దిష్టి, దృష్టి - నివారణ మార్గాలు | Nara Drishti Remedies | Remedies of Dishti Problems

'నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా నలిగిపోతుంది' అనే మాట మనకు తరచూ వినిపిస్తుంది. దిష్టి తీయడమనే ప్రక్రియ అనాది నుంచి ఉన్నదే. ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఆ విద్యుత్ ప్రవాహం అవతలివారిపై వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు వాళ్లకి తలనొప్పి రావడం, వికారపెట్టడం, వాంతులు కావడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఇక నిద్రలేవగానే గానీ, ఉదయమే బయటికి వస్తూ గాని ఎదుటివారిని చూసినప్పుడు వాళ్లు అస్వస్థతకు లోనవుతుంటారు. అప్పట్లోనే ఈ విషయాన్ని గమనించిన పెద్దలు, నిద్రలేవగానే ఎవరికి వారు ముందుగా తమ అరచేతులను చూసుకోవాలని చెబుతారు. చేతి మొదట్లో శ్రీమహావిష్ణు, మధ్యలో సరస్వతీదేవి, చివరన లక్ష్మీదేవి ఉంటుందని అంటారు. అరచేతిలో వారిని దర్శించిన తరువాతనే మిగతా వారిని చూడాలని చెబుతారు.

దృష్టి దోషం, చెడు చూపు, దయ్యం చూపు, దిష్టికి విరుగుళ్ళు గా ఎండు మిరపకాయలు, రాళ్ల ఉప్పు, నల్ల తాడు, నిమ్మకాయల దండ, పసుపు, సున్నం కలిపిన నీళ్లు, ఇంటి గుమ్మానికి వేళ్ళాడదీసిన గుమ్మడికాయ, తలుపుపై వెలసిన దెయ్యం బొమ్మ, కొత్త వాహనాలకి కట్టిన నిమ్మకాయల దండ, చంటి బిడ్డ నుదిటిపై పావలా కాసంత నల్లటి చుక్క, పెళ్లి కూతురి బుగ్గన కాటుక చుక్క, మెడలో తావీజు. పచ్చిమిరపకాయలు, ఈత ఆకుల చీపురు, పాత చెప్పు లాంటివి వాడుతారు.

ఇక దిష్టి తగిలిన వారికి ఉప్పు, మిరపకాయలు వంటివి తల మీదుగా చుట్టూ తిప్పడం అంటే, ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్ కిరణాలను, వలయాన్ని సృష్టిస్తూ విశ్చిన్నం చేయడమన్నమాట. అయితే ఇలాంటివి అందుబాటులో లేనప్పుడు, దిష్టి తగిలిన వాళ్లు ఇబ్బందిపడుతూనే ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి. రేణుకాదేవి నామాలను స్మరించడం వలన ఆమె స్తోత్రాలు చదువుకోవడం మూలంగా దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడొచ్చు.

హారతులివ్వడం, గుమ్మడికాయలు పగులగొట్టడం భోజనం చేసేటప్పుడు హఠాత్తుగా ఎవరైనా వస్తే వారిని కూడా భోజనానికి కూర్చోమని చెప్పాలి. లేదా వారికి కనీసం ఏదైనా పండో, పానీయమో ఇవ్వాలి. భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్ద తీసి కాకికి వేయడం లేదా భగవంతుని తల్చుకుని కన్నులకు అద్దుకుని తినడం.. కర్పూరం బిళ్లను చుట్టూ తిప్పి దానిని వెలిగించటం నుదుటన అగరుతో బొట్టు పెట్టడం, మొలతాడు కట్టడం, మెడలో ఆంజనేయస్వామి లేదా ఇతర దేవతా మూర్తుల ప్రతిమలను కట్టడం కొత్త దుస్తులు ధరించబోయే ముందు అందులోంచి ఒక దారం పోగు తీసి నిప్పులో పడేయటం లేదా ఆ వస్త్రం మూల కాటుకతో చుక్క పెట్టటం తినే ఆహార పదార్థాన్ని 7 సార్లు దిగదుడిచి దానిని కుక్కకు లేదా ఆవుకు తినిపించటం ఆంజనేయస్వామిని ఉపాసించడం, ఈశ్వరారాధన లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, దుర్గ, కాళి, గౌరి తదితర దేవతలను ఆరాధించడం సంధ్యాసమయంలో దీపం పెట్టడం, అగరుబత్తులు వెలిగించడం సాంబ్రాణి ధూపం వేయడం కోడిగుడ్డును 7 సార్లు దిగదుడిచి 4 వీధుల కూడలిలో ఉంచి దానిపై నీరు పోయడం మంత్రాలు రాసిన తాయెత్తును తీసుకొచ్చి, దానిని పిల్లల జబ్బకు లేదా మెడలో కట్టటం లాంటివి చేస్తారు.

గృహాలు, దుకాణాల్లో ఎలా దిష్టి తీయాలి?

దిష్టి, దృష్టి అనేవి వ్యక్తులకు మాత్రమే కాక వారి వృత్తి, వ్యాపారల మీద, పంటపొలాలు, గృహాలు, కోళ్ళఫారం.. వంటి వాటిపై కూడా ఉంటాయి. అంటే సకల జీవరాశులకు, పొలాలు, వాహనాలు, గృహాలకే కాక అన్ని వ్యాపార సంస్థలపై దిష్టి ప్రభావం ఉంటుంది. ఎలాంటి గృహమైనా, వ్యాపార సంస్థ అయినా మన్ను, ఉప్పు, మిరపకాయలు, ఆవాలు, గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మపండులతో దిష్టి తీయడం మంచిది.

శనివారం సంధ్యా సమయాన సముద్రపు నీటితో గానీ, గోమయంతో గానీ దుకాణాలను, ఇళ్లను శుభ్రం చేయాలి. అలాగే దుకాణాలపై భాగాన కానీ, పూజాస్థలంలో గానీ గుమ్మడి పైభాగంలో కొంతభాగంగా కోసి, అందులో పసుపు, సున్నం కలిపిన నీరు పోసి దిష్టి తీయడం మంచిది.

Also Readఒక స్త్రీ పురుషుని నుండి ఏమి కోరుకుంటుంది..?

ఇలా టెంకాయతో గానీ, మన్ను, ఉప్పు. మిరప, ఆవాలతో దుకాణాలకు దిష్టి తీయవచ్చు. గుమ్మడి, టెంకాయలను గృహం ముందు లేదా దుకాణాల ముందు దిష్టి తీసి పగులకొట్టాలి. ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం చేయాలి. స్త్రీలు మాత్రం ఎప్పుడూ గుమ్మడికాయ పగుగొట్టకూడదు. అవివాహిత పురుషులు, పెళ్లై ఇంకా సంతానం కలగనివారు గుమ్మడి కాయ పగులగొట్టరాదు.

ఇంకా చెప్పాలంటే.. ప్రతిరోజూ సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్ళు చల్లి, ఎండాకా లైట్లు వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గిపోతుంది. శుక్ర శనివారాలు దీపాలు పెట్టాకా, ఒక గంట తర్వాత నిమ్మకాయతో దిష్టి తీయడం ద్వారా వ్యాపారవృద్ధి కలుగుతుంది.

Also Readపిల్లల పెంపకంలో ప్రతి తల్లి తండ్రి చేస్తున్న అతి పెద్ద తప్పులు ఇవే  

బాల గ్రహ దోషముల నివారణకు..

పిల్లలకు దిష్టి తీసే సమయంలో, పళ్లెంలో నీళ్లు పోసి, అందులో కుంకుమ వేసి, మరొక పళ్లెం తీసుకుని అందులో కుంకుమతో కలిపిన మూడు అన్నము ముద్దలు కలిపి అందులో వేసి, దిష్టి తీసి, ఇంటికి దూరంగా బయట మూడు దారులలో పోయాలి. ఇలా చేస్తే బాల గ్రహ దోషములు పోవును.

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు


ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు


ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే


అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం


అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం


ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే


గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?


శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

దిష్టి, దృష్టి - నివారణ మార్గాలు, Remedies Of Nara Dishti, Dishti chukkam, పిల్లలకు దిష్టి, Nara Drishti, drishti dosha pariharam, how to remove drishti for myself, 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS