Sri Vaishno Devi Shakti Peeth Information | Route Map Temple History Travel Information Accommodation

vaishnavi devi shakti peetham


మేము అమర్నాథ్ యాత్ర లో భాగంగా వైష్ణవి దేవి ఆలయానికి కూడా వెళ్లడం జరిగింది. కాట్రా లో నాకు మొదటి ఆశ్చర్యాన్ని కలిగించింది అక్కడ వాతావరణం రాత్రి 7 అవుతున్న అక్కడ చీకటి పడలేదు. వైష్ణవి దేవి దర్శనానికి నడిచి వెళ్లి నడిచి రాగలిగితే అమర్నాథ్ కొండ ఎక్కి రాగలరని చెప్పడం తో నడక మార్గం లో వెళ్లి వచ్చాను. నడిచి వెళ్లి రావడం చాల కష్టం. వైష్ణవి దేవి కొండ సముద్ర మట్టానికి 5200 అడుగుల ఎత్తులో ఉంది , 15 కిమీ నడక అని చెబుతారు కానీ కొండకదా మనకు చాల కిమీ నడిచినట్టే ఉంటుంది.  మాకు ఆక్సిజన్ సమస్య ఏమి రాలేదు. మాలో కొందరు రాత్రి బయలు దేరారు నడవలేము అనుకునే వారు గుర్రాలు పై వెళ్ళవచ్చు ,  డోలి లు కూడా ఉన్నాయి. 
గుర్రాలు :
ఇక్కడ గుఱ్ఱాలు కోసం చెప్పుకోవాలి , ఇక్కడ గుఱ్ఱాలు చాల బలిష్టంగా ఉంటాయి. నిలువుగా ఉండే కొండను ఏమాత్రం లెక్క చేయకుండా చాల సులువుగా ఎక్కుతున్నాయి. అమర్నాథ్ లో గుర్రాలూ వీటి అంత బలిష్ఠమైనవి కావు, అమర్నాథ్ కొండను సులువుగానే ఎక్కవచ్చు అనిపించింది. ఇక్కడ గుర్రాలకు 2000 రూపాయలు తీసుకున్నారు . 
హెలికాప్టర్
కాట్రా  నుండి సంఝిచాట్ లేదా వైస్ వెర్సా వరకు వన్-వే హెలికాప్టర్ టిక్కెట్ ధర INR 1700 నుండి 2500 . కత్రా నుండి సంఝిచాట్‌కు టూ-వే హెలికాప్టర్ టిక్కెట్‌కి ఒక్కొక్కరికి INR 3000-3400.

బ్యాటరీ కార్ :
కాట్రా నడక మార్గం లో సగం వచ్చిన తరువాత adhkuwari  వద్ద బ్యాటరీ కార్ లు ఉంటాయి. మనం ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. టికెట్ ధర 500/-, adhkuwari వద్ద నుంచే కాస్త నడవడానికి మార్గం బాగుటుంది. 

తిరుమల కాదు :
తిరుమలను టీటీడీ వారు చాల అభివృద్ధి చేశారు , మనం నడక మార్గం లో చాల సులువుగా కొండ ఎక్కవచ్చు. ఇక్కడ నడక మార్గం బాగోదు అంత రాళ్లతో ఉంటుంది నిజంగా  కొండ ఎక్కుతున్నట్టే ఉంటుంది. అక్కడక్కడా మెట్లు ఉన్నాయి కానీ ఆ మెట్లు ఎక్కడం కంటే చుట్టూ నడిచి రావడమే సులువు అనిపిస్తుంది. నేనైతే దిగేటప్పుడు సులువు అనుకున్నాను దిగేటప్పుడు ఇంకా కష్టం గా అనిపించింది. అక్కడ వారు కనీసం ఇంకా ఎన్ని కిలో మీటర్లు ఉందో బోర్డులు  కూడా పెట్టలేదు. 

గుర్తు పెట్టుకోండి ఈ టికెట్స్ రెండు నెలల ముందే విడుదల చేస్తారు. 

అష్టాదశ శక్తిపీఠాల్లో  15 వ శక్తిపీఠం శ్రీ వైష్ణవీదేవి శక్తిపీఠం. శ్రీ వైష్ణవీదేవి ఆలయం జమ్మూనగరంకు 60 కి. మీ దూరంలో ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శేణిలో ఉంది. 
katra vaishnavi dei temple
Katra Vaishnavi Temple

పఠాన్ కోట్ నుంచి రైలు సౌకర్యం ఉంది. జంబూ అన్న పదము కాలక్రమంలో జమ్ముగా మారినది. జమ్మూ నుంచి కత్రా కు 13 కి .మీ కాలినడకన ప్రయాణించి శ్రీ వైష్ణవి దేవి గుడికి వెళ్ళవచ్చు.


వైష్ణవీదేవి ఆలయ ప్రాముఖ్యత:
ఇక్కడ సతీదేవి పుర్రె (శిరస్సు ) పడిన ప్రదేశంగా చెపుతుంటారు. అమ్మ పుఱ్ఱె పడిన శక్తిపీఠము కనుక జ్ఞాన క్షేత్రం అని కూడా అంటారు. వైష్ణో దేవి గురించిన మొదటి ప్రస్తావన మహాభారతంలో ఉంది. కురుపాండవ సంగ్రామంనకు ముందు శ్రీకృష్ణుని ఆదేశానుసారం అర్జునుడు ఇక్కడ అమ్మవారిని పూజించి, ఆమె దీవెనలు తీసుకున్నాడని వ్యాసభారతం చెపుతోంది. "జంబూకటక చైత్యేషు నిత్యం సన్నిహితాలయే" అనే శ్లోకం ఆధారంతో ఈ దేవస్థానంలోనే అర్జునుడు పూజలు చేసాడని తెలుస్తుంది.. ఇక్కడ అమ్మవారిని మహాకాళీ,మహాలక్ష్మి,మహాసరస్వతి రూపంలో భక్తులు పూజిస్తారు. 
దర్శనం :
దర్శనం చాల బాగా జరిగింది, తోపులాట ఏమి లేదు, ఒక గుహలోకి వెళ్లి దర్శనం చేసుకోవాలి. మీరు పైన ఫోటో చేశారు కదా ఆలా చిన్న విగ్రహాలు 3 ఉంటాయి. మనకు పెద్ద పెద్ద విగ్రహాలు చూడ్డం అలవాటు కదా. ఆ గుహ లోపల ఎదో శక్తి ఉందని అనుభూతి తప్పకుండా కలుగుతుంది. 

ఇక్కడ చూడవలసిన ఆలయాలు :

కొండపైన కాలభైరవ స్వామి ఆలయం ఉంది, మేము అప్పటికే నడిచి ఉన్నాము ఇక పైకి వెళ్లే ఓపిక లేదు, నేను పైకి వెళ్ళలేదు. ఇక్కడ రోప్ వే సౌకర్యం ఉంది. మేము వెళ్లిన రోజు అది రిపేర్ లో ఉంది. మనం టికెట్ ఆన్ లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు టికెట్ ధర 100. 
కాట్రా వైష్ణవి దేవి టెంపుల్ వెబ్ సైట్ ఇందులో మీరు ముందుగా రిజిస్టర్ పాస్ తీసుకోవాలి 

Helicopter , batter car , Rope Way Booking Website : https://online.maavaishnodevi.org/

ఇవి చదివారా ?
Shankari Devi Temple శంఖరి శక్తిపీఠం
Kamakshi Amman Temple కాంచీపురం కామాక్షి అమ్మవారు
Jwalamukhi Temple
Chamundeshwari Temple శ్రీ చాముండేశ్వరి అమ్మవారి శక్తి పీఠం
Jogulamba Devi శ్రీ జోగులాంబ శక్తి పీఠం
Bhramaramba Mallikarjuna Temple భ్రమరాంబదేవి శక్తిపీఠం
Mahalakshmi Temple శ్రీ మహాలక్ష్మి దేవి శక్తిపీఠం
Ekveera Temple శ్రీ ఏకావీరాదేవి శక్తి పీఠం
Mahakaleswar Temple శ్రీ మహాకాళిదేవి శక్తిపీఠం
Kukkuteswara Swamy Temple శ్రీ పురుహూతికాదేవి శక్తిపీఠం
Biraja Temple శ్రీ గిరిజా దేవీ శక్తి పీఠం
Bhimeswara Temple శ్రీ మాణిక్యాంబదేవి శక్తిపీఠం
Kamakhya Temple శ్రీ కామఖ్యదేవి శక్తిపీఠం
Alopi Devi Mandir శ్రీ మాధవేశ్వరీ దేవీ శక్తీ పీఠం
Jwalamukhi Temple
Mangla Gauri Temple శ్రీ మంగళ గౌరీ మహాశక్తీ పీఠం
Vishalakshi Temple విశాలాక్షిదేవి శక్తిపీఠం
Sharada Peeth శ్రీ సరస్వతీ దేవి శక్తిపీఠం
శ్రీ వైష్ణవీదేవి శక్తిపీఠం
శ్రీ నైనాదేవి శక్తిపీఠం
శ్రీ కుమారి దేవి శక్తిపీఠం
శ్రీ భ్రామరి దేవి శక్తిపీఠం
jothirlingas జ్యోతిర్లింగాలు

Sri Vaishno Devi Temple Timings:
Morning : 5 am to 12 pm
Evening : 4 pm to 8 pm

Vaishno Devi Temple address:
Katra, District Reasi. Jammu & Kashmir Pin Code - 182301 Toll Free Number - 18001807212 , 9906019494


Related Postings :



http://www.hindutemplesguide.com/2016/11/sri-manikyamba-shakthi-peeth.html

http://www.hindutemplesguide.com/2015/07/kanchipuram-temple-guide.html


http://www.hindutemplesguide.com/2016/10/sri-madhaveshwari-shakti-peeth-prayaga.html

http://www.hindutemplesguide.com/2016/10/mangala-gauri-sakthi-peeth-information.html
vaishnodevi templedetails,vaishno devi temple information, jwalamukhi temple information in telugu, famous temples in jwalamukhi,history of vaishnodevi temple, vaishnodevi temple pdf file,18sakthipeeth,sakthipeetalu, shakthipeetalu information in telugu.shakti peeth information in telugu.Sri Vaishno Devi Shakti Peeth Information in telugu.       

4 Comments

  1. Jwali mukhi temple is different from Vishnovi Devi temple . Jwali Mukhi Temple is on the way to Delhousi from Pathan kota is in Himachal Pradesh. Chinta Purnima temple is also on the way to Delhousi HP. Where as Vishnovi Devi temple is in J&K its governed by J&K, Deputy Chief Executive Officer, In-Charge Operations Wing, Office of the Chief Executive Officer, Shri Mata Vaishno Devi Shrine Board, Katra District Reasi J&K, PIN – 182301. There may be small temple at Jwala Mukhi, But the Prasadham of Vaishnovi Devi Temple is avoided to take Chinta Purnmi as the prasadma turns in to non-edible when it reaches, Chinta Purnima.

    ReplyDelete
  2. Intaku shaktipeeth ekkada
    Katra vaishodevi na
    Leka jwalamuki temple himachal Pradesh
    Please Tell me

    ReplyDelete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS