి పురాణం కుడా పురాణాల ముఖ్యమైన లక్షణాలను మొదటి సర్గలలో చెబుతుంది. కూర్మపురాణంలో చెప్పబడిన పురాణ ఉపోద్ఘాతము ప్రకారం


సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ
వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం

సర్గము, ప్రతి సర్గము, వంశము, మన్వంతరము, వంశాలచరిత్ర అనే పంచలక్షణాలు కలిగినదే పురాణం.

సర్గము - సర్వ ప్రపంచ సృష్టిని విస్తరించేది
ప్రతి సర్గము - సకల ప్రపంచము లయమయ్యే లక్షణం తెలిపేది (ప్రళయం)
వంశము - పృథు, ప్రియ వ్రతాదుల వంశోత్పత్తిని వివరించుట
మన్వంతరము - ఏ కల్పంలో ఏ మనువు కాలంలో ఏమి జరిగిందో తెలుపుట
వంశాలచరిత్ర


భాగవతంలో పురాణ లక్షణాలు పది చెప్పబడ్డాయి


సర్గోప్యశ్చ విసర్గశ్చ వృత్తి రక్షాంతరాణి చ

వంశో వంశానుచరితం సంస్థాహేతు రపాశ్రయ
దశభిర్లక్షణైర్యుక్తం పురాణం తద్విదో విదు:

అనగా సర్గము (సృష్టి), ప్రతిసర్గము (ప్రళయము), వృత్తి (వ్యాపారము), రక్షా (పరిపాలవ), అంతరము (మన్వాదుల కాలము), వంశము (వంశాదుల విషయము), వంశానుచరితము (సూర్య, చంద్ర వంశస్థుల కథనాలు), సంస్థా (స్థితి), హేతువు (కారణము), అపాశ్రయము (ఆశ్రయ విషయాలు) అనే పదీ పురాణ లక్షణాలు. కొంతమంది ఇలా పది లక్షణాలున్నవి మహాపురాణాలని, ఐదు లక్షణాలున్నవి పురాణాలని వర్గీకరిస్తున్నారు.

పురాణాల విభజన :
పురాణాల పేర్లు చెప్పే శ్లోకం
సత్రయాగం జరుగుచున్నప్పుడు అష్టాదశపురాణాలను తెలుపుతూ సూతుడు ఋషులకు చెప్పిన శ్లోకం. భాగవత పురాణము ప్రధమ స్కందము లో చెప్పబడింది.


మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం
అనాపద్లింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్

పైన చెప్పిన వాటిలో:

"మ" ద్వయం -- మత్స్య పురాణం, మార్కండేయ పురాణం
"భ" ద్వయం -- భాగవత పురాణం, భవిష్య పురాణం
"బ్ర" త్రయం -- బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం
"వ" చతుష్టయం -- విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం
మిగిలిన వాటి పేర్ల మొదటి అక్షరాలు మాత్రమే తీసుకుని శ్లోకపాదం కూర్చటం జరిగింది:

అ -- అగ్ని పురాణం
నా -- నారద పురాణం
పద్ -- పద్మ పురాణం
లిం -- లింగ పురాణం
గ -- గరుడ పురాణం
కూ -- కూర్మ పురాణం
స్కా -- స్కాంద పురాణం





















credits: telugu wikipedia
Hindu Temples Guide Articles :

>> Arunachalam Temple Information

>> Varanasi Temple Information

>> Kanchipuram Temple Guide

>> Madurai Temple Details

>> Free Devotional eBooks Download
astadasa puranalu , puranalu information in telugu, telugu puranalu, hindu temple information, temple details,kanchipuram , kachipuram, puranalu , puranam, purana , puranas ,

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS