క్షవరం ఎప్పుడు చేయించుకోవాలి? క్షవరం ఏ ఏ రోజుల్లో చేయించుకుంటే మంచిది. Which Days is Best For Hair Cutting


 సర్వ సాధారణంగా ప్రస్తుత కాలంలో మనకు సమయం దొరికినప్పుడు మాత్రమే కటింగ్ చేసుకుంటూ ఉన్నాం , కానీ క్షురకర్మలకు శాస్త్ర రిత్య కొన్ని సూచనలు ఉన్నాయి వారంలో ఏ రోజు మనం కటింగ్ చేయించు కుంటే వాటి ఫలితాలు ఎలా ఉంటాయో శాస్త్ర పరంగా గమనిద్దాం.
ఇది శాస్త్రాన్ని నమ్మిన వారికి మాత్రమే పూర్వ పద్ధతులను తెలియ జేయడం జరుగినది. ఇందులో చాలా పద్దతులు ఉన్నాయి. ఉదయం 12 గంటల లోపు చేయించుకున్న శుభం కలుగుతుంది. రాత్రి సమయంలో కటింగ్ చేసుకోకూడదు. తండ్రి కొడుకులు, అన్నదమ్ములు  ఒకే రోజు చేసుకో కూడదు.

Also Readమీరు పడుకునే విధానం బట్టి మీ గత జన్మ ఎలాంటిదో తెలుసుకోవచ్చు?

ఆదివారము:

ఒక మాసము ఆయువు తగ్గిపోతుంది. తత్ ఫలితంగా శరీరం అధిక వేడి పొందుతుంది.

సోమవారముము:

ఏడు మాసములు ఆయువు వృద్ధి చెందును , సౌఖ్యం కలుగ జేస్తుంది. పుత్రులు కోరుకునే గృహస్థులు, ఒకే ఒక పుత్రుడు గలవారు క్షవరము చేయించుకోనగూడదు.

మంగళవారముము:

ఏనిమిది మాసములు ఆయువు తగ్గిపోతుంది. తత్ ఫలితంగా దు:ఖం కలుగజేస్తుంది.

బుధవారముము:

ఐదు మాసములు ఆయువు వృద్ధి చెందును. పుష్టిని కలుగ జేస్తుంది.

గురువారముము:

పది మాసములు ఆయువు వృద్ధి చెందును. లక్ష్మిని కోరుకునేవారు గురువారమునాడు క్షవరము చేయించుకోనగూడదు. తత్ ఫలితంగా ధన నాశనం కలుగజేయును.

శుక్రవారముము:

పదకొండు మాసములు ఆయువు వృద్ధి చెందును. తత్ ఫలితంగాశక్తి తగ్గును అక్కా ,చెల్లెళ్ళు కలవారు చేయించుకో రాదు.

శనివారముము:

ఏడు మాసములు ఆయుక్షీణమ్ కలిగించును. తత్ ఫలితంగా రోగ వృద్ధిని కలుగజేయును.

క్షురకర్మకు అనుకూలమైన తిధులు :-

విదియ, తదియ, పంచమి, సప్తమి, త్రయోదశి, తిధులు శుభం.

క్షురకర్మకు ప్రతికూలమైన తిధులు :-

ఆదివారం , శనివారం , మంగళవారంనాడు క్షురకర్మ చేయించుకున్న మంచిదికాదు.

క్షురకర్మకు అనుకూలమైన నక్షత్రాలు :-

హస్త  , చిత్త , స్వాతి , పునర్వసు, పుష్యమీ, మృగశిర , ధనిష్ఠ , శతభిషం, అశ్విని , రేవతి, నక్షత్రాలలో శుభం.

క్షురకర్మకు ప్రతికూలమైన నక్షత్రాలు:-

మఖ , కృత్తిక , ఉత్తర, అనురాధ, ఈ నక్షత్రాలలో చేసుకోవద్దు.

Famous Posts:

గుడికి ఎందుకు వెళ్ళాలి? దాని వెనక రహస్యాలు


ఉపయోగం ఉత్తమ పరిహారాలు - చిట్టి తంత్రాలు


తిరుమల వెళ్ళే ప్రతి ఒక్కరు చేయవలసిన పనులు


ఎవరితో పెళ్లి జరగాలో ఈ స్వామి వారు నిర్ణయిస్తాడు


మీరు పడుకునే విధానం బట్టి మీ గత జన్మ ఎలాంటిదో తెలుసుకోవచ్చు?


విగ్రహానికి చర్మం, స్వేదం, వెంట్రుకలు...ప్రపంచంలో ఏకైక విగ్రహం


పాపాలను, శాపాలను పోగొట్టి, కష్టాలను తీర్చి, ఆయుష్షును పెంచే ఆదిత్య హృదయం.

హెయిర్ కట్, క్షవరం , మంగళవారం , nail cutting days in Telugu, hair cutting days in Telugu, hair, cutting, Thursday, can we cut hair on Tuesday.

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS