తుల‌సి_చెట్టు మారే స్థితిని బ‌ట్టి ఆ ఇంట్లో ఏం జ‌రుగుతుందో ముందే చెప్ప‌వ‌చ్చ‌ట‌ | Tulasi Plant | Hindu Temple Guide

తుల‌సి వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల మ‌నం ప‌లు అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవచ్చు. ఆధ్యాత్మికంగానూ తుల‌సి చెట్టు ఇంట్లో ఉంటే మంచిద‌ని, దాని వల్ల అంతా మంచే జ‌రుగుతుంద‌ని చెబుతారు.అయితే..

ఇంట్లో ఉన్న తుల‌సి చెట్టు అప్పుడ‌ప్పుడు ప‌లు కార‌ణాల వ‌ల్ల త‌న స‌హ‌జ రంగును కోల్పోవ‌డ‌మో, లేదంటే ఉన్న‌ట్టుండి ఆకులు స‌డెన్‌గా ఎండిపోవ‌డ‌మో, రాల‌డ‌మో ఇలా భౌతికంగా అనేక ర‌కాలుగా ఆ చెట్టు మార్పులు చెందుతుంద‌ట‌. దీంతో ఆ ఇంట్లో ఉండే వారికి భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో ఇట్టే తెలుసుకోవ‌చ్చ‌ట‌. ఈ క్ర‌మంలో తుల‌సి చెట్టు ఎలా మారితే దాని ఫ‌లితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

తుల‌సి చెట్టు ఆకులు స‌డెన్‌గా వేరే ఏదైనా రంగుకు మారితే దాన‌ర్థం ఏమిటంటే… ఆ ఇంట్లో ఉన్న‌వారిపై ఎవరో తాంత్రిక, క్షుద్ర శ‌క్తులు ప్ర‌యోగించ‌బోతున్నార‌ని అర్థం. అలా ప్ర‌యోగించి వారిని నాశ‌నం చేయాల‌ని చూస్తే అప్పుడు తుల‌సి ఆకులు రంగు మారుతాయ‌ట‌.

నిత్యం నీళ్లు పోస్తూ చ‌క్క‌గా పెంచుతున్న తుల‌సి చెట్టు ఆకులు స‌డెన్‌గా ఎండిపోతే దానర్థం ఏమిటంటే… ఆ ఇంటి య‌జ‌మానికి మ‌రి కొద్ది రోజుల్లో ఆరోగ్యం ప‌రంగా కీడు జ‌ర‌గ‌బోతుంద‌ని అర్థం. ఏదైనా పెద్ద అనారోగ్యం బారిన అత‌ను ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ట‌.

Also Readఅన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి.. 

తుల‌సి చెట్టుకు ఒక వేళ నీళ్లు పోయ‌కున్నా బాగా ప‌చ్చ‌గా, ఏపుగా పెరుగుతుంటే అప్పుడు ఆ ఇంట్లో ఉన్న‌వారంద‌రికీ అదృష్టం క‌ల‌సి రాబోతుంద‌ని అర్థం. భ‌విష్య‌త్తులో అలాంటి వారికి సంప‌ద బాగా వ‌స్తుంద‌ట‌.

తుల‌సి చెట్టును ఉంచిన కుండీలో దానంత‌ట అదే మ‌రో తుల‌సి మొక్క పుట్టుకు వ‌స్తే ఆ ఇంట్లో వారికి కెరీర్ ప‌రంగా మంచి జ‌రుగుతుంద‌ట‌. అనుకున్న గోల్స్ సాధిస్తార‌ట‌.

తుల‌సి చెట్టు ఏదైనా కార‌ణాల వ‌ల్ల ఎండిపోతే వెంట‌నే దానికి నీళ్లు పోసి మళ్లీ ప‌చ్చ‌గా ఎదిగే వ‌ర‌కు జాగ్ర‌త్త‌గా పెంచాల‌ట‌. అలా చేయ‌క‌పోతే మంచి జ‌ర‌గ‌ద‌ట‌.

తుల‌సి చెట్టు ప‌చ్చ‌గా ఉన్న ఇంట్లో ఎల్ల‌ప్పుడూ సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయ‌ట‌. అలాంటి వారికి ఎలాంటి స‌మ‌స్య‌లు రావ‌ట‌.

Famous Posts:

శివ గుణాలు లోకానికి సందేశాలు


భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?


కూతురా కోడలా ఎవరు ప్రధానం...? 


సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?


కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?


మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి 


సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం 


మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.


భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?

తుల‌సి చెట్టు, Importance of Tulasi, tulasi chettu pooja, adavi tulasi plant in telugu, Tulasi Plant, vastu for tulsi plant at home in telugu, tuluasi mantram, tulasi images

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS