ఈ ఆలయ ప్రాముఖ్యత:
పురాణాల ప్రకారం ఇక్కడ అమ్మవారి వేళ్ళు పడిన స్థలం గా అంటుంటారు. ఈ క్షేత్రంలో విగ్రహారాధన లేదు. యంత్రం మీద ఒక ఊయల ఉంటుంది. వాటికే పూజలు చేస్తుంటారు. శ్రీహరి పాదాల చెంత పుట్టిన గంగానది నీరు స్వచ్ఛంగా ఉంటుంది. యమునా నది యముని పుత్రిక. గంగా,యమునా,కలిసే ఈ క్షేత్రం మాధవ క్షేత్రంగా పేరు పొందబడింది. కావున ఇక్కడి అమ్మవారినే మాధవేశ్వరి దేవిగా పూజిస్తారు. ఈ అమ్మవారినే మాధవేశ్వరి అలోపీ మాతా,అలోపీ శాంకరీ అని పిలుస్తారు. ఇక్కడికి వచ్చిన భక్తులు సంగమ స్నానం చేసి తమ తలనీలాలు సంగమ తీర్థంలో సమర్పిస్తుంటారు. పూర్వం బ్రహ్మదేవుడు ఈ త్రివేణి సంగమ క్షేత్రం లో అనేక యజ్ఞలు చేసాడు. కనుక ఈ చోటును ప్రయాగ అంటారు. "ప్ర" అనగా గొప్ప అని "యా" అనగా యాగము అని అర్ధం. ఇక్కడి పితృదేవతలకి ఆబ్దికాది కార్యక్రమాలు చేస్తారు. ఈ క్షేత్రానికి అమృతతీర్ధం అని పేరు ఉంది. ఇక్కడి అమ్మవారిని మోహిని స్వరూపంగా కొలుస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కుంభమేళాను నిర్వహించడం జరుగుతుంది.
ఇక్కడ చూడవలసిన ఆలయాలు:
ఇక్కడకు 3 కి మీ దూరంలో గంగా,యమునా,సరస్వతి నదుల త్రివేణి సంగమ క్షేత్రం ఉంది. మూడు నదులు వ్యక్తిగతంగా ఉంటాయి. అందువల్ల ఇది చాలా పవిత్రమైన ప్రదేశం. సరస్వతీ నది ఇక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. సమీపంలోనే హనుమాన్ మందిరం, అంతస్తులుగల కంచివారి మఠం, ఇంక అనేక ఆలయాలు ఉన్నాయి. ప్రయాగ క్షేత్రంలో వటవృక్షం ఉంది. దీనినే అక్షయ వటం అని కూడా అందురు. ఈ వృక్షమును, విష్ణుమూర్తి గొడుగుగా భక్తులు భావిస్తారు. ఇక్కడ అలహాబాద్ ఫోర్ట్, త్రివేణీసంగమం, జవహర్ ప్లానిటరియం వంటివి చూడదగినవి. అలాహాబాద్ కి దగ్గరలో బస్టేషన్,ఎయిర్పోర్ట్ సౌకర్యం ఉంది.
Madhaveswari Devi Temple Timings:
Morning: 5 am to 12 pm
Evening: 4 pm to 9 pm.
Temple Address:
Alopi Bagh,
Allahabad,
Uttar Pradesh 211006.
18 Shakti Peeth Information :
> Sri Jogalamba Shakti Peeth Information
> Mangala Gowri Shakti Peeth
> Ujjain Mahakali Shakti Peeth
> Shankari Devi Shakti Peeth Srilanka
madhaveswaridevi temple information,alopi matha temple details,alopi sankhari temple details,madhaveswari devi temple information in telugu,famous temples in allahabad,thrivenisangamam information,18 sakthipeetas, sakthipeetalu, madhave swari devi temple, madhaveswaridevi temple pdf file ,history of madhaveswaridevi temple,pragaya madhaveswari devi temple information and temple timings, allahabad alopi devi temple information,alopi mandir details.
Nepal Muktinath Kashi Yatra
ReplyDelete+91-9198595775