రాశికొక జ్యోతిర్లింగం..ఏ రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించాలి | jyotirlingas are connected to zodiac signs - 12 jyotirlingas

రాశికొక జ్యోతిర్లింగం..ఏ రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించాలి

ప్రతి మనిషీ ఏదో ఒక గ్రహ, రాశి ప్రభావంతో భూమిపై పుడతాడు. ఈ సృష్టిలో గ్రహాలు 12. రాశులు 12 అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కనుక మనుషులను 12 రకాలుగా విభజించవచ్చు. జ్యోతిషం చెప్పే ద్వాదశ రాశులను అజమాయిషీ చేసే జ్యోతిర్లింగాలు కూడా 12. కనుక ఒక్కొక్క రాశికి ఒక్కొక్క శివుడు ఉన్నాడు. మీరాశి ప్రకారం ఏ శివ రూపం ఆరాధిస్తే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుందో తెలుసుకుందాం..

మేషరాశి:

వారికి పూజనీయమైన జ్యోతిర్లింగం రామేశ్వరం. మేషరాశి కుజునికి స్వగృహం. చరరాశి వారికి పదకొండవ రాశ్యాధిపతి శని బాధకుడు. గ్రహపీడా నివారణార్థం రామేశ్వర తీర్థ యాత్ర, సుత్రామ పర్ణీ జరరాషి యోగే, నిబధ్య సెతుం విశిఖైర సంఖ్యె శ్రీరామ చంద్రేన సమర్పితం త, రామేశ్వరాఖ్యం నియతం నమామి అనె శ్లోకం రోజూ చదువుకొవాలి. శ్రీరామచంద్రుడు శని బాధానివారణార్థం రామేశ్వర లింగాన్ని స్థాపించాడని ప్రతీతి.

వృషభరాశి:

వారి పూజాలింగం సోమనాథ జ్యోతిర్లింగం. ఈ రాశి శుక్రునికి స్వగృహం, చంద్రునికి ఉచ్ఛ రాశి. సోమనాథ జ్యోతిర్లింగం శ్రీకృష్ణుడు స్థాపించిన మహాలింగం. ఈ రాశివారు శనిదోష శాంతికి సోమనాథ దేవాలయ దర్శనం, సౌరాష్ట్ర దేశే విదేశేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావసంతం, భక్తి ప్రాదానాయ క్రుపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే అనే శ్లోకధ్యానం చేయడం శుభప్రదం. ఈ రాశివారు జన్మ నక్షత్రంలో సోమనాథంలో రుద్రాభిషేకం చేయించుకుంటే మంచి ఫలితాలు పొందగలరు.

మిధునరాశి:

వారి జ్యోతిర్లింగం నాగేశ్వర లింగం. ఈ రాశి బుధునికి స్వగృహం. గ్రహదోషాలకు నాగేశ్వర పుణ్య క్షేత్ర దర్శన, రోజూ యామ్యే సదంగే నగరే తిరమ్యే విభ్శితాంగం వివిధైశ్చ భోగై, సద్భక్తి ముక్తి ప్రదమేకం, శ్రీనాగనాథం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని పఠించడం, ఈ రాశిలో శని సంచారకాలంలో కైలాసయంత్రప్రస్తార మహాలింగార్చన జరిపిస్తే విశేష ఫలితాలు ఉంటాయి.

కర్కాటకరాశి:

వారికి ఓంకారేశ్వరలింగం పూజనీయ జ్యోతిర్లింగం. ఈ రాశి చంద్రునికి స్వగృహం. ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం, రోజూ కావేరికా నర్మదాయో పవిత్రే, సమాగమే సజ్జన తారణాయ, సడైవమాన్దాత్రు పురే వసంతం, ఓం కారమీశం శివమే మీడే అనే శ్లోకం పఠించడం, జన్మనక్షత్రం ఉన్న రోజు ఓంకార బీజాక్షరం జపించడం శుభకరం.

సింహరాశి:

వారికి పూజనీయమైన జ్యోతిర్లింగం శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం. సింహరాశి సూర్యునకు స్వగృహం. ఘృష్ణేశ్వర  జ్యోతిర్లిగం దర్శనం, ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసాంతం చ జగద్వ రేణ్యం, వందే మహాదారాతర స్వభావం, ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని నిత్యం పఠించడం ద్వారా సర్వదోషాల నుండి విముక్తులు కావచ్చు.

Also Readపెళ్లి కావట్లేదా అయితే ఒక్క సారి ఈగుడిని దర్శించండి..

కన్యారాశి:

వారికి శ్రీశైల జ్యోతిర్లింగం పూజాలింగం. ఈ రాశికి అధిపతి బుధుడు. వీరు అన్నిరకాల బాధల నుండి ఉపశమనం పొందడానికి శ్రీశైల మల్లికార్జున దర్శనం, భ్రమరాంబకు కుంకుమ జన్మనక్షత్రం రోజున చండీ హోమం చేసుకోవాలి. శ్రీశైల శృంగే విభుధాతి సంగే తులాద్రి తుంగేపి ముదావసంతం, తమర్జునం మల్లిక పూర్వమేకం, నమామి సంసార సముద్ర సేతుం అనే శ్లోకాన్ని పఠించడం శ్రేయస్కరం.

తులారాశి:

వారికి పూజాలింగం మహాకాళేశ్వర లింగం. ఈ రాశికి శుక్రుడు అధిపతి. మహాకాళేశ్వర దర్శనం, శుక్రవారపు సూర్యోదయ సమయంలో ఆవన్తికాయం విహితావరం, ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం, అకాల మ్రుత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం అనే శ్లోకాన్ని పఠించడం వల్ల అన్ని గ్రహదోషాల నుండి, బాధల నుండి విముక్తి పొందవచ్చు.

వృశ్చికరాశి:

వారికి వైద్యనాథేశ్వర లింగం పూజాలింగం. ఈ రాశికి కుజుడు అధిపతి, వృశ్చికం వైద్య వృత్తికి, శస్త్రచికిత్సలకి కారణభూతమైన రాశి. వైద్యనాథేశ్వరుని దర్శించడం, పూజించడం, మంగళవారం పూర్వోత్తరె ప్రజ్వాలికానిధానే, సాదావసంతం గిరిజాసమేతం, నురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్యనాదం తమహం నమామి అనే శ్లోకాన్ని పఠించడం శ్రేయస్కరం.

ధనూరాశి:

వారికి విశ్వేశ్వరలింగం పూజాలింగం. ఈ రాశి వారికి గురుడు అధిపతి, సానందవనే వసంతం. ఆనందకందం హతపాపబృందం వారణాసీనాథ మనాథనాథం, శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని పారాయణ చేయడం, కాశీ క్షేత్ర దర్శనం, గురువారం రోజున, శనగల దానం ద్వారా శని, గురూ గ్రహదోషాల నుండి విముక్తి పొందవచ్చు.

మకరం:

వారికి భీమశంకర లింగం  పూజాలింగం. ఈ రాశి అధిపతి శని. ఇది గురునికి నీచ, కుజునికి ఉచ్ఛ, తెలిసో, తెలియకో చేసిన దోషాల నుంచి విముక్తికిగాను భీమశంకర దర్శనం, యం ఢాకినీ శాకినికాసమాజైః నిషేమ్యమాణం పిశితశనైశ్చ, సదైవ భీమాదిపద ప్రసిద్ధం, తం శంకరం భూతహితం నమామి అనే శ్లోకాన్ని పారాయణ చేయడం, శనివారం నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు దానం ఈవాడం, అవిటివారికి ముసలివారికి వస్త్ర దానం చేయడం మంచిది.

కుంభరాశి:

వారికి కేదారేశ్వర లింగం శేయోలింగం. ఈ రాశికి శని అధిపతి. గ్రహపీడలు, శత్రుబాధలు, ఇతర దోషాల విముక్తికిగాను ఈ రాశివారు కేదారేశ్వర దర్శనం. నిత్యం మహాద్రి పార్శ్వేచ మునీంద్రైః సురాసురై ర్యక్ష మహోరగాద్యైః కేదారమీశం శివమేక మీడే అనే శ్లోకాన్ని పారాయణం చేయాలి.శనివారం రుద్రాభిషేకం చేస్తే మంచిది.

Also Readఅన్నదానం చేసేటపుడు 100 లో 99 మంది చేసే అతి పెద్ద తప్పు

మీనరాశి:

వారికి త్ర్యంబకేశ్వర లింగం  జ్యోతిర్లింగం. ఈ రాశి అధిపతి గురుడు. త్ర్యంబకేశరుడు ఎప్పుడూ నీటి మద్యలో ఉంటాడు. త్ర్యంబకేశ్వర దర్శనం, స్వామి చిత్రపటాన్ని పూజామందిరంలో ఉంచుకోవడం, నిత్యం సహ్యాద్రి శీర్షే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్ర దేశే, యద్దర్శనాత్ పాతకమాశునాశం, ప్రయాతి తం త్ర్యంబక మీశ మీడే అనే శ్లోకాన్ని పారాయణం చేయటం సకల శుభాలను కలిగిస్తుంది.

Famous Posts:

12 jyotirlingas, mallikarjuna in telugu, jyotirlinga sloka, story of jyotirlinga, bhimashankar temple history in telugu, vishweshwar jyotirlinga, ujjain mahakaleshwar telugu, 12 jyotirlinga significance, ujjain temple history in telugu,  zodiac signs

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS