Chilkur Visa Balaji Temple Information

చిలుకూరు బాలాజీ స్వామి వారి స్థలపురాణం ఒకలా ఉంటే ... ప్రస్తుతం ఇక్కడ స్వామి వారు వీసాల దేవుడు గా భక్తులు పిలుచుకుంటారు. ఈ ఆలయం లో స్వామి వారికీ మొక్కుకుంటే వీసా తప్పకుండా వస్తుందని భక్తుల నమ్మకం . ఇక్కడ ఆలయం లో భక్తులు  9 సార్లు ప్రదిక్షణం చేసి స్వామి వారికి తమ కోరికను చెప్పుకుంటారు. ఆ కోరిక తీరగానే తిరిగి వచ్చి 108 సార్లు ప్రదిక్షణ చేస్తారు.  నేను వెళ్ళినప్పుడు చాల మంది ప్రదిక్షణలు చేస్తున్నారు. 

మైకు లో ఎవరో భక్తులకు సూచనలు చేస్తున్నారు.. భక్తులు పరుగు పందెం లో గెలవడానికి పరుగెత్తున్నట్టు ప్రదిక్షణలు చేస్తున్నారు.. ఎంట్రన్స్ టికెట్ ఏమి లేదు .. సెల్ ఫోన్ పెట్టుకోవడానికి మాత్రం 5/- తీస్కున్నారు. లోపల హోండి కూడా లేదు.. ఎక్కువ మంది ప్రదిక్షణం లో ఉండటం వల్ల దర్శనం చేస్కోవడానికి త్వరగానే లోపాలకి వెళ్ళగలిగాను. స్వామి వారి దర్శనం చాల బాగా జరిగింది. నాకు వెళ్ళినప్పుడు తెలియదు 9 సార్లు ప్రదిక్షణం చేసి కోరిక కోరుకోవాలని .. ఎలా తెల్సింది అనేగా . దర్శనం చేస్కుని వస్తుంటే నాకు చిలుకూరు తిరుగుబాటు అనే పుస్తకం ఇచ్చారు. 20/- ఇచ్చాను. ఇంకోకటి అదే పుస్తకం ఇచ్చారు . ఇది ఫ్రీ గానే మీ స్నేహితులకు ఇవ్వండి అన్నారు. 
బుక్ చేతిలో పెట్టుకుని ప్రక్కనే కూర్చున్నారు .. దర్శనానికి జనం ఎక్కువగా లేరు , అందరు ప్రదిక్షణం చేసే పనిలో ఉన్నారు .. నాకు మరోమారు దర్శనం చేస్కోవాలి అనిపించింది. 

స్వామి వారి దగ్గరకు వచ్చాను నమస్కారం చేస్కున్నాను .. నాకు ఇంకా చూడాలని ఉంది ఎందుకో వేల్లబుద్ది కావడం లేదు .. నా ముందు వారికీ పూజారి గారు తీర్ధం ఇచ్చారు .. నావంతు వచ్చింది .. నేను చెయ్యి చాసాను .. మీరు ఉండండి లోపలికి వెళ్లి తీర్ధం తీస్కుని వస్తాను అని ఆయన లోపలికి వెళ్లి వచ్చారు. స్వామి వారు నా కోరిక ప్రదిక్షణలు చెయ్యకుండానే తీర్చారు . 
స్థలపురాణం :
భక్తులు కోరికలను తీర్చడానికి భగవంతుడే దిగి వచ్చిన క్షేత్రమే ఈ చిలుకూరు . గుణాల మాధవరెడ్డి ఒక రైతు చిలుకూరు ప్రాంతం లో వ్యవసాయం చేస్కుంటూ పంట చేతికి రాగానే, తిరుపతి వెళ్ళి స్వామి వారిని దర్శనం చేస్కుని స్వామి వారికీ కళ్యాణోత్సవం జరిపించేవాడు. అలా ప్రతిసంవత్సరం జరిపిస్తూ ఉండేవాడు... కాలం గడిచేకొద్దీ వయస్సు కూడా పెరుగుతుంది కదా .. ఈ సంవత్సరం ఇక స్వామి వారి దర్శనానికి వెళ్ళలేను .. స్వామి వారికీ కళ్యాణోత్సవం జరిపించలేను అని దిగులు చెందసాగాడు. రోజురోజుకి స్వామి వారిని తలుసుకుని ఈ జన్మకు స్వామి వారిని చూడలేను అని చాల బాధపడేవాడు. 
ఒక రోజు రాత్రి తెల్లవారు జామున స్వామి వారు కలలో ... 
శ్రీదేవి, భూదేవులతో సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చి ..  స్వామి వారు ఇలా అన్నారు .. నువ్వు తిరుపతి రావడం కోసం నీవింక ఆయాసపడనక్కరలేదు. నీ కోసం నేనే ఇక్కడకు వచ్చేశాను. నీ చేలో ఒక శివలింగం ఉంది చూడు! ఆ లింగానికి దక్షిణంవైపున ఒక పాముపుట్ట భూమి అడుగున నేను ఉన్నాను. అని చెప్పెను .
మరునాడు ఉదయం స్వామి వారు చెప్పినట్టుగా శివునికి ఎదురుగా వెదికి ఒక పొదలో పుట్ట కనిపించగానే తన మనుషులతో వచ్చి గడ్డపారతో తవ్వాడు. గడ్డపారకు రక్తపు మరకలు కనిపించడంతో బిత్తరపోయిన మాధవరెడ్డి పాలతో పుట్టను కరిగించాడు. పుట్ట కరిగిపోయి ఏకశిలతో వేంకటేశ్వరుడు, అలివేలు మంగమ్మ, పద్మావతి విగ్రహం కనిపించింది. స్వామి మూల విరాట్టుకు ఎడమ కన్ను పై భాగం, ఛాతీ దగ్గర గడ్డపారతో గాయమైన గుర్తులు నేటికి కనిపిస్తాయి. 

Chilukuri Balaji Temple Address:
Chilkur Balaji Temple, 
Moinabad Mandal, 
Ranga Reddy District, 
Chilkur, 
Telangana 501504

Phone: 099850 74965
Related Temples :
వివాహం కావాలంటే ఈ ఆలయాన్ని దర్శించండి 
You Will Get Marry Soon if you visit these temples

Famous Lord Vishnu Temples

Devotes Reviews Taken From Google :
"You can offer the items required for the temple, not money. Things such as Milk ( Tetra pack),Peanuts, Chikpees, Saffron,  Urad dal, Oil,Any dal etc can be given in the temple. They use it for the God as part of Prasadam, other requirements.


The archana is offered twice to the lord every day. Once in Morning and in evening ( 6.30 PM). After darshan, devotees are allowed to go to the nearest darshan ( the Room next to the lord). On Friday special pooja is performed and Haldi ( Turmeric) used in the puja is given to the women devotee in evening."  - Vamsi Krishna
108 rounds will take min 2 hours. Easy queue for Darshan. No special entrance, no VIP queues and no Hundi either. 
Splendid spiritual place. No entry fee of any kind at the time of writing this.
Secure locker for electronic devices provided at a charge of INR 5 as no photographic device allowed inside. Make sure you collect your receipt while locking items.

Small temple with shade around. Mineral water is sold inside the temple campus by hawkers. - Gnanas 

Chilkur Balaji temple is famously known as Visa Balaji temple.If you have any desire to be fulfilled,then pray the lord for it wholeheartedly and perform 11 pradakshinas (rounding). Then after your wish will be fulfilled and you have to perform 108 pradakshinas.

 Another important feature of the temple is that there is no Hundi in the temple  and every devotee is treated equally.   - Sree Charan
click here : Chilukuri balaji Temple Google Map

Chilkur balaji temple history in telugu, chilkur balaji temple timings, how to reach chilkur balaji temple, chilkur balaji temple google map, visa god, visa god hydrabad, chilkur bajaji temple timings, chilkur balaji contact number, famous temples in telangana, surrounding famous temples in hyd,

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS