Surrounding Temples Madurai | Top 10 Places Near by Madurai

 Famous Places Near by Madurai

మదురై మీనాక్ష్మి అమ్మవారి దర్శనం అయినతరువాత ఇంకా మదురై చుట్టుప్రక్కల చూడాల్సిన క్షేత్రాలు ఇతర చూడదగిన ప్రదేశాల కోసం ఈ పోస్ట్ లో మనం చూద్దాం. మీకు ఆయా ప్లేస్ ల కోసం పూర్తీ సమాచారం కావాలంటే ఫోటో పైన కానీ హెడ్డింగ్ పైన కానీ క్లిక్ చేస్తే మీకు ఆవివరాలు ఓపెన్ అవుతాయి.  
1) Rameswaram
 rameshwaram information
రామేశ్వరం విశిష్టిత కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎందుకంటే మనందరికీ కాశి - రామేశ్వరం పేర్లు చిన్నప్పటి నుంచి పరిచయమే. ఐన చెప్తాను :) , రామేశ్వరం జ్యోతిర్లింగ క్షేత్రం ఈ ఆలయం లో ఏమేమి చూడాలి, కాశి రామేశ్వరం యాత్ర అంటే ఏమిటి ? స్పటిక లింగం దర్శనం ఎలా చేస్కోవాలి ? అక్కడ వసతి, చుట్టుప్రక్కల చూడాల్సిన క్షేత్ర విశేషాలు రాయడం జరిగింది. ఫోటో పై క్లిక్ చేస్తే తెలుస్తాయి. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది రామేశ్వరం మదురై కి ఎంత దూరం లో ఉంది అని ? మదురై నుంచి రామేశ్వరం సుమారు 120 కిమీ దూరం అంటే 3-4 గంటల ప్రయాణం ట్రైన్ సదుపాయం ఉన్నప్పటికీ ఎక్కువగా ట్రైన్స్ ఉండవు, మీరు ముందుగా ప్లాన్ చేసుకుంటే పర్వాలేదు కానీ అప్పడికప్పడైతే బస్సు లో వెళ్లడం ఉత్తమం.
http://www.hindutemplesguide.com/search?q=Pazhamudircholai
ఆ పేరు చూసి లేదా ఫోటో చూసి మీకు ఏమైనా అర్థమైందా ? ఇంతకముందు విన్నవారికి కాదండి కొత్తగా వెళ్లేవారిని అడుగుతున్నా ? పళముదిర్చొళై లో ఉన్నది సుబ్రహ్మణ్యుడు.. పంచారామ క్షేత్రాలు, పంచభూత లింగ క్షేత్రాలు ఎలా ఉన్నాయో  అలానే తమిళనాడులో సుబ్రహ్మణ్యుడి ఆరుపడైవీడు క్షేత్రాలు ఉన్నాయి. చాల శక్తి వంతమైన క్షేత్రాలవి.  ఇవి మొత్తం ఆరు క్షేత్రాలు, మదురై కి 10 - 20 దూరం లో ఈ క్షేత్రాలున్నాయి. పైనే చెప్పానుగా మీకు పూర్తీ సమాచారం కావాలంటే ఫోటో పై క్లిక్ చేయమని. క్రింద తిరుప్పరకుండ్రం  క్షేత్రం కూడా ఆరుపడైవీడు లోని క్షేత్రమే
From Madurai to Pazhamudircholai 23 km , Pazhamudiracholai temple is one of the six adobes of the lord Subramanya.


 Thiruparankundram

It's very near to Madurai, From Madurai to Thirupankundram 10 km distance . Thiruparankundram also one of the six abodes of lord Subramanya  temples.

4) Madurai Maharaja Bhavan  - 
Thirumalai Nayakar Mahal
తిరుమలై నాయకర్ మహల్ ఇది దేవాలయం కాదండీ.. టెంపుల్ గైడ్ అని ఇది ఎందుకు పెట్టావ్ అని అడగకండి.. చుట్టూ అన్ని చూద్దామనేవారికోసం మీరు క్రింద పళని కోసం పోస్ట్ చేశాను మీరు అవి చూడండి. మీనాక్షి అమ్మవారి ఆలయానికి సుమారు 2 కిమీ దూరం లో ఈ నాయకర్ మహల్ ఉంది చాల అందంగా ఉంటుంది. చాల మూవీస్ లో కూడా చూసేఉండిఉంటారు. సాయంత్రం సమయం లైట్ షో లు కూడా వేస్తారు. నేను వెళ్ళినప్పుడు చూడలేకపోయాను, రెండు కిమీ లే కాబట్టి ఆటో లో ఈజీ గా వెళ్లవచ్చని మీరు గ్రహించే ఉండి ఉంటారు.
Thirumalai Nayakkar Mahal 
Visit Timings : 9 am to 5 pm ( 1-1.30 break ) 
Show Timings : 6.45 pm to 7.35 pm in English  & 8 pm to 8.50 pm in Tamil
5) Palani Murugan Temple

మనం పైన చెప్పుకున్న ఆరుపడైవీడు క్షేత్రాలలో మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రం పళని, ఇక్కడ స్వామి వారిని దండపాణి అని కొలుస్తారు. మదురై లోని ఆరుపడైవీడు జంక్షన్ నుంచి బస్సులుంటాయి. సుమారు 120 కిమీ దూరం లో కలదు. చూస్తున్నారుగా కొండపైన స్వామి వారు కొలువైఉంటారు. నడిచి వెళ్లలేని వారికీ రోప్ వే , చిన్న ట్రైన్ రూట్ కూడా కొండపైకి ఉన్నాయి సరదాగా సాగుతుంది ఆలా ఎక్కడం.. వివరాలకు పళని ఫోటో పై క్లిక్ చేసి చూడండి. 
Very Famous temple in Tamilanadu, From Madurai to Phalani it takes 3 to 4 hrs journey . Buses are available form arupadai veedu junction in Madurai. 
మదురై కి దగ్గర్లో గల మరోక ముఖ్యమైన క్షేత్రం శ్రీరంగం. 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో మొదటిగా చెప్తారు.  ఈ క్షేత్రం చేరుకోడానికి ట్రైన్ లో 2 గంటల సమయం పడుతుంది. భూలోకవైకుంఠంగా పిలుస్తారు. ఉభయ కావేరి నదులమధ్య క్షేత్రం కలదు. ఎత్తైన గోపురాలతో 150 ఎకరాల విస్తీర్ణం లో ఈ ఆలయం ఉంది. భారతదేశం లో ఎత్తైన గోపురాలలో ఈ ఆలయ గోపురం 2వ స్థానము లో ఉంది. మొదటిది కర్ణాటక లోని మురుడేశ్వర ఆలయ గోపురం. శ్రీరంగానికి దగ్గర్లోనే 1 కిమీ దూరం లోనే జంబుకేశ్వరం కలదు ఇక్కడ జలలింగముంది. అక్కడివారు Thiruvanaikoil అని పిలుస్తారు.
From Madurai to Srirangam it itakes 2hrs by train.

7) Kodaikanal

Kodaikanal to Madurai Distance : 115km
8) Tiruchendur
ఆరుపడైవీడు క్షేత్రాలలో ఐదు క్షేత్రాలు కొండపైనుంటే తిరుచెందూర్ లో మాత్రం సముద్రపు ఒడ్డునుంటుంది. ఈ ఆలయ నిర్మాణ సమయం లో జరిగిన అద్భుతాలను కధలుగా చెప్పుకుంటారు. ఒకసారి ఏకంగా స్వామి వారినే దొంగలించి సముద్రం దాటించే  ప్రయత్నం చేసి విఫలమై సముద్రం లో విడిచిపెడతారు.. ఈ క్షేత్రం మదురై కి 180 కిమీ దూరం లోను, కన్యా కుమారికి 90 కిమీ దూరంలోను  ఉంది. మీరు రవాణా కోసం ఇబ్బంది పడనవసరం లేదు మదురై నుంచి అన్ని ప్లేస్ లకు ట్రైన్ మరియు బస్సు లు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. నిద్రించని సిటీ అని మదురై కి పేరు.
9) Kanyakumari
మనదేశం లో పర్యాటక ప్రాంతాలలో కన్యాకుమారి కూడా ఒకటి , కన్యాకుమారి లో జరిగే సూర్యోదయాన్ని చూడ్డానికి అందరు ఇష్టపడతారు, ముఖ్యంగా పౌర్ణ మి రోజు రాత్రి పూ ట ఏకకాలంలో జ రిగే సూర్యా స్తమ యం, చంద్రో దయాలను చూ సి పులకించని యాత్రికుడుండడేమో. త్రివేణి సంగమ క్షేత్రం… కన్యాకుమారిలో బంగాళాఖాతం, మరోవైపు అరేబియా మహాసముద్రం, దిగువన హిందూ మహాసముద్రం.. వీక్షకుల్ని పరవశింపజేస్తుం టాయి. సముద్రతీర ప్రకృతి రమణీ యతతో అలరారే కన్యాకుమారి సముద్ర తీరంలోని థోరియం ధాతువుతో కూడిన ఇసుక రేణు వులు పరమేశ్వరుడి అద్భుత శక్తికి ఆనవాళ్లుగా చెబుతుంటా రు. అలాగే వారణాసి పరమశివు డికి నివాస స్థలమైనట్లుగా, కన్యా కుమారి పార్వతిదేవికి నివాస స్థలమని స్థానికుల ప్రగాఢ విశ్వా సం. మూడు మహాసముద్రాల నీరు పార్వతీమాత పాదాలను కడుగుతున్నట్లుగా ఉంటుందని భక్తులు నమ్ముతుంటారు
Kanyakumari to Madurai Distance : 245km

108 వైష్ణవ క్షేత్రాల్లో శ్రీవిల్లిపుత్తూర్ ఆండాళ్ ఆలయం కూడా ఒకటి, మనం తమిళనాడు చిహ్నం లో కనిపించే గోపురం ఈ ఆలయానిదే. మదురై కి 74 కిమీదూరం లో ఈ ఆలయం ఉంది. ఇక్కడ విష్ణుమూర్తిని వటపత్రశాయి గా పూజలు అందుకుంటున్నాడు.ఈ దివ్యదేశమునకు 20 కి.మీ దూరములో కాట్టళగర్ సన్నిధి, 5 కి.మీ దూరములో శ్రీనివాసన్ సన్నిధి, 24 కి.మీ దూరములో తిరుత్తణ్‌గాల్ క్షేత్రము ఉన్నాయి. మిధునమాస ఉత్సవములో 5వ రోజు ఉదయం రంగమన్నార్, వటపత్రశాయి, కాట్టళగర్, శ్రీనివాసన్, తణ్‌గలప్పన్ వేంచేయగా పెరియాళ్వార్లు మంగళాశాసనం చేయుదురు. 
తెలుసుకున్నారుగా .. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయగలరు. మీ స్నేహితులకు షేర్ చేయగలరు. 


madurai surrounding temples,10 Best Places to Visit in Madurai,10 Best Places to Visit in Madurai,6 Must-Visit Places In Madurai,Places to Visit in Madurai,8 Top Attractions and Places to Visit in Madurai

11 Comments

  1. thank you for sharing

    ReplyDelete
  2. Excellent.Superb.Please release a book for all trips

    ReplyDelete
  3. సూపర్ ఇన్ఫర్మేషన్.

    ReplyDelete
  4. Thank you very much and I personally appreciate.long live.

    ReplyDelete
  5. Please include alagar perumal temple (near palamudhirchozai)a koodal alagar temple (near bus stand).

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
  8. please allow me to copy valualable telugu text from this page or this website to msword

    ReplyDelete
  9. Hai sir miru chala information esthunaru nenu eendhilo three places chusanu Madurai Amma temple,thirumalai nayakar mall,thirupurakundram temple really superb places

    ReplyDelete
  10. మదురై 2 టైమ్స్ వెళ్ళాను కానీ మీరు పెట్టిన టెంపుల్స్ కి వెళ్ళలేక పోయాను. ఈసారి తప్పకుండా వెళ్తాను. మంచి విషయాలు గ్రూపులో పెడుతున్నందుకు మీకు ధన్యవాదములు

    ReplyDelete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS