మీ ఇంటి నిర్మాణంలో ఈ తప్పులు ఎప్పటికీ చేయకండి...!
మనలో చాలా మందికి సొంతింటి కల ఉంటుంది. సొంత ఇల్లు గురించి ఏవేవో ఊహించుకుంటూ ఉంటాం. కొత్త ఇంటిని కొనేందుకు లేదా నిర్మాణం చేసే సమయంలో చిన్న చిన్న విషయాల్లో రాజీ పడకూడదు. అలా చేస్తే మీరు ఊహించుకున్న సొంతింటి కల నిజం కాకుండా సమస్యలెదురయ్యే ప్రమాదం ఉంది.
కాబట్టి మీరు ఏ చిన్న ఇల్లు కట్టాలన్నా ఏ విషయంలోనూ రాజీ పడొద్దు. అలా కాంప్రమైజ్ కాకుండా ఉండాల్సిన విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
Also Read : లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే శుక్రవారం నాడు ఇవి పాటిస్తే చాలు.
శాస్త్రీయ విషయాల్లో..
మీరు కొత్తగా ఇల్లు నిర్మించే సమయంలో లేదా కొత్త ఇంటిని కొనే సమయంలో వాస్తుశాస్త్ర నిపుణులను.. ఇంజనీర్ యొక్క సలహాలను కచ్చితంగా తీసుకోవాలి. వారు చెప్పే విషయాల్లో శాస్త్రీయ విషయాలను అస్సలు కాంప్రమైజ్ కాకూడదు. ఒక్కసారి కట్టిన ఇల్లు దాని ఆయుఃప్రమాణం పూర్తయ్యే వరకు వెనక్కి తిరిగి చూడకుండా జాగ్రత్తగా నిర్మించుకోవాలి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కాకుండా, సొంత నిర్ణయాలు తీసుకుంటే మొదటికే మోసం రావొచ్చు.
ప్రహరీ గోడకు..
మీ ఇంటి చుట్టూ కట్టే ప్రహరీ గోడకు మరియు కాంపౌండ్ వాల్ కు టచ్ చేస్తూ ఎలాంటి కట్టడాలు చేయకూడదు. ముఖ్యంగా మెట్లను ప్రహరీ గోడకు టచ్ చేస్తూ కట్టకూడదు. కొందరు ఇంటి గోడలకు ఆనుకి బాత్రూమ్ లేదా పనివారికి చిన్న రూమ్ వంటివి నిర్మించి ఇవ్వడమో లేదా జంతువులకు పెంపుడు గదిని కడుతూ ఉంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయకూడదట. మెట్ల కూడా బాత్ రూమ్ లేదా స్టోర్ రూమ్ కూడా కట్టకూడదంట.
ఈశాన్యంలో బరువు వద్దు..
మీరు కట్టే లేదా కట్టిన ఇంట్లో ఈశాన్యంలో బరువైన వస్తువులు ఉంచడం లేదా వేయడం వంటివి కూడా వాస్తు శాస్త్రం ప్రకారం చాలా పెద్ద తప్పు. అలాగే మీ ఇంట్లో ఉండే పైపులైన్ నైరుతి నుండి బయటకు వెళ్లకుండా చూడాలి. మీ ఇంట్లో నుండి వెళ్లే నీరు తూర్పు లేదా ఉత్తరం వైపు దిశల నుండి బయటకు వెళ్లడం ఉత్తమం. పడమర లేదా దక్షిణ వైపు వెళ్లకూడదు.
తల్లిదండ్రుల స్థానం..
ఈశాన్యం గదిలో దంపతులకు బెడ్ రూమ్ ఏర్పాటు అస్సలు చేయకూడదు. మీరు ఏదైనా అపార్ట్ మెంట్ లేదా ఏదైనా పెద్ద బిల్డింగ్ కట్టే సమయంలో తల్లిదండ్రులను ఎప్పటికీ గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంచాలి. ఇక పెద్ద కొడుకు మొదటి అంతస్తులో, రెండో రెండో అంతస్తులో, మూడో కొడుకు మూడో అంతస్తులో ఉండాలి. ఇదే పద్ధతిని కొనసాగించాలి.
ప్రధాన ద్వారం..
మీ ఇంటి ప్రధాన ద్వారం లోపలి వైపు ద్వారంపై గోమాత సమేత భోజపత్ర యంత్ర సహిత ఐశ్వర్యకాళీ అమ్మవారి పాదుకల పటం ఉండటం సర్వత్రా శ్రేయస్కరం. ఈ అమ్మవారి పటానికి పూజ నియమాలు ప్రత్యేకంగా ఉంటాయి. అలాగే ఇంటికి ఒకే దిక్కున మూడు ద్వారాలు ఉండకూడదు.
ఆవులు, దూడలు వస్తే..
మీ ఇంటి నిర్మాణం జరుగుతున్నప్పుడు, అటువైపుగా ఆవులు, దూడలు వస్తే నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో వాటికి గ్రాసం, తాగడానికి నీళ్లు ఏర్పాటు చేస్తే మంచిది. గోవులు మూత్రం, పేడ వేసే వరకు అక్కడే ఉంచుకోవడం చాలా మంచిది. వీలైతే అవి కనీసం ఒకరోజు అక్కడే ఉండేలా చూసుకోవాలి.
ఈ మాసాలలో..
హిందూ పంచాంగం ప్రకారం, ఛైత్రం, జ్యేష్ఠం, ఆషాఢం, భాద్రపద, ఆశ్వీయుజ, మార్గశిర, పుష్య మాసాలలో ఎట్టి పరిస్థితుల్లో ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించకూడదు. కేవలం వైశాఖం, శ్రావణం, కార్తీకం, మాఘ, ఫాల్గుణ మాసాల్లో ప్రారంభిస్తే శుభప్రదంగా ఉంటుంది. ఇతర మాసాల్లో ప్రారంభిస్తే, ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.
Also Read : ఈ మూడు విషయాలు పాటిస్తే.. పట్టిందల్లా బంగారమే
అన్ని దిశలు..
మీ ఇంటి నిర్మాణం ప్రారంభించే సమయంలో పడమర, దక్షిణం, తూర్పు, ఉత్తర దిశలలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పడమర, దక్షిణం వైపు దిశలు ఎత్తుగా ఉండాలి.. తూర్పు, ఉత్తరం వైపు పల్లంగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఈశాన్యం ఎత్తుగా ఉండి.. నైరుతి పల్లంగా ఉంటే అది పెద్ద దోషంగా పరిగణించబడుతుంది.
Famous Posts:
> కూతురా కోడలా ఎవరు ప్రధానం...?
> సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?
> కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?
> మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి
> సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం
> మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.
> భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?
perfect vastu for home, vastu for home entrance, vastu tips for house, south facing house vastu, vastu for home kitchen, vastu for home in telugu, vastu direction for house, vastu shastra tips, house opening