About Tirumala Tirupathi 16 Points

Tirumala Tirupathi Devasthanam Enquiry Phone Numbers :  08772277777, 08772233333, 18004254141

1. తిరుమల ఆలయాన్ని ఇప్పడివరకు 3 సార్లు పునఃనిర్మించారు. 
2. మొదటి సారి దేవశిల్పి విశ్వకర్మ నిర్మిస్తే రెండవసారి తొండమాన్ చక్రవర్తి, మూడవసారి ఎందరో రాజులు నిర్మించారు. క్రి.శ  614 లో పల్లవరాణి సామవై కాలంలో ఆనందనిలయం జీర్ణోద్దారణ కావించబడింది.   
3. శ్రీ కృష్ణ దేవరాయలు ఐదవ సారి తిరుమల వచ్చినప్పుడు తన విగ్రహాలను ఆలయం లో ప్రతిష్టించుకున్నారు , బంగారంతో ఆనంద నిలయానికి పూత పూయించారు.
4. 1870 వరకు తిరుమల చేరుకోడానికి మెట్లమార్గం ఉండేది కాదు, కొండలను దాటుతూ కొండపైకి చేరుకోడానికి రెండు రోజులు సమయం కూడా పట్టేదట. 
5. స్వామి వారికీ సుప్రభాత సేవ ఉదయం 7 గంటలకు, ఏకాంత సేవ 10.30 గంటలకు ఉండేది. అప్పట్లో పూజారులు ఉండేందుకు పైగా వసతి ఉండేది కాదు. 


6. మొదట్లో కొండపైన స్వామి వారి దేవాలయం, ఒక మఠం తప్పితే ఎవరు, ఏ నివాసం ఉండేది కాదు. రాత్రి పూట ఉండేందుకు సహచించేవారు కాదు. 200 జనాభా తో ఒక గ్రామం లో ఏర్పరిచారు. నెమ్మది నెమ్మదిగా జనాభా తక్కువ కాలం లోనే  జనాభా పెరగడంతో వారిని కాలి చేయించి తిరుపతి పంపించారు. 
7. 1944 లో మొట్టమొదటిగా అలిపిరి నుంచి తిరుమలకు ఘాట్ రోడ్డు పూర్తి చేసారు. తిరుపతి నుంచి తిరుమలకు రెండు బస్సు లు నడిపేవారు అవి రోజుకి మూడుసార్లు మాత్రమే తిరిగేవి. రాత్రి 7 గంటలకు చివరి బస్సు కొండపైకి వెళ్ళేది. 
8. తిరుమలలో విమాన వేంకటేశ్వర స్వామి వారిని ఆరాధించి వ్యాస తీర్థులు మోక్షం పొందారని ప్రతీతి. అందుకే మనం కూడా విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తాం. 
9. తిరుమలలో ఉన్న శిలాతోరణం డైనోసార్ లా  కంటే కూడా పూర్వం నుంచి ఉన్నవి.

10. ప్రతిదేవాలయం లో ఉన్నట్టు వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందు వినాయకుడు కనిపించడు. 
11. సుప్రభాత, అంగప్రదిక్షణ వంటి సేవలకు 12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు.
12. తిరుమలలో శుక్రవారం నాడు అంగప్రదిక్షణ ఉండదు. 
13. తిరుమల శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం రచించింది అణ్ణన్ స్వామి రచించారు. ఈయన కాంచీపురం లో జన్మించారు. 
14. స్వామి వారికీ నైవేద్యం గా పగిలిన కొత్త మట్టికుండలో వెన్నమీగడలు కలిపిన అన్నాన్ని సమర్పిస్తారు. 
15. తిరుమల లడ్డు పూర్వం ఉండేది కాదు 1940 నుంచే లడ్డు తయారీ మొదలైంది. దూరప్రాంత వాసులు ఇంటికి ప్రసాదం తీస్కుని వెళ్ళడానికి వీలుగా తయారు చేశారు. 
16. ఏ అవతారం లో లేని విధంగా పాములను ఆభరణంగా వేంకటేశ్వరుడు కలిగి ఉంటాడు. 
tirumala tirupathi history, tirumala laddu, tirumala sri venkateswara swamy statue, temple information in telugu, temple history, 

4 Comments

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS