Korukonda Lakshmi Narasimha Swamy Temple

Korukonda Lakshmi Narasimha Swamy Temple
కోరుకొండ లక్ష్మీనారసింహస్వామి ఆలయం.. ఈ ఆలయం రాజానగరానికి సుమారు 14 కి. మీ. దూరంలోను రాజమండ్రికి 20 కిమీ దూరంలోను కలదు. ఎతైన కొండపైన స్వామి కొలువు తీరి వున్నారు. కోరుకొండ అని పేరురావడానికి కొండపైన కోరుకున్న కోరికలు తీరుతాయాని కోరుకొండ అని పేరుచ్చిందని కధనం. స్వామి వారి గర్భాలయంలో లక్ష్మీనారసింహస్వామి కొలువు తీరి వుంటారు. అయితే అదే గర్భాలయంలో దక్షిణ ముఖంగా కేవలం అడుగు ఎత్తున ఏక శిలా ఆలయం వుంటుంది ఈ ఆలయాన్ని దేవతలు నిర్మించారని స్వామి ఆలయం సహా స్వయం భూః గా వెలిశారని అర్చక స్వామి వివరించారు. 



ఈ ఆలయంలో స్వామిని ఒంగొని చూడాలి. అంత చిన్న రాతి ఆలయంలో స్వామి వారి విగ్రహాన్ని.. ఆయన తొడపై ఆశీనురాలైన లక్ష్మీ దేవిని ఎలా ఏర్పాటు చేశారు అనేది నిజంగా అద్భుతమే. ఈ ఆలయానికి రెండు వైపులా శంఖు చక్రాలు ద్వారపాలకులుగా చెక్కారు.

పైగా స్వామి ఆలయం సహా స్వయం భూః కాబట్టి దేవతల చేత నిర్మితమైన ఆలయంగా దీనిని చెబుతున్నారు.
ఇంత ఎత్తైన కొండపైకి శిలల్ని తరలించడం ఆశ్చర్యమే.
ఇక ఈ ఆలయం చేరుకోవాలంటే 360 కి పైగా మెట్లు ఎక్కి రావాలి. అతి చిన్న మెట్లు అవి.

ఆలయంలో మరో పక్క లక్ష్మీదేవి ఆలయం వుంటుంది.
అలయం చుట్టూ శిల్పాలు అబ్బుర పరుస్తాయి. జీవ కళతో అలరారుతుంటాయి. 
కళాభిమానులు తప్పకుండా చూడాల్సిన ఆలయం కోరుకొండ లక్ష్మీనారసింహుని ఆలయం
కొండ దిగువున స్వామి వారిని ప్రతిష్టించారు. కొండ ఎక్కలేని వారు స్వామిని దర్శించుకునే వీలు కల్పించారు.
దేవస్థానం అన్నదాన కమిటీ ఇక్కడ భక్తులకు అన్న ప్రసాదాలు అందిస్తున్నారు.

కోరుకొండ ఆలయంలో శిల్పా కళా వైభవానికి ఇదొక మచ్చుతునక..




రామ రావణ యుద్ద ఘట్టం కళ్లకు కట్టినట్టు చెక్కారు ఆనాటి శిల్పులు రాముడు, దశకంఠుడు రథాలపై వచ్చి , ధనుస్సులు ఎక్కుపెట్టి శరపరంపర కురిపించిన ఘట్టాన్ని కడు రమ్యంగా చెక్కారు రాముడు, రావణుడు వేసిన బాణాలు వారి మధ్య ప్రయాణిస్తున్న తీరును.. రాముని బాణాల తాకిడికి నేల రాలిన రావణుని శరస్సులు ఈ శిల్పంలో చూడొచ్చు ఇలాంటి ఎన్నో ఘట్టాలు ఇక్కడి గోడపై దర్శనమిస్తాయి

-- సరిదే నాగ్
నోట్ : నచ్చితే షేర్ చేయండి.. కాపీ మాత్రం చేయొద్దు
Click here :
Famous temples in East Godavari
Famous Hill Temples

korukonda lakshmi narasimha swamy temple,famous temples near by rajahmundry, famous temples in east godavari, old narasimha swamy temples , famous narasimha swamy temples, andrapradesh temples, korukonda lakhsmi narasimha swamy temple timings. 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS