శ్రీరంగం 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటి, కావేరి నది రెండుగా చీలగా కావేరి నది మధ్య ప్రదేశం లో ఉన్న క్షేత్రమే శ్రీరంగం. ఒకసారి ఈ క్రింది ఫోటో చూడండి. ఎత్తైన గోపురాలు మనకి అక్కడో పవిత్ర పుణ్యక్షేత్రం ఉందని.. మనల్ని ఆ గోపురాలు అయస్కాంతం లా లాగితే.. స్వామి వారు తన పాద పద్మములవైపు మనస్సును లాగుతారు. చుట్టూ పచ్చటి వాతావరణం .. చూడ్డానికి రెండు కళ్ళు సరిపోనట్టి ఎత్తైన గోపురాలు.. స్వామి వారి తేజస్సు.. ఉభయ కావేరి నది.. శ్రీరంగం నుంచి వదిలి రావాలంటే మనస్సు ఒప్పుకోదు.
Sriranganadha Temple is located in Srirangam State of Tamilandu. 9 km From Tirucharapalli Junction ( Tiruchi ).
ఈ క్షేత్రం ఎలా వేళ్ళలో కాస్త వివరంగా చెప్తే బాగుణ్ణు అనుకుంటున్నారా? చెన్నై నుంచి 330 కిమీ దూరం లో ఉంది, దగ్గర్లో రైల్వే స్టేషన్ తిరుచనాపల్లి. మీరు తిరుచనాపల్లి వచ్చేస్తే అక్కడ నుంచి సుమారు 7కిమీ.
ఈ క్షేత్రం ఎలా వేళ్ళలో కాస్త వివరంగా చెప్తే బాగుణ్ణు అనుకుంటున్నారా? చెన్నై నుంచి 330 కిమీ దూరం లో ఉంది, దగ్గర్లో రైల్వే స్టేషన్ తిరుచనాపల్లి. మీరు తిరుచనాపల్లి వచ్చేస్తే అక్కడ నుంచి సుమారు 7కిమీ.
How to Reach Srirangam Temple ( Tamilandu )?
7 km form Trichy , 330 km from Chennai,
మీరు చెన్నై నుంచి బయలు దేరితే తిరుచ్చి కంటే ముందే శ్రీరంగం స్టేషన్ వస్తుంది. తిరుచ్చి పెద్ద స్టేషన్ మీరు ఎక్కిన ట్రైన్ శ్రీరంగం లో ఆగుతుందో లేదో ముందే తెల్సుకోండి. సాదారణంగా అన్ని ట్రైన్ లు ఆగుతాయి.
కాని ఇక్కడ చాల తక్కువ సమయం ఆగుతాయి. మీరు ఫ్యామిలీ తో మరియు ఎక్కువ సామాన్లతో ఉంటే కనుక కంగారు లేకుండా తిరుచ్చి లోనే దిగండి.
7 km form Trichy , 330 km from Chennai,
మీరు చెన్నై నుంచి బయలు దేరితే తిరుచ్చి కంటే ముందే శ్రీరంగం స్టేషన్ వస్తుంది. తిరుచ్చి పెద్ద స్టేషన్ మీరు ఎక్కిన ట్రైన్ శ్రీరంగం లో ఆగుతుందో లేదో ముందే తెల్సుకోండి. సాదారణంగా అన్ని ట్రైన్ లు ఆగుతాయి.
కాని ఇక్కడ చాల తక్కువ సమయం ఆగుతాయి. మీరు ఫ్యామిలీ తో మరియు ఎక్కువ సామాన్లతో ఉంటే కనుక కంగారు లేకుండా తిరుచ్చి లోనే దిగండి.
Sriraganm Railway Station Code ( IRCTC ): SGRM
ఈ ఫోటో చూడగానే నేను చెప్పింది నిజమే అనిపిస్తుందా.. చాల చాల అందంగా ఉంటుంది .. ఈ బ్రిడ్జి అటువైపు శ్రీరంగం.
అవును మనం శ్రీరంగం రైల్వే స్టేషన్ లోనే ఉన్నాం.
మీరు గమనించారా ? ఏమిటి గమనించేది అనేగా . మరో సారి చూడండి. శ్రీరంగ నాదుడిని ఇక్కడే దర్శనం చేయిస్తున్నారు వీళ్ళు . చూసారా?
నాకు తెల్సండి.. డబ్బులు డ్రా చెయ్యాల .. ఇదిగో ATM .. స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేశారు. ఆ ... అర్ధమైంది .. స్టేషన్ నుంచి ఎలా వెళ్ళేది. ఎంతదూరం అనేగా? సుమారు 1 కిమీ ఉంటుంది. ఆటో కావాలో లేదా నాతో నడిచి వస్తారో మీ ఇష్టం.
స్టేషన్ నుంచి బయటకు వచ్చి .. కుడివైపు అదేనండి రైట్ సైడ్ తిరిగితే మనకు ఈ బోర్డు కనిపిస్తుంది. మనకు దైర్యం వస్తుంది. సరైన రూట్ లోనే వెళ్తున్నాం అని.
ఈ రోడ్డు మీదకి వచ్చిన తరువాత .. ఇప్పుడు ఎలా వెళ్ళాలి.. ఎవరినైనా అడుగుదామా అని ,అటు ఇటు చూస్తుంటే .. ఆ చిన్న మొక్క చాటునుంచి ఎత్తైన గోపురం కొద్దిగా కనిపిస్తుంది. ఒక్కసారిగా మనస్సులో ఏదో తెలియని ఫీలింగ్.. ఎస్ ఎస్ .. నేను చూడబోతున్నాను. 239 ( 73 meters High 13- tiered) అడుగుల ఎత్తైన గోపురాన్ని నేను దగ్గర నుంచి చూడబోతున్నాను అని.. ముందుకి కదులుతాం .
ఏవండోయ్ .. కాస్త చూస్కోండి .. మెయిన్ రోడ్ కదా .. గోపురాన్ని చూస్కుంటూ నడిస్తే ఎలా .. మీతో వచ్చినవాళ్లు వస్తున్నారా .. వెనకాల .. చూడండి ఒకసారి.
ఆ గోపురాన్ని చూస్తుంటే మనకు తెలియకుండానే అందంతో ఒళ్ళు పులకరిస్తుంది. అబ్బ మనవాళ్ళు ఏమి కట్టారు. ఇది మనవాళ్ళ గొప్పతనం. ఇది నా దేశం... ఈ కట్టడాలకు వారసులం మనమంతా.. మన కట్టడాలను మన దేవాలయను పడకొట్టి.. నాలుగు కాసులను సంచులో వేస్కుని పోయినవాళ్ళ కోసం10 మార్కుల ప్రశ్నలు కంటస్తాం చేస్తాం.కాని వీటికోసం తెల్సుకోవడం చదువుకోవడం ముసలివాళ్ళ పని అని పక్కన పాడేశం ..
నడుస్తున్న కొద్ది దూరం దూరంగా వెళ్తుంది ఆ గోపురం. గోపురమే అలా వెళ్తుంటే . . ఇంకా నా స్వామి శ్రీరంగ నాధుడు ఎక్కడ ఉన్నాడో .
తమిళనాడు బస్సు లు అవి.. జంబుకేశ్వరం శ్రీరంగం నుంచి 1 కిమీ దూరం లోనే ఉంది. ఫోటో దగ్గర నుంచి తీస్కుందామని వస్తే ఇలానే ఉంటుంది. సగం సగమే పడుతుంది.
శ్రీరంగం గోపురం ఆసియాలో పెద్ద గోపురాల్లో ఒకటి, దీని ఎత్తు 239 అడుగులు , 156 ఎకరాల విస్తీర్ణం లో నిర్మించారు..
మనకు వరుసగా గోపురాలు కనిపిస్తుంటాయ్ ..
ఆ గోపురం తరువాతే గుడి ...
అనుకుంటూ .. నడుస్తూంటే . .. గోపురాలు వస్తూనే ఉంటాయి.
గోపురాలు చుట్టూ వీధులన్నీ .. షాప్ లతో నిండి ఉంటాయి.. ముందు దేవుడు కదా .. వచ్చేటప్పుడు వీటికోసం చూద్దాం :)
నేను కూడా ఈయన దగ్గర కొబ్బరికాయ కొన్నాను .. ఆ పువ్వులు తీస్కున్నాను .. కొబ్బరి కాయ మనలా వీళ్ళు కొట్టరు .
ఆ కనిపించేదే చివరిది ... లోపలికి వచ్చేయండి ..
అందరు ఒక్కసారిగా గోవింద .. గోవింద .. శ్రీరంగనాద .. గోవింద అంటూ రండి
అర్ధమైంది అండి ... దర్శనం టికెట్స్ ఎక్కడ తీస్కోవాలి .. టికెట్స్ కంటే ముందు చేతిలోనే బ్యాగ్ .. చెప్పులు వీటిని ఎక్కడ పెట్టాలి అనేగా.. చెప్పులు ఆ ప్రక్కనే కుడివైపు ఇచ్చుకుంటున్నారు చూడండి .. బ్యాగ్ లు లోపలికి వెళ్ళగానే ఎడమ చేతివైపు ఉంటుంది , 5 రూపాయలు తీస్కుని ఉంచుతారు. సెల్ ఫోన్ లోపలికి తీస్కుని వెళ్ళవచ్చును.
లోపలికి వచ్చాం కదా .. ఇంకా ఈ షాప్ లు ఏమిటి అనుకుంటే ఎలా .. 126 ఎకరాలు ..
మన అదృష్టం కొద్ది ఇంగ్లీష్ లో బోర్డు లు కూడా పెట్టారు..
Aruanachalam To Srirangam :
అరుణాచలం నుంచి శ్రీరంగం సుమారు 190 కిలోమీటర్లు దూరం. అరుణాచలం నుంచి శ్రీరంగం వెళ్ళడానికి విల్లుపురం మీదగా శ్రీరంగం చేరుకోవచ్చును, శ్రీరంగం లో ఉండటానికి దేవాలయం వారి రూమ్స్ ఉన్నాయి. శ్రీరంగం ఆలయం వెబ్సైటు క్రింద ఇచ్చాను వారి సైట్ చూడండి.
Accommodation in Srirangam Temple:
Srirangam Temple Website : http://srirangam.org/
Click Here for Accmmodation : http://srirangam.org/user/login.php?pid=2
"While we stayed at Sri Rangam Devasthanam Cottages;Sri Rangam; Tamilnadu. A very beautiful accommodation by Endowment accommodation and its rent is very normal. Thanks to Sri Jayalalitha"
- Mohan Reddy
తరువాతి పోస్ట్ లో శ్రీరంగ నాధుడు శ్రీరంగం లో ఎలా వెలిశాడు.. శ్రీలంక వైపు శ్రీ రంగనాధుడు ఎందుకు చూస్తున్నాడు.. తెలుగు భాగవతాన్ని శ్రీరంగం లో ఎక్కడ చూడవచ్చు వాటికోసం తెల్సుకుందాం.
Srirangam Near by Famous Temples:
ఈ క్రింది వాటిపై క్లిక్ చెయ్యడం ద్వార మీరు ఆయా క్షేత్ర విశేషాలు తెల్సుకోవచ్చును.
Keywords: Telugu Travel blog, Temple Information in telugu, Srirangam Temple Information in Telugu, Srirangam Temple Details, accommodation in sri rangam temple, srirangam surrounding temples information,
Tags
108 divya stalam
favorite
G1
Lord Vishnu
South India Temples
Srirangam
Tamil Nadu
Vishnu Temples
I need your guid I am staying in Hyderabad
ReplyDeleteI have a plan to cover Arunachlam, Srirangam, Janbulingam, chidambaram, madhurai & rameswaram
how to plan
my mail ID - akella69@gmail.com
Pl. support me
25-11-2016 sabarimala journy ofter i have plan to rameswaram,kanyakumari ext...how to plan
ReplyDeletefrom pamba you can take kerala rtc bus to Palani. 6 to 7 hrs journey. From then you can reach madhurai thereafter rameshwaram. We saw like this in previous year
DeleteThe information is very useful while visiting these marvelous temples.
ReplyDeleteThe information is very useful while visiting these marvelous temples.
ReplyDeleteThe information is very useful while visiting these marvelous temples.
ReplyDeleteI have plan to Arunachalam temple...how to plan
teluguvaallaku veeluga vuntundaa?
ReplyDeleteనాకు బంగారు బల్లి మరుయు వెండి బల్లి ఉన్న ఊరు మరియు గుడి, అక్కడికి ఎలా వేళ్ళలో చెప్పండి.
ReplyDeletekanchipuram lo untundi... meeru site lo kanchipuram ani search cheyandi information vastundi
Deleteరాజచంద్ర గారూ
ReplyDeleteశ్రీరంగంలో మరి కొన్నాళ్ళు గడపాలి అనుకుంటున్న నాలాంటి వారికి కావలసిన, పనికొచ్చే సమాచారం ఇంత వివరంగా అందజేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
శుభం
రంగనాథ్
Wonderfull
ReplyDeleteయాత్రీకులకు బహు ఉపయుక్తమైన సమాచారాన్ని ఎంతో వివరంగా అందజేస్తున్నందుకు ధన్యవాదాలు.
ReplyDeleteచాలా బాగుంది మీ వివరణ. ధన్యవాదాలు.
ReplyDeleteచాలా ఉపయుక్తమయిన సమాచారము సర్,చాలా సంతోషం జమ్బుకేశ్వరాలయం
ReplyDeleteగురించి కూడా ఇందులో ఉంటుందేమో నని చూసాను,కాని చాలా క్లుప్తంగా వుంది
Can I get itenary for all these places
ReplyDeleteVery nice information it is useful to everyone thank you very much sir
ReplyDeletenice...…………….. good...……...thank you
ReplyDeleteVery nice it is useful to me thank you sir
ReplyDeleteVery valued information
ReplyDeleteఆన్న మేము శ్రీరంగం to chidmbaram to రోజుల్లో అవుతుందా మల్లి మేము విశాఖప్నం వెళ్ళాలి మల్లి మేము ఎక్కడనుంచి ఏకడదనికి వెళ్లడానికి అవుతుందో కాస్త చెప్ప గలరా
ReplyDeleteశ్రీరంగం లో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుపగలరు 🙏🙏
ReplyDelete