మే నెలలో పుట్టిన వారి ఫలితాలు
మే నెలలో పుట్టిన స్త్రీ పురుషులకందరికీ ఈ ఫలితములు వర్తిస్తాయి. వీరికి త్యాగబుద్ధి ఎక్కువ. ప్రయాణాల మీద అభిరుచి, క్రొత్త ప్రదేశాలు చూడాలన్న కోరిక ఉంటుంది. పార్టీలు చేసుకోవడం అంటే వీరికి సరదా. వీరికి ఉదారబుద్ధి ఎక్కువ. ఓర్పు కూడా చాలా ఎక్కువ. అందరినీ ప్రేమిస్తారు. ఇతరులచే ప్రేమించబడతారు. వీరికి ఉన్న శక్తిని ధారపోస్తారు. మానసికంగా, శారీరకంగా త్యాగ బుద్ధి ఉంటుంది. చివరికి వీరు ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారు.
అందరితో స్నేహభావంగా ప్రేమగా ఉంటారు. స్నేహితులకు పార్టీలు ఇస్తారు. ఖర్చు చేస్తారు. తృప్తి పడతారు. ఎన్నో విందులు చేసే గృహాలు ఏర్పాట్లు చేస్తారు. ఆహారమునకు ప్రాముఖ్యత నిస్తారు. అవసరం అయితే మంచివంటలు స్వయంగా తయారు చేసుకోగలరు.
ఇంటిని పరిశుభ్రంగా, అందంగా, కళాత్మకంగా అలంకరించు కొంటారు. వీరిలో మంచి కళాకారులు కూడా ఉన్నారు. వీరికి శృంగార వాంచ ఎక్కువ. నమ్మిన వారికి, వారు ఇష్టపడ్డవారికి ప్రాణాలు ఇస్తారు.
న్యాయంగా ధర్మంగా పోరాటంచేస్తారు. అందువల్ల చివరికి వీరు ఓటమిని అంగీకరించవలసిన అవసరాలు రావచ్చును.
వీరిలో చాలామందికి చిన్న వయస్సులోనే వివాహం అవుతుంది. వీరి ప్రేమ విఫలం అవుతుంది. ఉద్యోగస్టులు, ఆఫీసర్లు, కళాకారులు ఉన్నారు. మరియు వీరిలో మంచి ప్రజాసేవకులు కూడా ఉన్నారు. మంచిస్థాయిలో, గౌరవ స్థానంలో ఉంటారు. ఈ నెలలో పుట్టినవారు మంచి పేరు, గౌరవం సంపాదించు కొంటారు. ఆరోగ్యము: ఈనెలలో పుట్టినవారికి కిడ్నీ వ్యాధులు, రక్తపోటు సంబంధించిన వ్యాధులు రావచ్చును.
ధనము: వీరికి ధనము సంపాదించాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది. సంపాదిస్తారు. అనుభవిస్తారు.
లక్కీ వారములు: మంగళవారము, శుక్రవారములు మంచి అదృష్టాన్ని ఇస్తాయి.
లక్కీ కలర్ దుస్తులు: బ్లూరంగు, రోజ్కలర్ దుస్తులు మంచివి.
లక్కీ స్టోన్స్: ముత్యము లేదా డైమండ్ ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది.
Related Posts:
> జనవరి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది
> ఫిబ్రవరి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .
> మార్చి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .
> ఏప్రిల్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .
> మే నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .
> జూన్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .
> జూలై నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.
> ఆగస్టు నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.
> సెప్టెంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.
> అక్టోబరు నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.
> నవంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.
> డిసెంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.
anu
may, may month horoscope , may month man character, may month birth chat